unicipal elections
-
ప్రచారం పతాకస్థాయికి...
చిత్తూరు (అర్బన్), న్యూస్‌లైన్: మునిసిపల్ ఎన్నికలు ముగియగానే అందరి చూపు ఇప్పు డు గ్రామాలపైనే ఉంది. జిల్లాలో ఆరు మునిసిపాలిటీలు, ఒక కార్పొరేషన్ ఎన్నికలు పూర్తరుున తరువాత జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నిక లపై దృష్టిపడింది. నేతలంతా ఇప్పుడు పల్లెలవైపు పరుగులు తీస్తున్నారు. తొలివిడతగా మదనపల్లె డివిజన్ పరిధిలో 31 జెడ్పీటీసీలు, 447 ఎంపీటీసీ స్థానాలకు ఈ నెల 6న ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం ఆఖరు తేదీ కావడంతో గ్రామాల్లో రాజకీయాలు ఊపందుకున్నాయి. ఓటర్లను ప్రసన్నం చేసుకోవడానికి నేతలు పగలంతా ప్రచారంలోమునిగి, రాత్రులు మండలాల్లో పోటీలో ఉన్న అభ్యర్థుల ఇళ్లల్లో, పట్టున్న నేతల విడిదిలో బస చేస్తూ వ్యూహాలు పన్నుతున్నారు. గ్రామాల్లోనే మకాం నియోజకవర్గ స్థాయి నేతలంతా ఉదయం నుంచి రాత్రి వరకు గ్రామాల్లోనే మకాం వేసి ప్రచారం సాగిస్తున్నారు. పోటీ తీవ్రంగా ఉన్న ప్రాంతాల్లో రాత్రులు సైతం అక్కడే బస చేసి అభ్యర్థుల బలాలు, బలహీనతలను లెక్కకట్టి ఎన్నికల వ్యూహాలను రచిస్తున్నారు. పల్లెలంతా తిరుగుతూ ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. స్థానిక నేతలతో ఎక్కడికక్కడ సమాలోచనలు చేస్తున్నారు. ఇక నియోజవర్గ నేతల సతీమణులు సైతం ప్రచారాల్లో పాల్గొంటూ పతులకు చేదోడు వాదోడుగా నిలుస్తున్నారు. ఇక మహిళలకు రిజర్వయిన స్థానాల్లో సతులను గెలిపించుకోవడానికి పతులు కసరత్తు చేస్తున్నారు. అంతేగాక బరిలో ఉన్న అభ్యర్థి కుటుంబం మొత్తం గడపగడపకు వెళ్లి ఓట్లు అభ్యర్థిస్తూ మద్దతు కూడగట్టుకునే ప్రయత్నంచేస్తోంది. చేరికలు, వలసలతో బిజీ.... నేతల వలసలు ఎక్కువయ్యాయి. ప్రధానంగా పశ్చిమ మండలంలోని ఓ ప్రధాన నాయకుడు ఇప్పటికే మూడు పార్టీల కండువాలు కప్పుకున్నారు. ఆయన పార్టీ మారినప్పుడల్లా క్యాడర్ విధిలేని పరిస్థితుల్లో ఇతర పార్టీల జెండాలు మోశారు. వరుసగా పార్టీలు మారుతుండటంతో జనం చీదరించుకుంటున్నారని ద్వితీయ శ్రేణి క్యాడర్ సదరు నాయకుడిపై గుర్రుగా ఉంటోంది. ఈ సారి తాము ఏ పార్టీలోకి రామని, ఎవ్వరికీ ప్రచారం చేయమని ఖరాకండిగా చెప్పేసింది. వరుస వలసలతో ప్రజల్ని తికమకపెట్టి మన పార్టీనే అధికారంలోకి వస్తుం దని గాంభీర్యం పలుకుతున్న టీడీపీకి రెబల్స్ పోరు వీడటంలేదు. తొలివిడత పోరులో 31 జెడ్పీటీసీ స్థానా ల్లో 11 చోట్ల రెబల్స్ ఉన్నారు. వీరిని బుజ్జగించే ప్రయత్నాలు నియోజకవర్గ ఇన్‌చార్జ్‌లకు అప్పగించడంతో, ఒకవైపు ప్రచారం చేస్తూ, మరోవైపు అసమ్మతిని బుజ్జగించలేక వారి పరిస్థితి అయోమయంగా మారింది. -
కోడ్ కూసింది
అమల్లోకి వచ్చిన నిబంధనావళి నిలిచిపోనున్న రూ. వందల కోట్ల పనులు కార్పొరేటర్ల ఆశలు గల్లంతు సాక్షి, సిటీబ్యూరో : .అనూహ్యంగా మున్సిపల్ ఎన్నికల ‘కోడ్’ కూసింది... ‘గ్రేటర్’లో వందల కోట్ల పనులకు బ్రేక్ పడనుంది... గడచిన నాలుగేళ్లుగా ‘స్థానిక’ అభివృద్ధి పనులు, మౌలిక సదుపాయాలపై శ్రద్ధ చూపని కార్పొరేటర్లు.. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో గత నెల రోజులుగా ఆవురావురుమని పనుల కోసం పాకులాడారు. పార్టీలకతీతంగా మేయర్, కమిషనర్లపై ఒత్తిడి తెచ్చి మరీ వీలైనన్ని నిధులు మంజూరు చేయించుకున్నారు. కానీ ‘అనుకున్నదొక్కటి.. అయినది ఒక్కటి..’ అన్న చందాన మున్సిపల్ ఎన్నికల్ కోడ్ ముందుకు దూసుకొచ్చి కార్పొరేటర్ల దూకుడుకు బ్రేక్ వేసింది. దాదాపు నెల రోజులుగా అధికారులపై పట్టుబట్టి.. పంతాలకు పోయి.. ఆందోళనల డ్రామాలు నిర్వహించి.. ఇబ్బడి ముబ్బడిగా నిధులు మంజూరు చేయించుకున్న గ్రేటర్ కార్పొరేటర్లు... మరో వారం రోజులపాటు వీలైనన్ని శిలాఫలకాలు వేసి, శంకుస్థాపనలు చేద్దామనుకున్నారు. వారు సార్వత్రిక ఎన్నికల కోసం తొందరపడితే అంతకంటే ముందు మున్సిపల్ ఎన్నికల కోడ్ వచ్చి టెండర్లు పూర్తికాని వందల రూ.కోట్ల పనులకు అడ్డుకట్ట వేసింది. ప్రస్తుతం మున్సిపల్ ఎన్నికలు.. ఆ తర్వాత సార్వత్రిక ఎన్నికలు ఉండటంతో మరో మూడునెలల దాకా కొత్త పనులు చేయడానికి వీల్లేదు. ఆ తర్వాత కార్పొరేటర్ల ఎన్నికలకు కూడా ఎక్కువ సమయం ఉండదు. కేవలం మూడు నాలుగు నెలల గడువు మాత్రమే ఉంటుంది. ఈ నేపథ్యంలో కార్పొరేటర్లు ఆందోళనకు గురవుతున్నారు. కేవలం నగర రహదారుల కోసమే రూ. 500 కోట్లకు పైగా నిధులు ఇటీవలే మంజూరయ్యాయి. పాతవి, మరమ్మతులకు సం బంధించినవి, శివార్ల ప్రత్యేక నిధులు తదితరమైనవి వెరసి రోడ్ల కోసం మొత్తం రూ. 735.50 కోట్ల నిధులున్నాయి. వీటిలో వీలైనన్ని పనులకు ఈ రెండు మూడు రోజుల్లోగా కొబ్బరికాయలు కొట్టి శంకుస్థాపనలు చేయాలని భావించిన కార్పొరేటర్ల ఆలోచనలన్నీ తలకిందులయ్యాయి. వీటికి ఓకే సమగ్ర రహదారి అభివృద్ధి పనులకు మంజూరైన రూ. 285 కోట్లలో రూ. 72.54 కోట్ల పనులకు అధికారులు వర్క్ ఆర్డర్లు జారీ చేశారు. ఆ పనులను ప్రారంభించేందుకు ఆటంకాలుండవు. కాగా శంకుస్థాపనల వంటి లాంఛనాలకు మాత్రం బ్రేక్ పడనుంది. రాష్ట్రపతి పాలన అమల్లోకి వచ్చినందున స్థానికంగా జరిగే పనుల్లో తమదే ముఖ్య భూమిక అవుతుందనుకున్న కార్పొరేటర్ల ఆశలపై మున్సిపల్ నోటిఫికేషన్ నీళ్లు చల్లింది. హడావుడి గా శంకుస్థాపనలు సోమవారం కార్యాలయ వేళలు ప్రారంభమయ్యాక ఏ క్షణాన్నైనా ఎన్నికల కోడ్ అమల్లోకి వస్తుందని తెలిసే జీహెచ్ఎంసీ మేయర్ మాజిద్ హుస్సేన్, డిప్యూటీ మేయర్ రాజకుమార్, కమిషనర్ సోమేష్‌కుమార్.. ఆలోగానే రెండు పనులకు లాంఛనాలు పూర్తిచేశారు. ఉదయం 8 గంటలకు ‘డ్రైవ్ అండ్ ఓన్ యువర్ వెహికల్’కు, 8.30 గంటలకు ఇందిరాపార్కులో స్విమ్మింగ్‌పూల్ పనులకు శంకుస్థాపన చేశారు.