దావూద్‌తో సంబంధం లేదు: చండిలా
న్యూఢిల్లీ: అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం, చోటా షకీల్‌లతో తనకెలాంటి సంబంధాలు లేవని స్పాట్ ఫిక్సింగ్‌లో దొరికి పోయిన క్రికెటర్ అజిత్ చండిలా స్పష్టం చేశాడు. తప్పుడు ఆరోపణలతో ఈ కేసులో తనని ఇరికించారని, వారిద్దరితో సంబంధాలపై ఇప్పటిదాకా ఎలాంటి ఆధారాలు లభించలేదని గుర్తు చేశాడు. బెయిల్ కోసం ప్రయత్నిస్తున్న చండిలా సోమవారం ఢిల్లీ కోర్టుకు హాజరయ్యాడు. ‘నేనో క్రీడాకారుడిని.
ఈ కేసులో ఇప్పటికే శ్రీశాంత్, చవాన్లకు బెయిల్ మంజూరైంది. నేను రాజస్థాన్ రాయల్స్ జట్టుకు ఆడాను. విజయవంతమైన ఆటగాడిగా పేరు తెచ్చుకున్నాను. పోలీసులు తప్పుడు ఆధారాలతో నన్ను ఇరికించారు. వారు చెబుతున్నట్టుగా దావూద్, చోటా షకీల్‌లతో నాకెలాంటి సంబంధాలు లేవు’ అని చండిలా ప్రకటనను అతడి లాయర్ రాకేశ్ కుమార్ కోర్టుకు విన్నవించారు.