unexpected accident
-
ఒక్క క్షణం గుండె ఆగిపోయినట్లనిపించేది ఇలాంటి సందర్భాల్లోనే కావొచ్చు..!
ఒక్క క్షణం గుండె ఆగిపోయినంతపని ఎప్పుడు అనిపిస్తుంది మనకు? అనుకోని సంఘటనలు జరిగినప్పుడు అని సింపుల్‌గా చెప్పేయకండి. అడవిలో సంచరిస్తున్నప్పుడు ఒక్కసారిగా క్రూర మృగం మీకు ఎదురైతే ఏం చేస్తారు? కాళ్లు చేతులు ఏం ఆడవు. చెమటలు పట్టేస్తాయి. ఇలాంటి సందర్భాల్లో గుండె చప్పుడే అతిపెద్ద శబ్దంలా వినిపిస్తది కదా..! ట్విట్టర్లో యాక్టివ్‌గా ఉండే ప్రముఖ పారిశ్రామిక వేత్త ఆనంద్ మహేంద్ర ఎప్పుడూ ఏదో ఒకటి షేర్ చేస్తుంటారు. ట్విట్టర్ వేదికగా వినూత్న ఆలోచనలను ఎంకరేజ్ చేస్తుంటారు. ఇలానే ఈసారి కూడా ఓ వీడియో షేర్ చేశారు. కాకపోతే ఇది కొంచెం విభిన్నమైనది. ఈ వీడియోలో ఓ వ్యక్తి అడవిలో ఫొటోలు తీయడానికి వెళతారు. కారు ముందు భాగంలో కూర్చుని ఓ వైపు చూస్తుంటారు. తలతిప్పేసరికి ఆ వ్యక్తి ఎదుట సింహం ప్రత్యక్షమవుతుంది. ఈ వీడియోను షేర్ చేస్తూ ఇలాంటి స్థితిలో మీకు వచ్చే మొదటి ఆలోచన ఏంటి? మీరు చేసే మొదటి పని ఏంటీ? అని ఆనంద్ మహేంద్ర తన ఫాలోవర్స్‌ను అడిగారు. ఇంతకూ మీరైతే ఏం చేస్తారో కామెంట్ చేసేయండి మరి..! If you were that man: 1) What would your first thought be? 2) What would your first action be? pic.twitter.com/UGLw4m2yBf — anand mahindra (@anandmahindra) June 10, 2023 ఇదీ చదవండి:విహారంలో అపశృతి..టూరిస్టు స్విమ్మింగ్ చేస్తుండగా.. సొర ఎంట్రీ..క్షణాల్లోనే.. -
అనూహ్య ప్రమాదంలో ప్రేమజంట దుర్మరణం
వోలోగ్రాడ్: ఓ స్కూలులో ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్(పీఈటీ)గా పనిచేస్తోన్న 22ఏళ్ల యువకుడు, అంతే వయసున్న అతని గర్ల్‌ఫ్రెండ్ అనూహ్యరీతిలో దుర్మణం చెందిన వార్త వైరల్ అయింది. రష్యాలోని వోలోగ్రాడ్ ప్రాంతానికి చెందిన ఈ జంట.. శృంగారకలాపం సాగిస్తుండగా కారు నీటమునిగి దుర్మరణం చెందారు. స్థానిక పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం.. స్కూల్ టీచరైన ఎవిజనీ చెర్నోవ్(22), అతని ప్రియురాలు యానా క్ర్యుచ్కోవా(22)లు ఆదివారం కారులో విహారయాత్రకు వెళ్లారు. వొలోగ్రాడ్ నగర శివారులోని ఓ సరస్సు గట్టుమీద కారు ఆపి కాసేపు మాట్లాడుకున్నారు. ఆపై కారు వెనుక సీట్లోకివెళ్లి శృంగారంలో పాల్గొన్నారు. న్యూట్రల్ గేరులో ఉన్న కారు.. కుదుపులకు లోనుకావడంతో ఒక్కసారిగా సరస్సులోకి దూసుకెళ్లింది. కారు నీటమునగడం, అందులోనుంచి బయటికిరాలేని ప్రేమికులు దుర్మరణం చెందడం నిమిషాల్లో జరిగిపోయింది. ప్రత్యక్ష సాక్షుల సమాచారం మేరకు ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు.. నీటి అడుగుభాగం నుంచి కారును వెలికితీశారు. విగతజీవులైన ప్రేమికులిద్దరి కుటుంబాలకు సమాచారం అందించారు. ప్రేమికులు ఉపయోగించింది నివా(రష్యన్ మేడ్) కారని, కుదుపుల కారణంగానే అది సరస్సులోకి దూసుకెళ్లిందన్న పోలీసులు.. ఈ వ్యవహారంలో కారు తయారీదార్లను కూడా ప్రశ్నించనున్నట్లు తెలిపారు.