భారత్‌దే యూత్ వన్డే సిరీస్ | Bharat youth one day international series | Sakshi
Sakshi News home page

భారత్‌దే యూత్ వన్డే సిరీస్

Published Fri, Aug 9 2013 1:17 AM | Last Updated on Fri, Nov 9 2018 6:43 PM

Bharat youth one day international series

దంబుల్లా: శ్రీలంకతో జరిగిన యూత్ వన్డే సిరీస్‌ను భారత అండర్-19 జట్టు దక్కించుకుంది. 15 ఏళ్ల ముంబై ఆఫ్ స్పిన్నర్ సర్ఫరాజ్ ఖాన్ (4/27) అత్యుత్తమ బౌలింగ్‌ను నమోదు చేయడంతో గురువారం ఇక్కడ జరిగిన మూడో వన్డేలో యువ జట్టు 7 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. సిరీస్‌లో తొలి మ్యాచ్ రద్దు కాగా రెండు వన్డేల్లోనూ నెగ్గిన భారత్ 2-0తో సిరీస్ దక్కించుకుంది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన లంక 39.1 ఓవర్లలో 137 పరుగులకు ఆలౌటయ్యింది.
 
 ఓపెనర్ మినోద్ భానుక (53 బంతుల్లో 42;7 ఫోర్లు), ప్రియమల్ పెరీరా (80 బంతుల్లో 50; 3 ఫోర్లు; 1 సిక్స్) మాత్రమే రాణించారు. మిడిలార్డర్‌ను పూర్తిగా సర్ఫరాజ్ దెబ్బతీయడంతో లంక కోలుకోలేకపోయింది. కుల్‌దీప్ యాదవ్‌కు మూడు వికెట్లు దక్కాయి. అనంతరం స్వల్ప లక్ష్య ఛేదనకు బరిలోకి దిగిన భారత అండర్-19 జట్టు 32.5 ఓవర్లలో 3 వికెట్లకు 141 పరుగులు చేసి నెగ్గింది. లంక బౌలర్లు ఏమాత్రం ప్రభావం చూపకపోవడంతో బ్యాట్స్‌మెన్ అంతా మెరుగ్గా రాణించారు. తొలి వన్డే ఆడిన ఖజూరియా (65 బంతుల్లో 34; 5 ఫోర్లు), సంజూ సామ్సన్ (37 బంతుల్లో 31 నాటౌట్; 2 ఫోర్లు; 2 సిక్స్) రాణించారు. టైరోన్‌కు రెండు వికెట్లు దక్కాయి.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement