Ukraine ambassador
-
ఉక్రెయిన్: భయంగా ఉంది.. పౌరులను చంపేస్తున్నాం!
న్యూయార్క్: యుద్ధంలో పాల్గొన్న ఒక రష్యా సైనికుడు చనిపోవడానికి కొంత సమయం ముందు తన తల్లికి పంపిన సందేశమంటూ ఒక సందేశాన్ని ఉక్రెయిన్ రాయబారి ఐరాసలో వినిపించారు. యుద్ధంలో పాల్గొనడం భయంగా ఉందని, ఇక్కడ ఉక్రెయిన్ పౌరులను లక్ష్యంగా చేసుకొంటున్నారని లేఖలో పేర్కొన్నట్లు ఉక్రెయిన్ రాయబారి సెర్గే కైస్లిట్సియా చెప్పారు. చనిపోయిన ఒక రష్యా సైనికుడి మొబైల్లో ఈ సందేశాలు కనిపించాయని చెబుతూ సదరు సందేశం స్క్రీన్‌షాట్‌ను ఆయన ప్రదర్శించారు. అనంతరం మెసేజ్‌ను చదివి వినిపించారు. ముందుగా ఎలా ఉన్నావని తల్లి సైనికుడిని అడగడం, ఎందుకు అందుబాటులోకి రావడం లేదని ప్రశ్నించడం, ఇంకా తను శిక్షణలోనే ఉన్నాడా? అని అడగడంతో సందేశం ఆరంభమైంది. తాను క్రిమియాలో లేనని, ఉక్రెయిన్‌లో ఉన్నానని కొడుకు జవాబిచ్చాడు. ఇక్కడ చాలా భయంగా ఉందని, నగరాలపై తాము బాంబింగ్ చేస్తున్నామని, పౌరులను లక్ష్యంగా చేసుకొని చంపేస్తున్నామని చెప్పుకొచ్చాడు. ఇక్కడ ప్రజలు తమను వ్యతిరేకిస్తున్నారని, తమ వాహనాలను అడ్డుకుంటున్నారని, తమ సాయుధ వాహనాల కింద పడి చనిపోతున్నారని వాపోయాడు. తమని అక్కడి పౌరులు ఫాసిస్టులని పిలుస్తున్నారంటూ బాధ పడ్డాడు. ఈ సందేశాలు పంపుకున్న తర్వాత సదరు సైనికుడు పోరాటంలో మరణించాడని సెర్గే చెప్పారు. -
అమ్మా నాకు చాలా కష్టంగా ఉంది!..రష్యన్ సైనికుడి చివరి సందేశం
Mama This Is So Hard Russian Soldier Text Msg: రష్య ఉక్రెయిన్ల మధ్య గత ఐదు రోజులుగా భీకరమైన యుద్ధం జరుగుతుంది. మరోవైపు ప్రపంచ దేశాలన్ని యుద్ధం వద్దని హెచ్చరికలు జారీ చేస్తున్న రష్యా వాటిని ఖాతరు చేయక దురాక్రమణకు పాల్పడింది. ఉక్రెయిన్‌లోని పౌరులు రష్యన్ యువ సైనికులు సైతం ఈ యుద్ధంలో మరణించారు. ఈ మేరకు జరిగిన ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ సమావేశంలో ఉక్రెయిన్ రాయబారి ఒక రష్యన్ సైనికుడు తన తల్లిక పంపిన చివరి సందేశాన్ని వినిపించారు. ఆ సందేశం వింటున్న అక్కడ ఉన్న ప్రతి ఒక్కరి ముందు యుద్ధోన్మాదం కళ్ల ముందు కదలాడటమే కాదు హృదయాల్ని కలిచి వేసింది కూడా. ఇంతకీ ఆ సందేశంలో .."