unidentified vehicle
-
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
గుర్తుతెలియని వాహనం ఢీకొని ఓ వ్యక్తి మృతి చెందాడు. ఈ సంఘటన నల్లగొండ జిల్లా దేవరకొండ మండలం తూర్పుపల్లి గ్రామ సమీపంలో బుధవారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. మండలంలోని సింగరాజుపల్లికి చెందిన పొనుగోటి శ్రీనివాసరావు(45) వ్యాపారం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో తెల్లవారు జామున బైక్ పై వెళ్తుండగా.. బైక్ తూర్పుపల్లి శివారుకు చేరుకోగానే గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. దీంతో శ్రీనివాసరావు అక్కడికక్కడే మృతిచెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. నల్లగొండ, రోడ్డు ప్రమాదం, వ్యక్తి మృతి, గుర్తు తెలియని వాహనం, బైకర్ మృతి -
రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి
గుర్తు తెలియని వాహనం ఢీకొని యువకుడు మృతిచెందిన సంఘటన రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలం ముర్తూజగూడ గేటు వద్ద ఆదివారం సాయంత్రం జరిగింది. వివరాల్లోకి వెళితే... మహబూబ్నగర్ జిల్లా నందిపాడుకు చెందిన కాశీ(18) స్థానికంగా ఉన్న కంపెనీలో పనిచేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో ఈ రోజు సాయంత్రం ముర్తూజగూడ వద్ద రోడ్డు దాటుతున్న సమయంలో గుర్తు తెలియని వాహనం ఢీకొట్టడంతో మృతిచెందాడు. ఇది గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. -
రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి
గుంటూరు(ఎడ్లపాడు): ఎడ్లపాడు మండలం తిమ్మాపురం గ్రామం చేపలచెరువు వద్ద మిర్చిలోడుతో వెళ్తున్న ఆటోను వెనుక నుంచి గుర్తుతెలియని వాహనం ఢీకొంది. ఈ ఘటనలో ఆటోలో ప్రయాణిస్తున్న ఇద్దరు వ్యక్తులు అక్కడిక్కడే మరణించారు. పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
గుర్తుతెలియని వాహనం ఢీకొని కానిస్టేబుల్ మృతి
కడప: జిల్లాలోని సిద్ధపటం మండలం కనుమలోపల్లిలో బుధవారం జరిగిన రోడ్డుప్రమాదంలో ఏపీఎస్పీ బెటాలియన్ కానిస్టేబుల్ మృతిచెందాడు. గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో ఈ ఘటన చోటుచేసుకున్నట్టు తెలుస్తోంది. మృతుడు బెటాలియన్ కానిస్టేబుల్ బాలాజీగా పోలీసులు గుర్తించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. పూర్తి వివరాలు ఇంకా తెలియరాలేదు. -
రక్తమోడిన రహదారులు
జిల్లాలో పలుచోట్ల రహదారులు రక్తమోడాయి. గుండ్రాతిమడుగు(విలేజీ)లో గుర్తుతెలియని వాహనం ఢీకొని తల్లీకూతురు, కాజీపేటలో లారీ ఢీకొని ఓ మహిళ, నర్మెట మండలం హన్మంతాపూర్లో బైక్ అదుపుతప్పి యువకుడు దుర్మరణం పాలయ్యారు. ఈ ఘటనలు మృతుల కుటుంబాల్లో విషాదాన్ని నింపాయి. వాహనం ఢీకొని తల్లీకూతురు దుర్మరణం గుండ్రాతిమడుగు(కురవి) : గుర్తుతెలియని వాహనం ఢీకొని తల్లీకూతురు మృతిచెందిన సంఘటన మండలంలోని గుండ్రాతిమడుగు(విలేజీ) శివారు పెద్దతండా వద్ద ఆదివారం రాత్రి జరిగింది. ఎస్సై భీమేష్ కథనం ప్రకారం... గుండ్రాతిమడుగు శివారు పెద్దతండాకు చెందిన భూక్యా విజయ(30), తన కూతురు ఝాన్సీ(3)ని తీసుకుని కిరాణం దుకాణానికి బయల్దేరింది. ఈ క్రమంలో మహబూబాబాద్ - భద్రాచలం ప్రధాన రహదా రి దాటుతుండగా గుర్తుతెలియని వాహనం వారిని ఢీకొంది. స్థానికులు 108లో వెంటనే మానుకోట ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమం గా ఉండడంతోఎంజీఎం ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందారు. మృతురాలి భర్త బిచ్చూ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. జనగామ రూరల్ : ద్విచక్ర వాహనం అదుపుతప్పి ఓ యువకుడు దుర్మరణంపాలైన సంఘటన జనగామ-నర్మెట రహదారిపై సోమవారం తెల్లవారుజామున జరిగింది. స్థానికుల కథనం ప్రకారం.. నర్మెట మండలం హన్మంతాపూర్ గ్రామానికి చెందిన మూల అంజయ్య, అరుణ దంపతుల కుమారుడు రామకృష్ణ (24) ఓ దిన పత్రికకు ఏజెంట్గా పనిచేస్తున్నాడు. రోజులాగే సోమవారం తెల్లవారుజామున పేపర్ పార్సిల్ను తీసుకెళ్లేందుకు హన్మంతపూర్ నుంచి జనగామకు బైక్పై బయల్దేరాడు. మూడు కిలోమీటర్లు ప్రయాణించాక ద్విచక్ర వాహనం ఒక్కసారిగా అదుపుతప్పి రోడ్డు పక్కనే ఉన్న గుంతలోకి దూసుకెళ్లింది. దీంతో రామకృష్ణ కుడి చేతి భుజం పూర్తిగా విరిగిపోయి, కడుపు, చాతిలో తీవ్ర గాయాలు కావడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. అటుగా వెళుతున్న వాహనదారులు గుర్తిం చి గ్రామస్తులకు సమాచారం ఇవ్వడంతో వారు చేరుకుని మృతుడిని గుర్తించి మృతుడి తల్లిదండ్రులు, బంధువులకు సమాచారమిచ్చారు. వారు సంఘటన స్థలానికి చేరుకుని బోరున విలపించారు. మృతుడికి భార్య స్వప్న, కుమారుడు శశాంక్ ఉన్నారు. జనగామ పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని ప్రమాదం జరిగిన తీరును పరిశీలించారు. అనంతరం మృతదే హాన్ని పోస్టుమార్టం నిమిత్తం జనగామ ఏరియా ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. రామకృష్ణను వెంటాడిన మృత్యువు నెల రోజుల క్రితం నర్మెట మండలంలోని మరియాపురం క్రాసింగ్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో రామకృష్ణ తీవ్రంగా గాయపడి ప్రాణపాయ స్థితి నుంచి బయటపడ్డాడు. ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న ఆయనను నెల రోజుల తర్వాత మృత్యువు అదే రూపంలో బలి తీసుకుందని గ్రామస్తులు, బంధువులు ఆవేదన వ్యక్తం చేశారు. -
రోడ్డుప్రమాదంలో భర్త మృతి, భార్యకు గాయాలు
గుంటూరు: జిల్లాలోని అచ్చంపేట మండలం దొడ్లేరులో బుధవారం రోడ్డుప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో భర్త అక్కడిక్కడే మృతిచెందగా, భార్యకు తీవ్రగాయాలయ్యాయి. గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో ఈ ఘటన చోటుచేసుకున్నట్టు తెలుస్తోంది. భార్య పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. దాంతో ఆమెను చికిత్స నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించినట్టు సమాచారం. వివరాలు తెలియాల్సివుంది.