undi mandal
-
భీమవరంలోని ఉండి రోడ్డులో భారీ పేలుడు
-
కొయ్యే మోహేన్రాజు కుమారుడి వివాహానికి హాజరైన వైఎస్ జగన్
-
‘ఆయన సాక్షిగా.. నీ నిజస్వరూపం బయటపెడతా’
సాక్షి, పశ్చిమగోదావరి : జిల్లాలోని ఉండి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీలో వర్గ విభేదాలు భగ్గుమన్నాయి. సొంత పార్టీ ఎమ్మెల్యే శివరామరాజు తీరును విమర్శిస్తూ టీడీపీ నాయకుడు కళ్లేపల్లి సతీశ్ రాజు విడుదల చేసిన వీడియో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. వివరాలు... ఎమ్మెల్యే తీరుతో విసుగు చెందిన వెలివర్రు గ్రామానికి చెందిన సతీశ్ రాజు ఆయనపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఉండి నియోజకవర్గ కార్యకర్తలను శివరామరాజు తన ఆర్థిక అవసరాల కోసం తాకట్టు పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తాను పేరంటాలమ్మ ఆలయ చైర్మన్గా ఉన్న సమయంలో ఆలయ పునర్నిర్మాణం చేసి అభివృద్ధి చేశానని పేర్కొన్నారు. ఇందుకు ప్రతిగా తనను తొలగించి ప్రత్యర్థులకు చైర్మన్ పదవి కట్టబెట్టడం సమంజసమా అని ప్రశ్నించారు. బీసీ నాయకులను శివరామరాజు చులకనగా చూస్తారంటూ తీవ్ర ఆరోపణలు చేశారు. ఆయనకు సంబంధించి తన దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయన్న సతీశ్ రాజు.. అమరావతిలో చంద్రబాబు నాయుడు సాక్షిగా.. ఆంధ్ర ప్రజల ముందు శివరామరాజు నిజ స్వరూపం బయటపెడతానని పేర్కొన్నారు. -
రాష్ట్రస్థాయి చెడుగుడు పోటీలు ప్రారంభం
ఉండి : రాష్ట్రస్థాయి చెడుగుడు పోటీలు ఆదివారం మండలంలోని చినపుల్లేరు శివారు తల్లమ్మచెరువులో ప్రారంభమయ్యాయి. గ్రామంలోని లూథరన్ చర్చి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ పోటీలను ఎస్సై మంతెన రవివర్మ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యువత చెడు వ్యసనాలకు లోను కాకుండా ఇటువంటి క్రీడలు ఆడుకుని ఆరోగ్యంగా ఉండాలని ఆయన పిలుపునిచ్చారు. కలిదిండి రామకృష్ణంరాజు, పెన్మత్స రామరాజు, సర్పంచ్ కాపా లేయమ్మ రెడ్డియ్య, పెదపుల్లేరు సర్పంచ్ గేదెల మేమలత నరసింహం, ఎంపీటీసీ ఎన్.నిర్మలా సుధాకర్, నిర్వాహక కమిటీ సభ్యులు పాల్గొన్నారు. తొలి రోజు పోటీల్లో తల్లమ్మచెరువు ఎ జట్టు జక్కరం జట్టుపై, తల్లమ్మచెరువు బి జట్టుపై చెరుకువాడ, కుముదవల్లి జట్టుపై ఉండి పెదపేట, వెలివర్రు జట్టుపై చెరుకువాడ బి జట్టు, కొడవల్లి బి జట్టుపై కోపల్లె జట్టు విజయం సాధించాయి.