గోడల్లోనే గూడు | racks in walls | Sakshi
Sakshi News home page

గోడల్లోనే గూడు

Published Sat, Aug 16 2014 1:42 AM | Last Updated on Tue, Sep 4 2018 5:07 PM

racks in walls

సాక్షి, హైదరాబాద్: మహానగరంలో ఇల్లు కొనాలంటే కోట్ల డబ్బుతో కూడుకున్న వ్యవహారం. అందుకే ఉన్నంత స్థలంలోనే ఉన్నతంగా అన్ని వస్తువులను అందంగా అమర్చుకోవటం ఒక కళ. దీనికి కావాల్సిందల్లా కొద్దిపాటి సృజనాత్మకత మాత్రమే.

 సౌకర్యాల ఆలోచనలు: 600 చ.అ. నుంచి 750 చ.అ. విస్తీర్ణంలో ఒక హాలు, వంట గది, పడక గది, పూజ గది, వీటిని ఆనుకునే మరుగుదొడ్డి నిర్మించుకునే అవకాశం ఉంది. హాలులో సోఫాసెట్, టీవీ, డైనింగ్ టేబుల్, దివాన్‌కాట్ అమర్చుకోవచ్చు. వంట గదిలోనే ఉడెన్ కప్‌బోర్డు, స్టీల్ బాస్కెట్స్, చిమ్నీ, నిత్యావసర సరకులతో పాటు వంట సామగ్రి ఉండేలా అమర్చుకోవచ్చు. పడకగదిలో రెండు మంచాలతో పాటు గోడలకే అమర్చే కప్ బోర్డ్‌లోనే దుస్తులు, నగదు, బంగారం తదితర విలువైన వస్తువులు పెట్టే ఏర్పాటు చేసుకోవచ్చు.

 అన్నీ గోడల్లోనే: టీవీ మొదలుకొని బీరువా, మైక్రోఓవెన్ వంటివాటిని గోడల్లోనే అమర్చుకునేలా ప్రణాళికలున్నాయి. మరోవైపు సోఫానే మంచంగా మలుచుకునేలా రెడీమేడ్‌గా తయారైనవి మార్కెట్‌లో అందుబాటులో ఉన్నాయి. డ్రెస్సింగ్ టేబుల్ కూడా హాలులో కానీ, పడక గదిలోనే ఒక గూటికి అమర్చుకునేలా నిపుణులు తయారు చే స్తున్నారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement