ముంబై: ఇంగ్లండ్ అండర్–19 జట్టుతో ఐదు వన్డే మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా జరిగిన తొలి మ్యాచ్‌లో భారత అండర్–19 జట్టు 23 పరుగుల తేడాతో ఓడిపోయింది. మొదట ఇంగ్లండ్ 50 ఓవర్లలో 7 వికెట్లకు 256 పరుగులు చేసింది. రాలిన్స్ (107 నాటౌట్) అజేయ సెంచరీ సాధించాడు. అనంతరం భారత్ 42.5 ఓవర్లలో 233 పరుగులకు ఆలౌటైంది. ఓపెనర్ హిమాన్షు రాణా (101) సెంచరీ చేసినా, మిగతా బ్యాట్స్‌మెన్ విఫలమయ్యారు.