చంద్రబాబుతో శివరామరాజు (ఫైల్)
సాక్షి, పశ్చిమగోదావరి : జిల్లాలోని ఉండి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీలో వర్గ విభేదాలు భగ్గుమన్నాయి. సొంత పార్టీ ఎమ్మెల్యే శివరామరాజు తీరును విమర్శిస్తూ టీడీపీ నాయకుడు కళ్లేపల్లి సతీశ్ రాజు విడుదల చేసిన వీడియో సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది.
వివరాలు... ఎమ్మెల్యే తీరుతో విసుగు చెందిన వెలివర్రు గ్రామానికి చెందిన సతీశ్ రాజు ఆయనపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఉండి నియోజకవర్గ కార్యకర్తలను శివరామరాజు తన ఆర్థిక అవసరాల కోసం తాకట్టు పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తాను పేరంటాలమ్మ ఆలయ చైర్మన్‌గా ఉన్న సమయంలో ఆలయ పునర్నిర్మాణం చేసి అభివృద్ధి చేశానని పేర్కొన్నారు. ఇందుకు ప్రతిగా తనను తొలగించి ప్రత్యర్థులకు చైర్మన్ పదవి కట్టబెట్టడం సమంజసమా అని ప్రశ్నించారు. బీసీ నాయకులను శివరామరాజు చులకనగా చూస్తారంటూ తీవ్ర ఆరోపణలు చేశారు. ఆయనకు సంబంధించి తన దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయన్న సతీశ్ రాజు.. అమరావతిలో చంద్రబాబు నాయుడు సాక్షిగా.. ఆంధ్ర ప్రజల ముందు శివరామరాజు నిజ స్వరూపం బయటపెడతానని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment