Under-19 team
-
మ్యాచ్‌లో ఓడితే గుండు గీయించాడు
కోల్‌కతా: ఆటల పోటీల్లో గెలుపోటములు సహజం. కానీ ఓడితే ఏకంగా గుండు గీయించిన ఘటన బెంగాల్ హాకీని ఉలిక్కిపడేలా చేసింది. వెంటనే... అండర్–19 ఆటగాళ్లకు కోచ్ విధించిన ‘గుండు’ శిక్షపై బెంగాల్ హాకీ సంఘం (బీహెచ్ఏ) విచారణకు ఆదేశించింది. నిజానిజాలు నిగ్గుతేల్చేందుకు సోమవారం త్రిసభ్య విచారణ కమిటీని నియమించినట్లు బీహెచ్ఏ కార్యదర్శి స్వపన్ బెనర్జీ తెలిపారు. జూనియర్ నేషనల్ చాంపియన్‌షిప్ (బి–డివిజన్)లో భాగంగా జబల్పూర్లో జరిగిన క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో బెంగాల్ అండర్–19 జట్టు 1–5తో నామ్ధారి ఎలెవన్ చేతిలో ఓడింది. దీంతో ఆగ్రహించిన కోచ్ ఆనంద్ కుమార్ వాళ్లను గుండు చేసుకోమన్నట్లు ఆరోపణలొచ్చాయి. కోచ్ ఆదేశాలతో జట్టులోని 18 మందిలో 16 మంది గుండు చేయించుకున్నారు. దీన్ని తీవ్రంగా పరిగణించిన బీహెచ్ఏ... విచారణ చేపట్టి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని చెప్పింది. కోచ్ ఆనంద్ మాత్రం గుండు చేయించుకోమని చెప్పలేదన్నారు. ‘మ్యాచ్ సమయంలో నేను వారిపై కేకలు వేశాను. అంతేగానీ ఓడిపోతే గుండు చేసుకోవాలని ఆదేశించలేదు. నేను ముందు ఆటగాళ్లతో మాట్లాడతా. నా భార్య ఆసుపత్రిలో ఉండటంతో అసలు ఏం జరిగిందో తెలుసుకునే అవకాశం నాకు లేకుండా పోయింది’ అని కోచ్ వివరణ ఇచ్చారు. -
స్పీడ్‌బాల్ అండర్–19 రాష్ట్ర జట్ల ఎంపిక
నెల్లూరు(స్టోన్‌హౌస్‌పేట): స్కూల్‌గేమ్స్ అండర్–19 స్పీడ్‌బాల్ రాష్ట్ర బాలబాలికల జట్ల ఎంపికలను బుధవారం నిర్వహించారు. స్థానిక ఏసీ సుబ్బారెడ్డి స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లో నిర్వహించిన అంతర్‌జిల్లాల పోటీల్లో బాలబాలికల జట్లను ఎంపిక చేసినట్లు స్కూల్‌గేమ్స్ ఫెడరేషన్ జిల్లా కార్యదర్శి పాటూరు వేణుగోపాలరెడ్డి తెలిపారు. ఎంపికైన క్రీడాకారులు ఈ నెల 15నుంచి హిమాచల్‌ప్రదేశ్‌లో నిర్వహించనున్న జాతీయపోటీల్లో రాష్ట్ర జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తారన్నారు. గుంటూరు ఆర్జేడీ వై.పరం«ధామయ్య, డీవీఈఓ బీమా వెంకయ్య, ఆర్ఐఓ బాబూజాకబ్, రాష్ట్ర పరిశీలకులు పుల్లయ్య, స్పీడ్‌బాల్ అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు విద్యార్థులను అభినందించారు. -
భారత యువ జట్టు ఓటమి
ముంబై: ఇంగ్లండ్ అండర్–19 జట్టుతో ఐదు వన్డే మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా జరిగిన తొలి మ్యాచ్‌లో భారత అండర్–19 జట్టు 23 పరుగుల తేడాతో ఓడిపోయింది. మొదట ఇంగ్లండ్ 50 ఓవర్లలో 7 వికెట్లకు 256 పరుగులు చేసింది. రాలిన్స్ (107 నాటౌట్) అజేయ సెంచరీ సాధించాడు. అనంతరం భారత్ 42.5 ఓవర్లలో 233 పరుగులకు ఆలౌటైంది. ఓపెనర్ హిమాన్షు రాణా (101) సెంచరీ చేసినా, మిగతా బ్యాట్స్‌మెన్ విఫలమయ్యారు. -
భారత్‌దే యూత్ వన్డే సిరీస్
దంబుల్లా: శ్రీలంకతో జరిగిన యూత్ వన్డే సిరీస్‌ను భారత అండర్-19 జట్టు దక్కించుకుంది. 15 ఏళ్ల ముంబై ఆఫ్ స్పిన్నర్ సర్ఫరాజ్ ఖాన్ (4/27) అత్యుత్తమ బౌలింగ్‌ను నమోదు చేయడంతో గురువారం ఇక్కడ జరిగిన మూడో వన్డేలో యువ జట్టు 7 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. సిరీస్‌లో తొలి మ్యాచ్ రద్దు కాగా రెండు వన్డేల్లోనూ నెగ్గిన భారత్ 2-0తో సిరీస్ దక్కించుకుంది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన లంక 39.1 ఓవర్లలో 137 పరుగులకు ఆలౌటయ్యింది. ఓపెనర్ మినోద్ భానుక (53 బంతుల్లో 42;7 ఫోర్లు), ప్రియమల్ పెరీరా (80 బంతుల్లో 50; 3 ఫోర్లు; 1 సిక్స్) మాత్రమే రాణించారు. మిడిలార్డర్‌ను పూర్తిగా సర్ఫరాజ్ దెబ్బతీయడంతో లంక కోలుకోలేకపోయింది. కుల్దీప్ యాదవ్‌కు మూడు వికెట్లు దక్కాయి. అనంతరం స్వల్ప లక్ష్య ఛేదనకు బరిలోకి దిగిన భారత అండర్-19 జట్టు 32.5 ఓవర్లలో 3 వికెట్లకు 141 పరుగులు చేసి నెగ్గింది. లంక బౌలర్లు ఏమాత్రం ప్రభావం చూపకపోవడంతో బ్యాట్స్‌మెన్ అంతా మెరుగ్గా రాణించారు. తొలి వన్డే ఆడిన ఖజూరియా (65 బంతుల్లో 34; 5 ఫోర్లు), సంజూ సామ్సన్ (37 బంతుల్లో 31 నాటౌట్; 2 ఫోర్లు; 2 సిక్స్) రాణించారు. టైరోన్కు రెండు వికెట్లు దక్కాయి.