సోమేశ్వర ఆలయంలో బ్రిటన్‌ ప్రధాని | UK PM Theresa May visits halasuru someshwara Temple | Sakshi
Sakshi News home page

సోమేశ్వర ఆలయంలో బ్రిటన్‌ ప్రధాని

Published Tue, Nov 8 2016 5:53 PM | Last Updated on Mon, Sep 4 2017 7:33 PM

సోమేశ్వర ఆలయంలో బ్రిటన్‌ ప్రధాని

సోమేశ్వర ఆలయంలో బ్రిటన్‌ ప్రధాని

బెంగళూరు : బ్రిటన్‌ ప్రధానమంత్రి థెరిస్సా మే మంగళవారం బెంగళూరులో పర్యటించారు. పర్యటనలో భాగంగా ఆమె భారతీయ సంప్రదాయబద్ధంగా చీరను ధరించిన  లసూరు సోమేశ్వరాలయాన్ని సందర్శించిన, ప్రత్యేక పూజలు చేశారు.  అనంతరం థెరిస్సా మే  బెంగళూరులో వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్నారు.

యలహంక సమీపంలోని స్టోనహళ్లి ప్రభుత్వ పాఠశాలను సందర్శించిన థెరిస్సా మే స్కూల్‌ విద్యార్థులతో సరదాగా గడిపారు, భారత్‌, బ్రిటన్‌ జెండాలు ఎగరవేస్తూ... విద్యార్థులుతో కలిసి కేరింతలు కొట్టారు‌. అలాగే కర్నాటక సీఎం సిద్దరామయ్యతో థెరిస్సా మే భేటీ అయ్యారు. ఈ సందర్భంగా పలు అంశాలపై చర్చించారు.

 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement