Crore in cash
-
రాసిపెట్టి ఉండటమంటే ఇదేనేమో.. రాత్రికి రాత్రే కోటీశ్వరులయ్యారు!
రాసి పెట్టి ఉండాలే గానీ.. తమకంటూ రావాల్సిన సొమ్ము దానంతట అదే వస్తుందనే సామెత నిజమైంది. పాతబడిన ఇళ్లకు మెరుగులు దిద్దే క్రమంలో ఓ జంటకు ఊహించని రీతితో ఏకంగా రూ.2కోట్లకు పైగా విలువ చేసే బంగారు నాణేలు లభించాయి. దీంతో వారి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఈ ఘటన యూకేలో చోటుచేసుకుంది. ది టైమ్స్ కథనం ప్రకారం.. నార్త్ యార్క్ షైర్లోని ఎల్లెర్బీ గ్రామంలో ఓ జంటకు పాతబడిన ఇళ్లు ఉంది. దీంతో తమ పాతబడిన ఇంటిని బాగుచేసుకునేందుకు వారు రెడీ అయ్యింది. ఈ క్రమంలో తమ ఇంట్లోని కిచెన్‌ను బాగుచేయడం కోసం తవ్వకాలు జరిపారు. అనూహ్యంగా ఒక ప్లేస్‌లో గునపానికి ఏదో తగిలిన శబ్ధం రావడంతో షాకయ్యారు. మరికాస్త తవ్వగా, ఓ లోహపు క్యాన్ కనిపించింది. క్యాన్‌ను బయటకు తీసి ఓపెన్ చేసి చూడగా బంగారు నాణేలు కనిపించాయి. దీంతో వారి ఆనందం ఒక్కసారిగా రెట్టింపు అయ్యింది. అయితే, ఆ నాణేలపై 1610-1727 నాటి ముద్రలు ఉన్నాయి. ఇవి ఒకటో జేమ్స్, ఒకటో చార్లెస్ రాజుల కాలం నాటివని అంచనా వేశారు. దాదాపు 264 బంగారు నాణేలు వారికి దొరికాయి. ప్రస్తుతం వాటి విలువ దాదాపు.. ఇప్పటి మార్కెట్ ప్రకారం రూ.2.3 కోట్లు ఉంటుందని అంచనా వేశారు. ఈ జంట త్వరలోనే తమ ఇంట్లో దొరికిన నాణేలను విక్రయించనుంది. అందుకోసం వారు ఓ వేలం సంస్థను కూడా సంప్రదించినట్టు సమాచారం. #UK Couple Find Gold Coins Worth Rs 2.3 Crore Buried Under Their Kitchen Floor: Report #News #2022 https://t.co/BHJhZgNrQN — Real News Time (@ErdenSorgul) September 2, 2022 -
గోడల్లోనే గూడు
సాక్షి, హైదరాబాద్: మహానగరంలో ఇల్లు కొనాలంటే కోట్ల డబ్బుతో కూడుకున్న వ్యవహారం. అందుకే ఉన్నంత స్థలంలోనే ఉన్నతంగా అన్ని వస్తువులను అందంగా అమర్చుకోవటం ఒక కళ. దీనికి కావాల్సిందల్లా కొద్దిపాటి సృజనాత్మకత మాత్రమే. సౌకర్యాల ఆలోచనలు: 600 చ.అ. నుంచి 750 చ.అ. విస్తీర్ణంలో ఒక హాలు, వంట గది, పడక గది, పూజ గది, వీటిని ఆనుకునే మరుగుదొడ్డి నిర్మించుకునే అవకాశం ఉంది. హాలులో సోఫాసెట్, టీవీ, డైనింగ్ టేబుల్, దివాన్‌కాట్ అమర్చుకోవచ్చు. వంట గదిలోనే ఉడెన్ కప్బోర్డు, స్టీల్ బాస్కెట్స్, చిమ్నీ, నిత్యావసర సరకులతో పాటు వంట సామగ్రి ఉండేలా అమర్చుకోవచ్చు. పడకగదిలో రెండు మంచాలతో పాటు గోడలకే అమర్చే కప్ బోర్డ్‌లోనే దుస్తులు, నగదు, బంగారం తదితర విలువైన వస్తువులు పెట్టే ఏర్పాటు చేసుకోవచ్చు. అన్నీ గోడల్లోనే: టీవీ మొదలుకొని బీరువా, మైక్రోఓవెన్ వంటివాటిని గోడల్లోనే అమర్చుకునేలా ప్రణాళికలున్నాయి. మరోవైపు సోఫానే మంచంగా మలుచుకునేలా రెడీమేడ్‌గా తయారైనవి మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. డ్రెస్సింగ్ టేబుల్ కూడా హాలులో కానీ, పడక గదిలోనే ఒక గూటికి అమర్చుకునేలా నిపుణులు తయారు చే స్తున్నారు.