un employement
-
తెలంగాణ : నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. గ్రూప్ 4 నోటిఫికేషన్ విడుదల..
-
6,511 పోలీస్ నియామకాలకు సీఎం వైఎస్ జగన్ గ్రీన్ సిగ్నల్
-
మోదీ ప్రభుత్వం ఉపాధికి హానికరం: రాహుల్ గాంధీ
సాక్షి, న్యూఢిల్లీ: కరోనా దెబ్బకు దేశంలో చాలా మంది తమ ఉద్యోగాలు కోల్పోయారు. ఆగష్టులో దేశంలో 15 లక్షల మంది ఉద్యోగాలు కోల్పోయినట్లు సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ పేర్కొంది. దీనిపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ శుక్రవారం స్పందించారు. ‘‘మోదీ ప్రభుత్వం ఉపాధికి హానికరం. ఈ ప్రభుత్వం స్నేహితులు కాని వారి వ్యాపారాన్ని, ఉపాధిని ప్రోత్సహించదు. దానికి బదులుగా వ్యాపారాలు కలిగి ఉన్న వారి నుంచి ఉద్యోగాలు లాక్కోవడానికి ప్రయత్నిస్తోంది’’ అని రాహుల్ విమర్షించారు. స్వతంత్ర థింక్ ట్యాంక్ వివరాల ప్రకారం.. జులైలో 6.96 శాతం ఉన్న జాతీయ నిరుద్యోగం గత నెలలో 8.32 శాతానికి పెరిగిందన్నారు . ఆగస్టులో పట్టణ నిరుద్యోగం 9.78 శాతంగా ఉంది. కరోనా సెకండ్ వేవ్ కు ముందు మార్చిలో 7.2 శాతం ఉండగా.. జూలైలో 8.3 శాతం పెరిగిందన్నారు. చదవండి: భూములు, డబ్బులపై అత్యాశ, ఆసక్తి లేవు దేశవ్యాప్తంగా కనీసం ఎనిమిది రాష్ట్రాలు ఢిల్లీ, హర్యానా,రాజస్థాన్ ఇప్పటికీ రెండంకెల నిరుద్యోగ రేట్లను నివేదిస్తున్నాయి. హర్యానా నిరుద్యోగిత రేటు అత్యధికంగా 35.7 శాతంగా ఉంది. గత సంవత్సరం మోదీ ప్రభుత్వం సంవత్సరానికి రెండు కోట్ల మందికి ఉద్యోగాలు ఇస్తానని హామీ ఇచ్చి విఫలమైందని దుయ్య బట్టారు. పైగా "ఆర్థిక నిర్మాణాన్ని నాశనం చేసే" విధానాలను రూపొందించి, కోట్ల మందిని నిరుద్యోగులుగా మార్చారని ఆరోపించారు. నరేంద్ర మోదీ విధానాల ద్వారా 14 కోట్ల మంది ప్రజలు నిరుద్యోగులుగా మారారని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అన్నారు. చదవండి: హుజురాబాద్: కాంగ్రెస్ ఎమ్మెల్యే టికెట్‌కు దరఖాస్తులు ఆహ్వానం -
ఉద్యోగాల పేరిట టోకరా.. రూ.10 కోట్ల వసూలు!
సాక్షి,విశాఖపట్నం: జీవీఎంసీలో ఉద్యోగాలంటూ నిరుద్యోగుల నుంచి వసూళ్లకు ఓ ప్రైవేట్ ఏజెన్సీ తెగబడుతోంది. స్వచ్ఛాంధ్ర కింద జీవీఎంసీకి రానున్న వాహనాల డ్రైవర్ పోస్టుల భర్తీ ప్రక్రియ జరగనుందని.. ఇందుకోసం పోస్టుకు లక్షన్నర నుంచి రూ.2 లక్షల మేర వసూలు చేస్తున్నట్టు తెలుస్తోంది. ఈ విధంగా మొత్తం 600 పోస్టుల భర్తీకి నిరుద్యోగుల నుంచి దరఖాస్తులను కూడా సదరు ప్రైవేటు ఏజెన్సీ తీసుకుంటున్నట్టు సమాచారం. తద్వారా ఏకంగా రూ.10 కోట్ల మేర వసూలుకు తెగబడినట్టు విమర్శలు వినిపిస్తున్నాయి. మురళీనగర్‌లోని ఒక ఇంటి అడ్రస్ ఇచ్చి.. కొన్ని ఫోన్ నంబర్లను మార్కెట్లోకి సదరు ప్రైవేటు సంస్థ వదిలింది. అడ్రస్‌లో ఉన్న ఇంటికి వెళ్తే అక్కడ ఎవరూ ఉండడంలేదు.. కానీ పక్కింటిలో ఉన్నారనే సమాచారం వస్తోంది. అక్కడకు వెళ్లి ఫోన్ నంబర్లు పనిచేయడం లేదని ఆరా తీస్తే.. మరో ఫోన్ నంబర్ ఇస్తున్నారు. ఆ తర్వాత వసూలు ప్రక్రియ సాగుతోంది. జీవీఎంసీలో ఉద్యోగాలని, భవిష్యత్తులో పరి్మనెంటు అవుతాయనే భ్రమలను నిరుద్యోగులకు కల్పిస్తున్నారు. ఫలితంగా నిరుద్యోగులు కూడా నగదును సమర్పించుకునేందుకు సిద్ధమవుతున్నారు. ఒక్కో ఉద్యోగానికి లక్షన్నర! జీవీఎంసీలో చెత్త సేకరణ కోసం త్వరలో స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ద్వారా 600 చెత్త సేకరణ వాహనాలు రానున్నాయి. ఇందులో 300 మేరకు ఈ నెలాఖరులోగా వచ్చే అవకాశం ఉంది. దీనిని సదరు ప్రైవేటు ఏజెన్సీ తన వసూలుకు అవకాశంగా మలచుకున్నట్టు తెలుస్తోంది. చెత్త సేకరణ కోసం వచ్చే వాహనాలకు డ్రైవర్ పోస్టుల భర్తీ కాంట్రాక్టు తమ సంస్థకే వచ్చిందని చెబుతున్నట్టు సమాచారం. అందువల్ల తామే పోస్టులను భర్తీ చేస్తామని, దరఖాస్తులను ఆహ్వనిస్తున్నామని చెబుతోంది. ఒక్కో ఉద్యోగానికి లక్షన్నర నుంచి రూ.2 లక్షల వరకూ వసూలుకు తెగబడుతోంది. ఈ విధంగా నగదు ఇచ్చిన వారికే ఉద్యోగాలని, దరఖాస్తుల ప్రక్రియ అంతా కేవలం ప్రొసిజర్ కోసమని సదరు ప్రైవేటు ఏజెన్సీ నిర్వాహకులు చెబుతున్నారు. ఈ విధంగా మొత్తం 600 మంది నుంచి లక్షన్నర నుంచి రెండు లక్షల వరకూ వసూలు చేయడం ద్వారా రూ.10 కోట్ల మేర ఆర్జనకు స్కెచ్ వేసినట్టు తెలుస్తోంది. -
నిరుద్యోగులకు టోపీ
సాక్షి, కంచిలి(శ్రీకాకుళం) : కరువు, నిరుద్యోగ సమస్యలను కొందరు దళారులు తమకు అనుకూలంగా మార్చుకొంటున్నారు. అవకాశాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులైన యువకులకు విదేశాల్లో ఉద్యోగాలిప్పిస్తామం ఎర వేస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో పుట్టగొడుగుల్లా కమీషన్ ఏజెంట్లు వెలసి యువతను దోచుకొంటున్నారు. ఆంధ్ర–ఒడిశా సరిహద్దు గ్రామాల్లో ఐటీఐలో తర్ఫీదు పొందినవారు, స్థానికంగా ఉన్న వెల్డింగ్ ఇనిస్టిట్యూట్లలో నైపుణ్యత పొందిన వారు విదేశాల్లో ఉద్యోగాల కోసం ఆశపడి లక్షలాది రూపాయలు పోగొట్టుకొంటున్నారు. ఏజెంట్లకు అవగాహన లేకపోకవడం వలనో, సరైన నెట్వర్క్ లేకపోవడం వల్లనో టూరిస్ట్ వీసాలతో విదేశాలకు పంపిం చడం, తీరా అక్కడికి వెళ్లాక ఆ విషయం బయటపడటం వంటివి జరుగుతున్నాయి. బూరగాం గ్రామానికి చెందిన మహేష్ అనే ఏజెంట్ విదేశాల్లో ఉద్యోగాలిప్పిస్తామని వసూళ్లకు పాల్పడ్డాడని.. మండలంలోని పద్మతుల గ్రామానికి చెందిన మునకాల జగన్నాథం తదితరులు ఏకంగా జిల్లా సూపరింటెండెంట్ కార్యాలయంలోనే ఫిర్యాదు చేయడంతో ఆ కేసును జిల్లా ఎస్పీ కార్యాలయం స్థానిక పోలీస్‌స్టేషన్‌కు ఫార్వర్డ్ చేసింది. దీంతో స్థానిక ఎస్ఐ సిహెచ్.దుర్గాప్రసాద్ కేసు నమోదు చేసిన సంగతి తెల్సిందే. ఇక తాజాగా సోమవారం ఒడిశా రాష్ట్ర పరిధి చీకటిబ్లాక్ పరిధి పారాపేట గ్రామానికి చెందిన పదిమంది యువకులు ఒక్కొక్కరు రూ.80 వేలు చొప్పున మహేష్ అనే ఏజెంట్‌కే ఇచ్చామని స్థానిక విలేకర్ల వద్ద ఆరోపించారు. తమను సింగపూర్ పంపించాడని, తీరా అక్కడికి వెళ్లిన తర్వాత ఉద్యోగం ఇవ్వలేదని, తిరిగి ఇంటికి రావడానికి చేతిలో చిల్లిగవ్వలేకుండా చాలా ఇబ్బందులు పడ్డామని వాపోయారు. తమకు న్యాయం చేయాల్సిందిగా వారంతా కోరారు. ఇలా మండలంలో పలువురు దళారీలు విదేశాల్లో ఉద్యోగాలిప్పిస్తామంటూ రకరకాలుగా నిరుద్యోగ యువతను ఆకట్టుకొనే ప్రయత్నాలు చేయడం, వారి చేతిలో కొందరు యువకులు బలవ్వడం పరిపాటిగా మారింది. దీనిపై పోలీసులు ఎప్పటికప్పుడు హెచ్చరిస్తున్నా ఫలితం లేకపోతోంది. అప్రమత్తంగా ఉండాలి:ఎస్ఐ మండలంలో విదేశాల్లో ఉద్యోగాలిప్పిస్తామంటూ కొందరు దళారీలు తయారై యువతను తప్పుదారి పట్టిస్తున్నారని, దీనిపై అప్రమత్తంగా ఉండాల్సిందిగా స్థానిక ఎస్ఐ సిహెచ్ దుర్గాప్రసాద్ సూచించారు. సంబంధిత ప్రక్రియ ఎంతవరకు సరిగ్గా ఉందో సరిచూసుకొని ముందుకు సాగాలని పేర్కొన్నారు. ఇప్పటికే బూరగాం గ్రామానికి చెందిన కప్ప మహేష్‌పై ఒక కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ వెల్లడించారు. -
విజిట్ వీసా పేరిట మోసం..
► షార్జాలో చిక్కుకుపోయిన బాధితులు.. ► పది రోజులుగా తిండి కూడా లేక ఇక్కట్లు ► ఆదుకోవాలంటూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి ఆర్మూర్: ఒకవైపు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలోని నిరుద్యోగులకు గల్ఫ్ దేశాల్లో ఉపాధి అవకాశాలు కల్పిస్తుంటే.. మరో వైపు నకిలీ ఏజెంట్ల మాయ మాటలు నమ్మి నిత్యం పదుల సంఖ్యలో నిరుద్యోగులు మోసపోతూనే ఉన్నారు. నిజామాబాద్ జిల్లాకు చెందిన నకిలీ ఏజెంట్ల కారణంగా షార్జాలోని అల్బుదినా తాసిల్లో చిక్కుకొన్న సుమారు 40 మంది యువకులు తమను కాపాడాలంటూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు. జగిత్యాల జిల్లాలోని కోరుట్ల, నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల నుంచి పలువురు నకిలీ ఏజెంట్లు సుమారు 40 మందిని విజిట్ వీసాపై షార్జాకు పంపించారు. ఫోన్ లో సాక్షితో.. అక్కడే పలు కంపెనీలతో ఇంటర్వ్యూలు నిర్వహించి ఉద్యోగం ఇప్పిస్తామని నమ్మబలకడంతో అప్పులు చేసి ఒక్కొక్కరు రూ. 75 వేలు ఏజెంటుకు ముట్టజెప్పి షార్జాలో కష్టాలు పడుతున్నారు. కోరుట్లకు చెందిన శ్రీనివాస్, సాగర్, రాజేశ్, సత్యనారాయణ, రామకృష్ణ షార్జా నుంచి సాక్షితో ఫోన్లో మాట్లాడారు. ఏజెంట్ మోసం కారణంగా ఇక్కడ పది రోజులుగా తినడానికి కూడా తిండి దొరకక కష్టాలు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. తమ బంధువుల ద్వారా పరిచయమైన నందిపేట మండలం తల్వేదకు చెందిన సాగర్ అనే ఏజెంట్ ఒక్కొక్కరి వద్ద నుంచి రూ. 75 వేలు తీసుకొని నెల రోజుల క్రితం షార్జాకు పంపిచాడని వివరించారు. తమ ఏజెంట్ సూచించిన వ్యక్తి తమను షార్జాలో రిసీవ్ చేసుకొని విజిట్ వీసాపై వచ్చిన 50 మందిని ఒకే గదిలో ఉంచారన్నారు. తిండిలేక పస్తులుంటున్నాం.. అక్కడి హోటల్స్‌లో హౌస్ కీపింగ్ ఉద్యోగం ఇప్పిస్తామంటూ ఇంటర్వ్యూల పేరిట తమవద్ద నుంచి వెయ్యి దిర్హాంలు వసూలు చేశారన్నారు. వయస్సు నిబంధనతో తాము ఉద్యోగానికి ఎంపిక కాలేదన్నారు. అయితే స్వగ్రామంలో ఉన్న సమయంలో తమకు షార్జాలో ఉద్యోగం ఇప్పించడమే కాకుండా ఉద్యోగం వచ్చే వరకు పూర్తి ఖర్చులు, బాధ్యతలు తనవేనంటూ ఏజెంట్‌తో రాతపూర్వకంగా రాయించుకున్నామన్నారు. మరో మూడు రోజుల్లో మా విజిట్ వీసా సమయం పూర్తయిపోతుందని వాపోయారు. ఇప్పటికే ఇక్కడి పోలీసుల కంట పడకుండా భయంగా రూమ్‌లో గడుపుతున్నామన్నారు. తమను స్వగ్రామానికి తీసుకొని రావడానికి విమానం టికెట్లు పంపించాల్సిందిగా ఏజెంట్‌ను కోరగా నిర్లక్ష్యంగా సమాధానం చెపుతున్నాడని వాపోయారు. పది రోజులుగా తిండి లేక జేబుల్లో డబ్బులు లేక ప్రత్యక్ష నరకాన్ని చూస్తున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. నకిలీ ఏజెంట్ల మోసాలు తమకు తెలిసినా మంచి ఉద్యోగం దొరికితే అక్కడే పని చేసుకోవచ్చని ఆశపడ్డ మాకు నిరాశే ఎదురైందంటూ వాపోతున్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కలగజేసుకొని తమను స్వగ్రామాలకు రప్పించేలా చూడాలని, మోసం చేసిన ఏజెంట్‌పై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. -
వీరికి జోష్.. వారికి హుష్!
సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్ : పంచాయతీ కార్యదర్శుల పోస్టుల భర్తీపై ఆశ పెట్టుకున్న నిరుద్యోగుల ఆశలపై ట్రిబ్యునల్ తీర్పుతో నీళ్లు చల్లినట్లైంది. రెండు విడతలుగా ఈ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసినా కేవలం ఏపీపీఎస్సీ నోటిఫికేషన్‌పైనే అభ్యర్థులు ఆధార పడాల్సిన పరిస్థితి నెలకొంది. జిల్లాలో ఖాళీగా ఉన్న 169 గ్రేడ్ 4 పంచాయతీ కార్యదర్శుల పోస్టుల భర్తీకి గతేడాది అక్టోబర్‌లో కలెక్టర్ (పంచాయతీ వింగ్) నోటిఫికేషన్ జారీ చేశారు. డిగ్రీని విద్యార్హతగా నిర్ణయించడంతో 17,292 మంది నిరుద్యోగులు దరఖాస్తు చేసుకున్నారు. వీరితో పాటు మరో 161 మంది కాంట్రాక్టు పద్దతిలో పనిచేస్తున్న గ్రామ కార్యదర్శులు కూడా దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో ఇంజనీరింగ్, ఫార్మసీ వంటి వృత్తి విద్యా కోర్సులు చదివిన అభ్యర్థులు కూడా వుండటం గమనార్హం. పదో తరగతి మార్కుల ఆధారంగా అర్హులను ఎంపిక చేస్తామని ప్రకటించారు. కాంట్రాక్టు పద్దతిలో పనిచేస్తున్న కార్యదర్శులకు 75శాతం వెయిటేజీ ప్రకటించారు. వేలాది మంది దరఖాస్తు చేసుకోవడంతో వెయిటేజీ వున్నా తమకు ఉద్యోగం దక్కదనే భావనతో కాంట్రాక్టు కార్యదర్శులు ఆంధ్రప్రదేశ్ ట్రిబ్యునల్‌ను ఆశ్రయించారు. డిగ్రీ విద్యార్హత ఉన్న వారిని సర్వీసును క్రమబద్దీకరించాల్సిందిగా ట్రిబ్యునల్ మధ్యంతర ఉత్తర్వుల్లో పేర్కొంది. డిగ్రీ విద్యార్హత లేని కాంట్రాక్టు కార్యదర్శుల విషయంలో యదాతథంగా ఉద్యోగాల్లో కొనసాగిస్తూ తుది తీర్పు తర్వాత నిర్ణయం తీసుకోవాల్సిందిగా ట్రిబ్యునల్ సూచించింది. దీంతో 161 మంది కాంట్రాక్టు కార్యదర్శుల్లో డిగ్రీ విద్యార్హత కలిగిన 156 మందిని రెగ్యులర్ కార్యదర్శులుగా గుర్తించనున్నారు. మరో ఐదుగురి సర్టిఫికేట్లను పరిశీలించిన తర్వాత భవిష్యత్తు నిర్ణయించనున్నారు. నిరుద్యోగుల ఆశలపై నీళ్లు ట్రిబ్యునల్ తీర్పుతో కాంట్రాక్టు కార్యదర్శుల్లో హర్షం వ్యక్తమవుతోంది. అయితే ప్రభుత్వ ఉద్యోగంపై ఆశతో వ్యయ, ప్రయాసలకోర్చి జిల్లా కేంద్రానికి వచ్చి దరఖాస్తు చేస్తున్న నిరుద్యోగుల్లో నిరాశ వ్యక్తం చేస్తున్నారు. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులను మినహాయించి ఇతరుల నుంచి రూ.50 దరఖాస్తు ఫారంతో పాటు స్వీకరించారు. జిల్లా పంచాయతీ అధికారి ఖాతాకు ఇలా సుమారు రూ.5లక్షల మేర జమ అయినట్లు సమాచారం. ఇక సర్టిఫికేట్ల జిరాక్సులు, ఫోటోలు, బస్సు చార్జీలు తదితరాల రూపంలో ఒక్కో అభ్యర్థి సగటున రూ.500 నుంచి వేయి వరకు ఖర్చు చేశారు. ఇదిలా ఉంటే కలెక్టర్ కార్యాలయ నోటిఫికేషన్‌తో సంబంధం లేకుండా గ్రేడ్ 4 పంచాయతీ కార్యదర్శుల పోస్టుల భర్తీకి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) మరో నోటిఫికేషన్ జారీ చేసింది. గతేడాది డిసెంబర్ 30న జారీ చేసిన ఈ నోటిఫికేషన్ ద్వారా జిల్లాలో 350 పోస్టులను భర్తీ చేస్తారు. నిరుద్యోగ అభ్యర్థులు ప్రస్తుతం ఏపీపీఎస్సీ నోటిఫికేషన్‌పైనే గంపెడాశలు పెట్టుకుని ఫిబ్రవరి 23న జరిగే రాత పరీక్షకు సన్నద్ధమవుతున్నారు. ఉత్తర్వులు ఇచ్చాం: డీపీఓ రవీందర్ ట్రిబ్యునల్ తీర్పు మేరకు అర్హులైన కాంట్రాక్టు కార్యదర్శుల పోస్టులను క్రమబద్దీకరిస్తూ నియామక పత్రాలు కూడా ఇచ్చాం. మరికొందరి సర్టిఫికేట్లపై పరిశీలన జరుగుతోంది. గతంలో కలెక్టర్ కార్యాలయ నోటిఫికేషన్ మేరకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల భవిష్యత్తు ట్రిబ్యునల్ తుది తీర్పుకు లోబడి ఉంటుంది. -
ఏపీపీఎస్సీ పరీక్షలు వాయిదా
సాక్షి, మంచిర్యాల : జిల్లాలోని నిరుద్యోగులు, విద్యార్థులు, ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, పింఛన్‌దారుల ఆశలు అడియాశలు అయ్యాయి. ప్రభుత్వం టెట్, డీఎస్సీ నోటిఫికేషన్ వేయకపోవడంతో రేయింబవళ్లు కష్టపడి చదివి ఉపాధ్యాయులు కావాలని కలలు కన్న నిరుద్యోగ అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు. ఫలితంగా జిల్లాలో 34 వేల మంది ఉద్యోగ, ఉపాధ్యాయులు.. ప్రభుత్వ తీరుతో ఎనిమిది వేల మంది పింఛన్‌దారులు, వేలాది మంది కార్మికులకు రావాల్సిన మధ్యంతర భృతి నిలిచింది. పంచాయతీ కార్యదర్శుల పోస్టుల భర్తీకి గ్రహణం పట్టింది. దీంతోపాటు ఏపీపీఎస్సీ ద్వారా ప్రభుత్వ శాఖల్లోని వివిధ పోస్టుల భర్తీకి జనవరిలో తీసుకున్న నిర్ణయం కాగితాలకే పరిమితమైంది. ఈ పోస్టులు భర్తీ అయితే.. జిల్లాలో వందలాది మంది నిరుద్యోగులకు ప్రభుత్వ కొలువులు వరిస్తాయి. అందని మధ్యంతర భృతి ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పింఛన్‌దారులతోపాటు కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వం 22 శాతం మధ్యంతర భృతి చెల్లించాలని నిర్ణయించింది. జూలై నుంచి ఈ భృతి అందాల్సి ఉంది. కానీ ప్రభుత్వం ఇవ్వడం లేదు. జిల్లాలోని ప్రభుత్వ శాఖల్లో 34,803 మంది ఉద్యోగులు, ఉపాధ్యాయులు విధులు నిర్వర్తిస్తున్నారు. 8 వేలకు పైగా మంది పెన్షనర్లు, వేలాది మంది కార్మికులు ఉన్నారు. మధ్యంతర భృతి కోసం వీరందరూ నిరీక్షిస్తున్నారు. గ్రామ కార్యదర్శుల భర్తీపై నీలినీడలు గ్రామ పాలనలో కీలక పాత్ర పోషించే గ్రామ కార్యదర్శుల పోస్టులు రాష్ట్ర వ్యాప్తంగా వేలాది సంఖ్యలో ఖాళీగా ఉన్నా యి. కేవలం మన జిల్లాలో 641 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. మొత్తం 866 గ్రామ పంచాయితీల్లో కేవలం 225 మంది పంచాయతీ కార్యదర్శులు మాత్రమే రెగ్యూలర్‌గా ఉన్నారు. 641 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. సమస్య తీవ్రతను దృష్టిలో పెట్టుకుని రాష్ట్రవ్యాప్తంగా 2,641 పంచాయతీ కార్యదర్శుల పోస్టులు భర్తీ చేస్తున్నట్లు పంచాయతీ రాజ్ శాఖ కార్యదర్శి నాగిరెడ్డి ఏప్రిల్‌లోనే ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో ఆగస్టులో నోటిఫికేషన్ విడుదలై నవంబర్‌లోగా పోస్టులు భర్తీ అవుతాయని నిరుద్యోగులు భావించారు. కానీ ఇంత వరకు ఆ పోస్టుల నోటిఫికేషన్ విడుదల కాలేదు. మరోపక్క.. పంచాయతీ కార్యదర్శుల ఖాళీల కొరతతో.. ఇప్పటికే పన్ను వసూళ్లు లక్ష్యం మేరకు జరగడం లేదు. ఊరిస్తున్న డీఎస్సీ 2013 డీఎస్సీ నిర్వహించి.. రాష్ట్రవ్యాప్తంగా 20,508 ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేస్తున్నట్లు ఆర్వీఎం రాష్ట్ర ప్రాజెక్టు డెరైక్టర్, అప్పటి పాఠశాల విద్యా డెరైక్టర్ (ఎఫ్ఏసీ) ఉషారాణి జూలై 2న ప్రకటించారు. ఈ క్రమంలో జిల్లాలో 93 స్కూల్ అసిస్టెంట్లు, 60 భాషాపండితులు, 983 ఎస్జీటీలు, 5 పీఈటీలు మొత్తం 1,141 పోస్టులు భర్తీ చేస్తామన్నారు. ఆగస్టు 1 నుంచి సెప్టెంబర్ 30 వరకు దరఖాస్తులు స్వీకరించి.. అక్టోబర్ 9,10,11 తేదీల్లో డీఎస్సీ నిర్వహిస్తామని.. ఈ మేరకు నోటిఫికేషన్ విడుదల చేస్తామని చెప్పారు. ఇప్పటివరకు నోటిఫికేషన్ విడుదల చేయకపోవడంతో జిల్లాలోని ఏడు వేలకు పైగా నిరుద్యోగ అభ్యర్థులు డీఎస్సీ నోటిఫికేషన్ కోసం ఎదురుచూస్తున్నారు. ఇదే సందర్భంలో ఆగస్టు 25న ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) పరీక్ష నిర్వహిస్తామని ప్రకటించారు. కానీ సీమాంధ్రుల ఉద్యమం నేపథ్యంలో నిలిచిందని పలువురు పేర్కొంటున్నారు. తెలంగాణవాదులకు సీమాంధ్రులు ఈ రకంగా కూడా మోసం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. విలువైన విద్యా సంవత్సరం వృథా డిగ్రీ పూర్తి చేసి బీఎడ్ చేయాలని.. ఇంటర్మీడియట్ తర్వాత టీటీసీ(డీఎడ్) చే యాలని జిల్లా వ్యాప్తంగా వేలాది మంది విద్యార్థులు ఎదురుచూస్తున్నారు. జూన్ 4న బీఈడీ అర్హత పరీక్ష జరిగింది. సుమారు 10 వేల మంది పరీక్ష రాశారు. జూలైలో ఫలితాలు విడుదలయ్యాయి. మే 31న టీటీసీ పరీక్ష జరిగింది. 18,041 మంది పరీక్ష రాశారు. జూన్ 17న ఫలితాలు విడుదలయ్యాయి. ఈ రెండు కోర్సులకు సంబంధించి ఆగస్టు, సెప్టెంబర్‌లో కౌన్సెలింగ్ పూర్తి చేయాల్సి ఉం ది. ఇంతవరకు కౌన్సెలింగ్ తేదీలే ఖరారు కాలేదు. ఆందోళనలో ఎంతో మంది.. - పిట్టల సృజన్, విద్యార్థి, చెన్నూరు టీటీసీలో 159 ర్యాంకు వచ్చింది. సీటు కచ్చితంగా వస్తుంది. కానీ సీట్ల భర్తీ కౌన్సెలింగ్ తేదీ ప్రకటించలేదు. సీమాంధ్ర ఉద్యమం వల్ల కౌన్సెలింగ్ తేదీ ప్రకటించలేదని అనుకుంటున్నాను. పరిస్థితి ఇలానే ఉంటే విలువైన విద్యా సంవత్సరం కోల్పోతానని ఆందోళనగా ఉంది. -
నిరుద్యోగులకు శుభవార్త
సాక్షి ప్రతినిధి, వరంగల్: నిరుద్యోగులకు ఉపాధి బాట చూపేందుకు జిల్లా యంత్రాంగం వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా చేపడుతున్న ఈ కార్యక్రమానికి ముందుగా గ్రామీణ ప్రాంతాల్లోని నిరుద్యోగ యువతను లక్ష్యంగా ఎంచుకుంది. దాదాపు 20వేల మందికి ఉపాధి కల్పించే ధ్యేయంతో అడుగు ముందుకేస్తోంది. కలెక్టర్ జి.కిషన్ స్వీయ ఆలోచనతో ఈ కొత్త ప్రాజెక్టు పురుడు పోసుకుంది. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న రాజీవ్ యువ కిరణాలు, వృత్తి విద్య, ఉపాధి కోర్సులన్నింటినీ ఇందులో భాగంగా ఒకే గొడుగు కిందకు తీసుకు వస్తారు. సమీకృత ప్రణాళికను సిద్ధం చేసి డీఆర్డీఏ సారథ్యంలో ‘ఉపాధి బాట’ చేపట్టాలని భావిస్తున్నారు. స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ నెల 15 నుంచి కార్యక్రమాన్ని ప్రారంభించాలని జిల్లా యంత్రాంగం కంకణం కట్టుకుంది. ఇప్పటికే ముందస్తు కసరత్తు చేపట్టింది. ప్రతి వంద మంది ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్లలో అయిదుగురికే ప్రతిష్టాత్మక సంస్థలలో ఉపాధి దొరుకుతుందని జిల్లా యంత్రాంగం అంచనా వేసింది. ప్రతి 1000 మంది డిగ్రీ గ్రాడ్యుయేట్లలో ఇద్దరు లేదా ముగ్గురికి మాత్రమే ఉద్యోగ అవకాశాలు లభిస్తున్నాయి. మరి మిగతా వారికేమైనా ఉపాధి మార్గాలున్నాయా...? ఉద్యోగాలు కల్పించేందుకు అవకాశాలేమన్నా ఉన్నాయా...? అనే కోణంలో కలెక్టర్ తన ఆలోచనలకు కార్యరూపమిచ్చే కసరత్తు ప్రారంభించారు. గ్రామీణ ప్రాంతాల్లోని విద్యార్థిని, విద్యార్థుల్లో ప్రతిభ ఉన్నప్పటికీ ఇంగ్లిష్‌పై పట్టు లేకపోవడం.. కమ్యూనికేషన్, సాఫ్ట్ స్కిల్స్ లేకపోవడంతో కార్పొరేట్, మల్టీ నేషనల్ కంపెనీల్లో ఉద్యోగాలు పొందలేకపోతున్నారు. అందుకే నిరుద్యోగులకు ఆయా రంగాల్లో శిక్షణ తరగతులు నిర్వహించి... వారిని ఉపాధి బాట పట్టించే వీలుంటుందని అధికారులు భావిస్తున్నారు. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఇంజనీరింగ్ విద్యను అందిస్తున్న నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆప్ టెక్నాలజీ(నిట్) ప్రొఫెసర్లు, కాకతీయ యూనివర్సిటీ, కాకతీయ డిగ్రీ కళాశాల, ఎల్బి కళాశాల, ఆర్ట్స్ సైన్స్ కళాశాలలతో పాటు జిల్లాలోని వివిధ డిగ్రీ కాలేజీలు, పాలిటెక్నిక్, ఐటీఐల ప్రిన్సిపాళ్లతో ఇప్పటికే కలెక్టర్ సమావేశమయ్యారు. ముందుగా గ్రామీణ విద్యార్థులకు ఉపాధి కల్పించాలని భావిస్తున్నారు. ఇందులో భాగంగా ఈ ఏడాది 20 వేల మందికి శిక్షణ ఇప్పించేందుకు డీఆర్డీఏ సారథ్యంలో కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేశారు. శిక్షణ ఇలా.. ముందుగా గ్రామాల్లో సర్వే చేసి ఇంటర్, డిగ్రీ, ఇంజనీరింగ్, ఎంబిఎ, బి ఫార్మసీ తదితర ప్రొఫెషనల్ కోర్సులు పూర్తి చేసిన నిరుద్యోగులను గుర్తిస్తారు. వీరిలో ఆసక్తి ఉన్న వారికి ఉపాధి శిక్షణ ఇవ్వాలని నిర్ణయించారు. వీరిని మూడు కేటగిరీలుగా విభజించి.. ఐఏఎస్, గ్రూపు-1 గ్రూపు-2 తదితర ఏపీపీఎస్సీ నిర్వహించే పోటీ పరీక్షలకు వెళ్లే వారికి బీసీ, ఎస్సీ, గిరిజన స్టడీ సర్కిళ్ల ద్వారా శిక్షణ ఇప్పిస్తారు. ఇంటర్ పూర్తి చేసిన వారికి సర్వీస్ సెక్టారు కింద వృత్తి విద్య కోర్సులు నేర్పిస్తారు. ల్యాబ్ టెక్నీషియన్, ప్లంబింగ్, వైరింగ్, ఎలక్ట్రికల్ హౌస్ వైరింగ్, కంప్యూటర్లు, షాపింగ్‌మాల్స్, హాస్పిటల్ తదితర రంగాల్లో శిక్షణ ఇవ్వనున్నారు. ఐటీఐలు, పాలిటెక్నిక్‌లతో పాటు నిర్మితి కేంద్రాలు, నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్స్ తదితర సంస్థలన్నింటినీ ఇందులో భాగస్వాములు చేయాలని నిర్ణయించారు. డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్న విద్యార్థులకు బీసీ, ఎస్సీ, మైనారిటీ, ఐటీడీఏ నిధులతో కమ్యూనికేషన్ స్కిల్స్, ఆంగ్లంలపై శిక్షణ ఇప్పించనున్నారు. ప్రతి డిగ్రీ కాలేజీలో ఈ శిక్షణ ఇచ్చేందుకు రిసోర్సు పర్సన్లను నియమిస్తారు. కమ్యూనికేషన్, సాఫ్ట్ స్కిల్స్, ఆంగ్లంపై పట్టు సాధించేందుకు కనీసం మూడు నెలల పాటు ప్రత్యేక శిక్షణనిచ్చేలా ఈ ప్రోగ్రాం రూపొందిస్తారు. రిసోర్సు పర్సన్లకు ఎన్ఐటీ, కేయూ అధ్యాపకులతో ముందుగా శిక్షణను ఇప్పిస్తారు. ఈ శిక్షణను పంద్రాగష్టు నుంచే ప్రారంభించాలని యోచిస్తున్నారు.