UK Sinha
-
స్టార్టప్‌ల లిస్టింగ్ నిబంధనలు మార్చేందుకు సిద్ధం
సెబీ చైర్మన్ యూకే సిన్హా న్యూఢిల్లీ: స్టార్టప్‌ల లిస్టింగ్ వేదికను మరింత ఆకర్షణీయంగా తీర్చిదిద్దేందుకు వీలుగా నిబంధనలను మార్చే విషయంలో సలహాలను పరిశీలించేందుకు సిద్ధంగా ఉన్నట్టు సెబీ చైర్మన్ యూకే సిన్హా చెప్పారు. అలాగే, ఫైనాన్షియల్ మార్కెట్లన్నింటికీ ఉమ్మడిగా ఒకే విడత వివరాలు అందించే నో యువర్ కస్టమర్ (నీ కస్టమర్ గురించి తెలుసుకోవడం) కేంద్రీకృత విధానాన్ని వచ్చే కొన్ని నెలల్లో అమల్లోకి తేనున్నట్టు సిన్హా తెలిపారు. దీంతో ఒకటి కంటే ఎక్కువ చోట్ల కేవైసీ సమర్పించాల్సిన అవసరం ఉండదన్నారు. ఢిల్లీలో జరిగిన 11వ డిజిటల్ ఇండియా సదస్సులో పాల్గొన్న సందర్భంగా సిన్హా మాట్లాడారు. ‘‘స్టార్టప్‌లకు సంబంధించి స్పష్టమైన కార్యాచరణను తీసుకొచ్చాం. అయినప్పటికీ ఒక్క కంపెనీ కూడా లిస్ట్ అవలేదు. మా వైపు నుంచి ఏదైనా కావాలని కోరుకుంటే స్టార్టప్‌ల సమస్యలను వినేందుకు, తగిన మార్పులు చేసేందుకు సెబీ సిద్ధంగా ఉంది. స్టార్టప్‌ల లిస్టింగ్‌కు సంబంధించి పరిశ్రమ వర్గాలతో ఇప్పటికే సంప్రదింపులు మొదలు పెట్టాం. వారి అభిప్రాయాల కోసం ఎదురు చూస్తున్నాం’’ అని సిన్హా చెప్పారు. స్టార్టప్‌ల లిస్టింగ్‌కు సంబంధించి ప్రమోటర్లు, లిస్టింగ్ ముందు నుంచీ ఉన్న ఇన్వెస్టర్ల లాకిన్ కాల వ్యవధిని గతంలో మూడేళ్లు ఉండగా దాన్ని సెబీ ఇప్పటికే ఆరు నెలలకు తగ్గించింది. దీనికితోడు డిస్క్లోజర్ నిబంధనలను కూడా సరళతరం చేసింది. -
ఫండ్స్ ద్వారా పెట్టుబడులు బెస్ట్!
రిటైల్ ఇన్వెస్టర్లకు సెబీ చైర్మన్ సలహా న్యూఢిల్లీ: మార్కెట్ రెగ్యులేటర్ సెబీ చైర్మన్ యూకే సిన్హా రిటైల్ ఇన్వెస్టర్లకు కీలక సూచన చేశారు. చిన్న ఇన్వెస్టర్లు ఇనిషియల్ పబ్లిక్ ఆఫర్స్ (ఐపీఓ)లో ప్రత్యక్షంగా పెట్టుబడులు పెట్టకపోతే తాను ఆందోళన చెందబోనని పేర్కొన్న ఆయన, ఆయా రిటైల్ ఇన్వెస్టర్లు పెన్షన్ ఫండ్స్, మ్యూచువల్ ఫండ్స్ వంటి వ్యవస్థల ద్వారా మార్కెట్లో పెట్టుబడులు పెట్టాలని సూచించారు. బుధవారం నాడు ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ ప్లానింగ్ ప్లాట్‌ఫామ్ 5నాన్స్డాట్కామ్ ‘ఆర్థిక శక్తి వైపు భారత్ అడుగులు’ పేరిట ఒక కార్యక్రమం నిర్వహించింది. ఈ కార్యక్రమంలో సెబీ చీఫ్ తాజా వ్యాఖ్యలు చేశారు. ఇంకా ఆయన ఏమన్నారంటే.. చిన్న ఇన్వెస్టర్ల దీర్ఘకాలిక ప్రయోజనాలు ముఖ్యం. ఇందుకుగాను వారు తగిన మార్కెట్ పరిజ్ఞానం వుంటే తప్ప ప్రైమరీ మార్కెట్లోకికానీ లేదా సెకండరీ మార్కెట్లోకిగానీ ప్రత్యక్షంగా ప్రవేశించకుండా ఉండడమే మంచిది. వారు ఇతర మార్గాల్లో (మ్యూచువల్, పెన్షన్ ఫండ్ల వంటివి) మార్కెట్ పెట్టుబడులు పెట్టడం మంచిదని భావిస్తున్నా. విశ్వాసం, సరళతరం, వెసులుబాటు అలాగే పెట్టుబడుల్లో ఆర్థిక రంగానికి సంబంధించి అవగాహన (విద్య) పెంపు వంటి అంశాలు మార్కెట్లోకి మరింతమంది రావడానికి దోహదపడుతుందని భావిస్తున్నా. ప్రపంచంలోనే ఉన్నత స్థాయి నిఘా విభాగాన్ని సెబీ కలిగిఉంది. ప్రతిరోజూ ఇన్వెస్టర్ల అప్రమత్తతకు అలర్ట్స్ జారీ చేయడం జరుగుతుంది. తమ దృష్టికి వచ్చిన అవకతవకల విషయంలో స్వయంగా విచారణసైతం నిర్వహించగల నిఘా వ్యవస్థ సెబీ సొంతం. ఈ పటిష్ట యంత్రాగం వల్ల స్టాక్ మార్కెట్‌ను దుర్వినియోగం చేసిన దాదాపు 900 కంపెనీలను సెబీ నిషేధించింది. పన్నులు ఎగ్గొడ్డానికి మార్కెట్‌ను వినియోగించుకున్న కేసుల్లో స్వయంగా కఠిన చర్యలు తీసుకుంటాం. ఇన్వెస్టర్ల వెసులుబాటుకు నో యువర్ క్లెయింట్ నిబంధనలను సెబీ సరళతరం చేసింది. మొత్తం ఆర్థిక వ్యవస్థలో ఏకైక కేవైసీ వ్యవస్థను నెలకొల్పడానికి ప్రభుత్వం, ఆర్బీఐ, ఐఆర్‌డీఏలతో చర్చలు జరుపుతోంది. ఇది త్వరలో కార్యరూపం దాల్చుతుందన్న విశ్వాసం ఉంది. -
అత్యాశతో కమోడిటీ మార్కెట్లోకి రావద్దు...
చిన్న ఇన్వెస్టర్లకు సెబీ చీఫ్ సిన్హా హెచ్చరిక ముంబై : తక్షణ లాభాలను ఆశించి కమోడిటీ మార్కెట్లోకి అడుగుపెట్టొద్దని చిన్న ఇన్వెస్టర్లను సెబీ చీఫ్ యూకే సిన్హా హెచ్చరించారు. కమోడిటీ లావాదేవీలు అత్యంత రిస్కుతో కూడినవని.. దీనికి చాలా నైపుణ్యం అవసమని కూడా ఆయన పేర్కొన్నారు. పీటీఐ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ విషయాలను చెప్పారు. కమోడిటీ ట్రేడింగ్‌ను నియంత్రించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని... వచ్చే నెలకల్లా కమోడిటీ మార్కెట్ నియంత్రణ సంస్థ ఎఫ్‌ఎంసీని సెబీలో విలీనం చేసే ప్రక్రియ పూర్తయ్యే అవకాశం ఉందన్నారు. ‘కమోడిటీ ట్రేడింగ్‌లో తక్కు వ మార్జిన్‌తో భారీ లాభాలను ఆర్జించవచ్చంటూ కొంతమంది ఆశలు రేకెత్తిస్తుంటారు. వారి వలలో పడొద్దు. కమోడిటీ మార్కెట్ అనేది నిపుణులు, అధిక రిస్క్‌లను తట్టుకోవడం కోసం, హెడ్జింగ్ చేసే వారికోసం ఉద్దేశించింది. అంతేకానీ, చెమటోడ్చి సంపాదించిన సొమ్మును ఇందులో పెట్టుబడిగా పెట్టి.. ట్రేడింగ్ చేయడం ఏమాత్రం మంచిది కాదు’ అని చిన్న ఇన్వెస్టర్లకు సిన్హా సూచించారు. -
కార్పొరేట్ రుణ ఎగవేతదారులపై చర్యలు
ముంబై:కావాలనే రుణాలు ఎగవేసే వారిపై(విల్‌ఫుల్ డిఫాల్టర్స్) చర్యలకు సంబంధించి ఆర్బీఐతో సంప్రతింపులు జరుపుతున్నామని స్టాక్ మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ చైర్మన్ యూకే సిన్హా చెప్పారు. సోమవారమిక్కడ బీఎస్ఈలో జరిగిన ఒక కార్యక్రమం సందర్భంగా ఆయన మాట్లాడారు. త్వరలోనే దీనికి సంబంధించిన నిబంధనలను ఖరారు చేయనున్నట్లు చెప్పారు. మొండిబకాయిల పెరుగుదలపై ఆందోళనల నేపథ్యంలో విల్‌ఫుల్ డిఫాల్లర్ల జాబితాలో ఉన్న కంపెనీలు, ప్రమోటర్లు స్టాక్ మార్కెట్ల నుంచి ఎలాంటి నిధుల సమీకరణలూ చేపట్టకుండా చర్యలు తీసుకోవాలని ఆర్బీఐ సెబీని కోరిన సంగతి తెలిసిందే. చట్టవిరుద్ధ నిధుల సమీకరణలపై ఉక్కుపాదం.. ప్రజల నుంచి చట్టవిరుద్ధంగా నిధులను సమీకరించే సంస్థలపై సెబీ కొరడా ఝులిపిస్తోంది. కలెక్టివ్ ఇన్వెస్ట్మెంట్ స్కీమ్(సీఐఎస్)ల ద్వారా సుమారు రూ.4,000 కోట్లను సమీకరించిన పలు కంపెనీలను ఆయా పథకాలు రద్దు చేయాల్సిందిగా సెబీ ఆదేశాలు జారీ చేసింది. అక్టోబర్ 1 నుంచి కొత్త కార్పొరేట్ గవర్నెన్స్ నిబంధనలు... లిస్టెడ్ కంపెనీలకు ఈ ఏడాది అక్టోబర్ 1 నుంచి కొత్త కార్పొరేట్ గవర్నెన్స్ నిబంధనలను అమలు చేయనున్నట్లు సిన్హా తెలిపారు. అదేవిధంగా లిస్టింగ్ అగ్రిమెంట్ కొత్త నిబంధనలూ వర్తింపజేయనున్నట్లు వెల్లడించారు. -
పోంజీ ఆర్డినెన్సుకు త్వరలో చట్ట రూపం
సెబీ చైర్మన్ సిన్హా ఆశాభావం న్యూఢిల్లీ: స్వల్ప కాలంలో అధిక ఆదాయాన్ని ఆశచూపి అక్రమ పద్ధతుల్లో పెట్టుబడులను ఆకర్షించే (పోంజీ) స్కీముల నిరోధానికి జారీ చేసిన ఆర్డినెన్సు త్వరలోనే చట్ట రూపం దాలుస్తుందని సెబీ చైర్మన్ యు.కె.సిన్హా ఆశాభావం వ్యక్తం చేశారు. శనివారం న్యూఢిల్లీలో జరిగిన ఓ సదస్సులో ఆయన ప్రసంగించారు. మదుపర్లను మోసగిస్తూ అక్రమ పద్ధతుల్లో డిపాజిట్ల సేకరణ ఇప్పటికీ భారీగా కొనసాగుతోందని పేర్కొన్నారు. పోంజీ వ్యతిరేక ఆర్డినెన్సును గతేడాది నుంచి ఇప్పటికి 3 సార్లు జారీ చేశా రు. వచ్చే నెలలో జరిగే పార్లమెంటు సమావేశాల్లో ఈ బిల్లును ఆమోదిస్తే చట్టరూపం దాలుస్తుంది. పన్ను ప్రయోజనాలపై స్పష్టత.. క్యాపిటల్ మార్కెట్లకు ప్రోత్సాహాన్నిచ్చేందుకు రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్టుల (ఆర్ఈఐటీ) వంటి కొత్త ప్రొడక్టులపై పన్ను ప్రయోజనాలకు సంబంధించి స్పష్టత ఇవ్వాలని ప్రభుత్వాన్ని సిన్హా కోరారు. ఇన్ఫ్రా ఇన్వెస్ట్మెంట్ ట్రస్టులు, డెబిట్ సెక్యూరిటీలకు ట్యాక్స్ బెనిఫిట్లపైనా స్పష్టత ఇవ్వాలని అన్నారు. ఆర్‌ఈఐటీలకు సంబంధించిన నిబంధనలను సెబీ త్వరలోనే ఖరారు చేస్తుందనీ, అయితే పన్ను సంబంధ అంశాల్లో స్పష్టత కోసం ఎదురుచూస్తున్నామనీ తెలిపారు. ఏకరీతి పన్నులు అవసరం.. బాండ్ మార్కెట్లో లోటుపాట్ల తొలగింపునకు ప్రభుత్వం సమగ్ర విధానాన్ని రూపొందించాల్సి ఉందని సెబీ చైర్మన్ పేర్కొన్నారు. ప్రస్తుతం బాండ్లలో పెట్టుబడులు చేసే సంస్థలపై పన్ను రేట్లు భిన్న రకాలుగా ఉన్నాయని చెప్పారు. లోటుపాట్లున్నంత కాలం వీటిలో పెట్టుబడులకు ఇన్వెస్టర్లు సందేహిస్తారని అన్నారు. ఇన్వెస్టర్లందరిపైనా పన్నులు ఒకే రకంగా ఉండాలని తెలిపారు. -
అక్రమార్కుల్లో చిన్నాపెద్దా తేడాలేదు
ముంబై: స్టాక్ మార్కెట్లో అవకతవకలు, మోసాలు, నిబంధనలను ఉల్లంఘించేవారెవరైనా వదిలిపెట్టే ప్రసక్తేలేదని నియంత్రణ సంస్థ సెబీ చైర్మన్ యూకే సిన్హా హెచ్చరించారు. అక్రమార్కుల్లో చిన్నాపెద్దా తేడాలేవీ సెబీకి ఉండవని కూడా స్పష్టం చేశారు. తప్పు చేసినవాళ్లలో బడా కార్పొరేట్ సంస్థలు, చిన్న ఇన్వెస్టర్లనే వ్యత్యాసం లేకుండా కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన పేర్కొన్నారు. ‘వాస్తవాలు, కేసు పరిస్థితి ఆధారంగానే మోసానికి పాల్పడేవారిపై సెబీ చర్యలు చేపడుతుంది. కేసులను వేగంగా దర్యాప్తు చేయడం కూడా ఇందులో భాగమే. నేరం చేసేవాళ్ల విషయంలో తరతమ భేదాలు ఉండవు’ అని సిన్హా వ్యాఖ్యానించారు. అవకతవకలకు పాల్పడే పెద్ద కంపెనీల విషయంలో ఒకవిధంగా, చిన్నవాళ్లపై మరోరకంగా సెబీ వ్యవహరిస్తోందనే విమర్శలపై ఆయన ఈ విధంగా స్పందించారు. మరోపక్క, అక్రమార్కులపై ప్రతాపం చూపుతున్నామనే బలమైన సందేశాన్ని పంపేందుకు... సెబీ తమపై మరీ దురుసుగా చర్యలు తీసుకుంటోందని కొన్ని కార్పొరేట్ దిగ్గజాలు ఆరోపిస్తున్న సందర్భాలూ ఉన్నాయి. పెద్ద కంపెనీలు ఎంతపెద్ద తప్పుచేసినా సెటిల్మెంట్ పేరుతో వదిలిపెడుతున్నారన్న ఒక అపప్రధ గతంలో ఎక్కువగా ఉండేదని.. ఇప్పుడు అలాంటిదేమీ లేదని స్వయంగా అందరూ గుర్తిస్తున్నారని సెబీ చీఫ్ చెప్పారు. అయితే, ఆ బడా కంపెనీలు, వ్యక్తుల పేర్లను ప్రస్తావించలేదు. ప్రస్తుతం తీవ్రమైన నేరాలకు పాల్పడేవారికి ఇలాంటి సెటిల్మెంట్ విధానాలను వర్తింపజేయడం లేదని కూడా సిన్హా పేర్కొన్నారు. ఇన్సైడర్ ట్రేడింగ్ కేసులో కన్సెంట్ సెటిల్మెంట్ విజ్ఞప్తిని తోసిపుచ్చిన సెబీ నిర్ణయాన్ని ముకేశ్ అంబానీకి చెందిన రిలయన్స్ ఇండస్ట్రీస్ సవాలు చేయడం తెలిసిందే. ఇంకా ఇన్వెస్టర్ల నుంచి అక్రమంగా నిధులు సమీకరించారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న సహారా గ్రూప్పైకూడా సెబీ ఉక్కుపాదం మోపింది. -
సెబి చీఫ్ నియామకాన్ని ఖరారుచేసిన సుప్రీంకోర్టు
సెబి ఛైర్మన్‌గా యు.కె. సిన్హా నియామకాన్ని సుప్రీంకోర్టు సమర్థించింది. ఈ మేరకు సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ ఎస్ఎస్ నిజ్జర్, జస్టిస్ హెచ్ఎల్ గోఖలేలతో కూడిన ధర్మాసనం శుక్రవారం తీర్పునిచ్చింది. ఆయన నియామకం నియమ నిబంధనలకు అనుగుణంగానే జరిగిందని స్పష్టం చేసింది. సిన్హా నియామకాన్ని సవాలుచేస్తూ అరుణ్ కుమార్ అగర్వాల్ అనే వ్యక్తి దాఖలు చేసిన పిటిషన్‌ను కొట్టేసింది. సెబి చీఫ్‌గా ఆయన నియామకంలో పలు అక్రమాలు చోటుచేసుకున్నాయని అగర్వాల్ ఫిర్యాదు చేశారు. అయితే, ఆయన వాదనలను సుప్రీంకోర్టు కొట్టేసింది. సెబి చట్టంలోని సెక్షన్ 4 సబ్ సెక్షన్ (5) ప్రకారం, ప్రభుత్వం గతంలో తెలిపిన విషయాల ప్రకారం చూసినా సెబి ఛైర్మన్‌గా నియమితమయ్యే వ్యక్తి సమాజంలో ఉన్నత స్థాయిలో ఉండాలని, అది ఆయనకు లేదని అగర్వాల్ వాదించారు.