UK PM theresa may
-
Russia War: యుద్ధం వేళ పుతిన్ సంచలన నిర్ణయం
మాస్కో: ఉక్రెయిన్‌లో రష్యా బలగాలు దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. యుద్ధం వేళ రష్యా మరో సంచలన నిర్ణయం తీసుకుంది. బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్‌పై రష్యా నిషేధం విధించింది. బోరిస్ జాన్సన్ రష్యాలోకి రాకుండా ఉండేలా చర్యలు తీసుకున్నది. అయితే, ఉక్రెయిన్‌లో యుద్దం జరుగుతున్న సమయంలో బ్రిటన్ ప్రధాని బోరిస్.. యుద్ద ప్రభావిత ఉక్రెయిన్‌లో పర్యటించారు. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీతో కలిసి అక్కడి పరిస్థితులను ప్రత్యక్షంగా తిలకించారు. ఆ తర్వాత రష్యా దాడులను తీవ్రం ఖండించారు. ఇక, అంతకు ముందే యూరోపియన్ యూనియన్, యూకే.. రష్యాపై భారీ ఆంక్షలు విధించాయి. రష్యాకు చెందిన 350 మంది వ్యక్తులు, సంస్థలపై ఆంక్షలు విధించాయి. అంతేకాకుండా రష్యాకు లగ్జరీ వస్తువుల ఎగుమతిని నిషేధించాయి. దీంతో రష్యా.. బ్రిటన్‌పై ఆంక్షలు విధిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ సందర్భంగా రష్యా విదేశాంగ మంత్రి లిజ్ ట్రాస్ స్పందిస్తూ.. బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్‌తో పాటుగా మాజీ ప్రధాని థెరిసా మే, స్కాట్లాండ్ మినిస్టర్ నికోలా స్టర్జియన్‌తో పాటు మరో 13 మంది బ్రిటీష్ ప్రభుత్వాధికారులపై నిషేధాన్ని విధిస్తున్నట్లు తెలిపారు. రష్యా సీనియర్ అధికారులపై బ్రిటన్ చర్యలు తీసుకున్న నేపథ్యంలో రష్యా కూడా ఆంక్షలను విధించినట్టు పేర్కొన్నారు. ఇదిలా ఉండగా.. ఉక్రెయిన్‌తో పోరులో రష్యాకు వ్యతిరేకంగా ఉన్నారని పుతిన్ ఇప్పటికే అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, న్యూజిలాండ్ ప్రధాని, ఆస్ట్రేలియా ప్రధానితో సహా ఆయా దేశాలకు చెందిన ప్రముఖులపై నిషేధం విధించిన విషయం తెలిసిందే. మరోవైపు.. ఉక్రెయిన్‌లో రష్యా బలగాలు దాడులను తీవ్రతరం చేశాయి. ఉక్రెయిన్ రాజధాని కీవ్‌లో ఉన్న మిలిటరీ ఫ్యాక్టరీపై రష్యా సైన్యం దాడి చేసింది. హై ప్రిసిషన్ మిస్సైళ్లతో 16 శత్రు టార్గెట్లను ధ్వంసం చేసినట్లు రష్యా తెలిపింది. కీవ్‌తో పాటు మైకోలైవ్‌లో ఉన్న మిలిటరీ సామాగ్రిని రిపేర్ షాపును క్షిపణతో ధ్వంసం చేసినట్టు రష్యా అధికారులు వెల్లడించారు. #Russia has banned #British Prime Minister Boris Johnson and a number of politicians and parliamentarians from the United Kingdom from entering the country. pic.twitter.com/VvbrJChdIg — NEXTA (@nexta_tv) April 16, 2022 -
సోమేశ్వర ఆలయంలో బ్రిటన్ ప్రధాని
బెంగళూరు : బ్రిటన్ ప్రధానమంత్రి థెరిస్సా మే మంగళవారం బెంగళూరులో పర్యటించారు. పర్యటనలో భాగంగా ఆమె భారతీయ సంప్రదాయబద్ధంగా చీరను ధరించిన లసూరు సోమేశ్వరాలయాన్ని సందర్శించిన, ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం థెరిస్సా మే బెంగళూరులో వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. యలహంక సమీపంలోని స్టోనహళ్లి ప్రభుత్వ పాఠశాలను సందర్శించిన థెరిస్సా మే స్కూల్ విద్యార్థులతో సరదాగా గడిపారు, భారత్, బ్రిటన్ జెండాలు ఎగరవేస్తూ... విద్యార్థులుతో కలిసి కేరింతలు కొట్టారు. అలాగే కర్నాటక సీఎం సిద్దరామయ్యతో థెరిస్సా మే భేటీ అయ్యారు. ఈ సందర్భంగా పలు అంశాలపై చర్చించారు. -
భారత్-బ్రిటన్ ల మధ్య ప్రత్యేక అనుబంధం
న్యూఢిల్లీ: మూడు రోజుల పర్యటనకు భారత్ విచ్చేసిన బ్రిటన్ ప్రధానమంత్రి థెరిసా మే, భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో కలిసి సోమవారం యూకే టెక్ సమావేశంలో పాల్గొన్నారు. సమావేశంలో మాట్లాడిన మే.. భారత్-బ్రిటన్ ల మధ్య ప్రత్యేక అనుబంధం ఉందని అన్నారు. ప్రస్తుతం బ్రిటన్ లో ఆర్ధిక, సామాజిక రంగాల్లో విప్లవాత్మక మార్పులు తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నట్లు చెప్పారు. బ్రిటన్ లో భారత్ పెట్టుబడులు తమ ఆర్ధిక వ్యవస్ధ అభివృద్ధికి దోహదం చేస్తాయని అన్నారు. బ్రిటన్ ప్రధానమంత్రిగా పగ్గాలు చేపట్టిన తర్వాత తొలి యూరపేతర పర్యటనకు భారత్ ను ఎంచుకోవడం ఆనందంగా ఉందని భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. యూకే తాజాగా పెద్ద మొత్తంలో అభివృద్ధిని సాధించిందని గుర్తు చేశారు. అకడమిక్స్ తో పాటు ఆవిష్కరణలో యూకే ముందుందని చెప్పారు. తక్కువ ఖర్చులో వైద్యం, విద్యుత్తు, సాంకేతికతల్లో భారత్-యూకేల మధ్య వ్యాపారానికి అవకాశం ఉందని చెప్పారు. సౌరశక్తిపై పరిశోధనా అభివృద్ధి కేంద్రాన్ని ప్రారంభించాడానికి ఇరుదేశాలు పరస్పర అంగీకారాన్ని తెలిపాయని పేర్కొన్నారు. ప్రపంచ సమస్యలను పరిష్కరించేందుకు యూకే-భారత్ లు భవిష్యత్తులో కలిసి పనిచేయాలని కోరారు. భారత్-యూకే భాగస్వామ్యంలో మేక్ ఇన్ ఇండియా కీలకంగా ఉంటుందని భావిస్తున్నామని చెప్పారు.