అమ్మా నాకు చాలా కష్టంగా ఉంది. ఉక్రెయిన్‌లోని నగరాలపై బాంబులు వేస్తున్నాం. పౌరులను కూడా లక్ష్యంగా చేసుకుని దాడి చేస్తున్నాం. పైగా అక్కడ ఉన్న ఉక్రెయిన్లు మమ్మల్ని ఫాసిస్టులు అని సంభోదిస్తూ స్వాగతిస్తారు. అంతేకాదు వారు సాయుధ వాహనాల కింద పడిపోతుంటారు, మమల్ని వెళ్లనివ్వరు. ఇదంతా చూస్తుంటే చాలా కష్టంగా అనిపిస్తోందమ్మా!. నన్ను నేను ఉరి తీసుకోవాలన్నంత బాధగా అనిపిస్తుంది అని వాళ్ల అమ్మకు చివరి లేక రాశాడు. అతను చనిపోపయే చివరి క్షణాల ముందు ఈ లేఖను రాశాడు. అంతేకాదు ఆ లేఖను అందుకున్న ఆ రష్యన్ సైనికుడి తల్లి సైతం ఇంతకాలం అతను ఎందుకు అమ్మతో మాట్లాడలేకపోయాడు అని ప్రశ్నించారు. అతని మృతదేహాన్ని నాకు పంపించగలరా అని ఆమె దీనంగా అడిగింది." అని చెప్పుకొచ్చారు. అంతేకాదు ఆ సమావేశంలో ఉక్రెయిన్ రాయబారి ప్రతి ఒక్క దేశం నేమ్‌ప్లేట్ పక్కన ఇప్పటికే మరణించిన 30 మంది రష్యన్ సైనికుల ఆత్మలను ఊహంచుకోండి అని ఆక్రందనగా ఉద్ఘాటించారు. మరోవైపు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ సైతం రష్యన్ యువ సైనికులు తమ ప్రాణాలను కాపాడుకోవడానికి ఉక్రెయిన్ను విడిచిపెట్టాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ఉక్రెయిన్ యుద్ధంలొ బలి అవుతున్న యువ రష్యన్ సైనికుల విషాదం గురించి నొక్కి చెబుతోందన్నారు. పైగా ఈ ఉక్రెయిన్ యుద్ధంలో ఇప్పటివరకు సుమారు 4 వేల మంది రష్యన్ సైనికులు మరణించారని చెప్పారు. (చదవండి: చారిత్రక ఘట్టం: ఈయూ సభ్యత్వ దరఖాస్తుపై సంతకం చేసిన ఉక్రెయిన్ అధ్యక్షుడు) -
రాయబారి సెల్ఫీ తీసుకుంటుంటే దొంగ షాక్
న్యూఢిల్లీ : ఎర్రకోట వద్ద స్వీయ చిత్రాలను (సెల్ఫీలను) తీసుకుంటున్న ఓ రాయబారికి ఓ దొంగ షాకిచ్చాడు. చాలా తేలికగా ఆయన ఫోన్‌ను ఎత్తుకెళ్లిపోయాడు. దీంతో ఆయన ఈ విషయాన్ని ఏకంగా కేంద్ర హోంశాఖకు, ఢిల్లీ పోలీస్ కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు. ఇగోర్ పోలిఖా అనే ఉక్రెయిన్‌కు చెందిన వ్యక్తి గత ఏడాదే భారత్‌కు రాయబారిగా నియమితులయ్యారు. ఆయన ఎర్రకోట చూసేందుకు వెళ్లిన సందర్భంలో సెల్ఫీలు తీసుకుంటుండగా అటుగా వచ్చిన ఓ దొంగ ఫోన్ ఎత్తుకొని పారిపోయాడు. ఈ సంఘటన జరిగినప్పుడు ఆ చుట్టుపక్కల ఎవరూ లేరంట. ఉదయం 9.15గంటల ప్రాంతంలో ఈ సంఘటన చోటుచేసుకుంది. దీనిపై స్పందించిన పోలీసులు ఈ ఘటనకు సంబంధించి కొన్ని ఆధారాలు సేకరించామని, ప్రత్యేక బృందాలు ఏర్పాటుచేసి గాలింపులు చేస్తున్నామని తెలిపారు.