undisclosed income
-
లెక్కలు చూపని రూ. 700 కోట్ల గుర్తింపు
చెన్నై : తమిళనాడుకు చెందిన రెండు మద్యం కంపెనీలపై ఐటీ అధికారులు దాడులు చేపట్టారు. ఈ తనిఖీల్లో లెక్కలు చూపని రూ. 700 కోట్లను అధికారులు గుర్తించారు. అలాగే ఆ రెండు సంస్థల కార్యకలాపాలను స్తంభింపచేశారు. తొలుత బీర్, ఐఎంఎఫ్ఎల్ తయారు చేస్తున్న ఓ ప్రముఖ సంస్థ భారీగా పన్ను ఎగవేతకు పాల్పడుతున్నట్టు నిఘా వర్గాల నుంచి ఐటీ అధికారులకు సమచారం అందింది. ఈ మేరకు రంగంలోకి దిగిన అధికారులు ఈ నెల 6వ తేదీ ఉదయం సోదాలు ప్రారంభించారు. ఆ సంస్థకు చెందిన కార్యాలయాలతోపాటు, ప్రమోటర్లు, కీలక వ్యక్తుల ఇళ్లపై అధికారులు దాడులు చేశారు. తమిళనాడు, గోవా, ఆంధ్రప్రదేశ్, కేరళలో మొత్తం 55 చోట్ల ఈ తనిఖీలు చేపట్టారు. ఈ సోదాల్లో పన్ను ఎగవేతకు సంబంధించి అధికారులు కీలక ఆధారాలు సేకరించారు. గత ఆరేళ్లుగా పన్ను చెల్లించని రూ. 400 కోట్ల ఆదాయాన్ని అధికారులు గుర్తించారు. అయితే ఈ సోదాలు చేపడుతున్న క్రమంలో.. ఇదే రంగానికి చెందిన మరో సంస్థ కూడా భారీగా పన్ను ఎగవేతకు పాల్పడినట్టుగా తెలిసింది. దీంతో ఈ నెల 9 తేదీన సదురు సంస్థ కార్యాలయాలతోపాటు కీలక వ్యక్తుల ఇళ్లపై దాడులు చేపట్టారు. మొత్తంగా చెన్నై, కరైకల్‌లోని ఏడు ప్రాంతాల్లో సోదాలు నిర్వహించారు. ఆ సంస్థ దాదాపు ఆ సంస్థ రూ. 300 కోట్ల ఆదాయానికి పన్ను చెల్లించలేదని గుర్తించారు. అయితే ఆ సంస్థల పేరు మాత్రం ఐటీ అధికారులు వెల్లడించలేదు. -
రూ.5 వేల కోట్ల అప్రకటిత ఆదాయం గుర్తింపు
న్యూఢిల్లీ: పాత పెద్దనోట్ల ఉపసంహరణ తర్వాత దేశవ్యాప్తంగా ఆదాయపు పన్ను (ఐటీ) శాఖ అధికారులు చేసిన దాడుల్లో రూ.5,343.29 కోట్ల అప్రకటిత ఆదాయాన్ని గుర్తించారు. రూ.611.48 కోట్ల విలువైన ఆభరణాలు, నగదును జప్తు చేశారు. జప్తు చేసిన నగదులో రూ.114.1 కోట్లు కొత్త నోట్ల రూపంలో ఉంది. నవంబరు 9 నుంచి జనవరి 8 మధ్య అధికారులు ఆదాయపు పన్ను చట్టం కింద 1,156 సోదాలు, సర్వేలు, విచారణలు చేశారు. పన్ను ఎగ్గొట్టడం, హవాలా వ్యాపారం ఆరోపణలపై వివిధ సంస్థలకు 5,184 నోటీసులు ఇచ్చారు. 535 కేసులను సీబీఐ, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్లకు ఐటీ అధికారులు సిఫార్సు చేశారు. అలాగే నోట్లరద్దు సమయంలో నల్లధనాన్ని దాచుకునేందుకు సహకారబ్యాంకులు బాగా ఉపయోగపడ్డాయని ఐటీ శాఖ పేర్కొంది. -
ఐటీ ఎన్నికోట్లు పట్టుకుందో తెలుసా!
న్యూఢిల్లీ: పెద్ద నోట్లు రద్దు అయినప్పటి నుంచి ఇప్పటి వరకు దాదాపు రూ.4,663కోట్ల లెక్కలు చూపని ఆదాయాన్ని ఐటీ అధికారులు గుర్తించినట్లు తెలిసింది. దేశ వ్యాప్తంగా ఆయా ప్రాంతాల్లో నిర్వహించిన దాడుల్లో ఈ మొత్తం ఆదాయాన్ని గుర్తించినట్లు ఐటీ అధికారులు సమాచారం. అంతేకాకుండా తాజాగా గుర్తించిన లెక్కచూపని వాటిల్లో రూ.562కోట్లను సీజ్ చేసినట్లు కూడా తెలిసింది. వీటిల్లో రూ.110కోట్లు కొత్త నోట్లు ఉన్నాయట. ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా 253 చోట్ల సోదాలు నిర్వహించినట్లు, 556 సర్వేలు చేసినట్లు, 289 చోట్ల సీజ్ చర్యలు తీసుకున్నట్లు ఐటీ వర్గాలు తెలిపాయి. పన్నులకు సంబంధించి మొత్తం 5,062 నోటీసులు పంపించినట్లు కూడా వెల్లడించాయి. అంతకుముందు డిసెంబర్ 22నాటికి ఐటీ అధికారులు గుర్తించిన లెక్క చూపని ఆదాయం రూ.3,185కోట్లు. ఈ మొత్తాన్ని కూడా అప్పుడే వారు సీజ్ చేశారు.