Ukraine Ambassador Reads Russian Soldiers Last Text Message, Goes Viral - Sakshi
Sakshi News home page

Russia Ukraine War: అమ్మా నాకు చాలా కష్టంగా ఉంది!..రష్యన్‌ సైనికుడి చివరి సందేశం

Published Tue, Mar 1 2022 12:48 PM | Last Updated on Tue, Mar 1 2022 2:29 PM

Ukraines Ambassador Read Russian Soldiers Last Text Message  - Sakshi

Mama This Is So Hard Russian Soldier Text Msg: రష్య ఉక్రెయిన్‌ల మధ్య గత ఐదు రోజులుగా భీకరమైన యుద్ధం జరుగుతుంది. మరోవైపు ప్రపంచ దేశాలన్ని యుద్ధం వద్దని హెచ్చరికలు జారీ చే‍స్తున్న రష్యా వాటిని ఖాతరు చేయక దురాక్రమణకు పాల్పడింది. ఉక్రెయిన్‌లోని పౌరులు రష్యన్‌ యువ సైనికులు సైతం ఈ యుద్ధంలో మరణించారు. ఈ మేరకు జరిగిన ఐక్యరాజ్యసమితి జనరల్‌ అసెంబ్లీ సమావేశంలో ఉక్రెయిన్‌ రాయబారి ఒక రష్యన్‌ సైనికుడు తన తల్లిక పంపిన చివరి సందేశాన్ని వినిపించారు.

ఆ సందేశం వింటున్న అక్కడ ఉన్న ప్రతి ఒక్కరి ముందు యుద్ధోన్మాదం కళ్ల ముందు కదలాడటమే కాదు హృదయాల్ని కలిచి వేసింది కూడా. ఇంతకీ ఆ సందేశంలో .."అమ్మా నాకు చాలా కష్టంగా ఉంది. ఉక్రెయిన్‌లోని నగరాలపై బాంబులు వేస్తున్నాం. పౌరులను కూడా లక్ష్యంగా చేసుకుని దాడి చేస్తున్నాం. పైగా అక్కడ ఉన్న ఉక్రెయిన్లు మమ్మల్ని ఫాసిస్టులు అని సంభోదిస్తూ స్వాగతిస్తారు. అంతేకాదు వారు సాయుధ వాహనాల కింద పడిపోతుంటారు, మమల్ని వెళ్లనివ్వరు. ఇదంతా చూస్తుంటే చాలా కష్టంగా అనిపిస్తోందమ్మా!.

నన్ను నేను ఉరి తీసుకోవాలన్నంత బాధగా అనిపిస్తుంది అని వాళ్ల అమ్మకు చివరి లేక రాశాడు. అతను చనిపోపయే చివరి క్షణాల ముందు ఈ లేఖను రాశాడు. అంతేకాదు ఆ లేఖను అందుకున్న ఆ రష్యన్‌ సైనికుడి తల్లి సైతం ఇంతకాలం అతను ఎందుకు అమ్మతో మాట్లాడలేకపోయాడు అని ప్రశ్నించారు. అతని మృతదేహాన్ని నాకు పంపించగలరా అని ఆమె దీనంగా అడిగింది." అని చెప్పుకొచ్చారు.

అంతేకాదు ఆ సమావేశంలో ఉక్రెయిన్‌ రాయబారి ప్రతి ఒక్క దేశం నేమ్‌ప్లేట్ పక్కన ఇప్పటికే మరణించిన 30 మంది రష్యన్‌ సైనికుల ఆత్మలను ఊహంచుకోండి అని ఆక్రందనగా ఉద్ఘాటించారు. మరోవైపు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ సైతం రష్యన్‌ యువ సైనికులు తమ ప్రాణాలను కాపాడుకోవడానికి ఉక్రెయిన్‌ను విడిచిపెట్టాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ఉక్రెయిన్ యుద్ధంలొ బలి అవుతున్న యువ రష్యన్ సైనికుల విషాదం గురించి నొక్కి చెబుతోందన్నారు. పైగా ఈ ఉక్రెయిన్‌ యుద్ధంలో ఇప్పటివరకు సుమారు 4 వేల మంది రష్యన్‌ సైనికులు మరణించారని చెప్పారు.

(చదవండి: చారిత్రక ఘట్టం: ఈయూ సభ్యత్వ దరఖాస్తుపై సంతకం చేసిన ఉక్రెయిన్‌ అధ్యక్షుడు)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement