రక్తమోడిన రహదారులు | arious places in the district roads | Sakshi
Sakshi News home page

రక్తమోడిన రహదారులు

Published Tue, Dec 16 2014 2:44 AM | Last Updated on Sat, Sep 2 2017 6:13 PM

రక్తమోడిన రహదారులు

రక్తమోడిన రహదారులు

జిల్లాలో పలుచోట్ల రహదారులు రక్తమోడాయి. గుండ్రాతిమడుగు(విలేజీ)లో గుర్తుతెలియని వాహనం ఢీకొని తల్లీకూతురు, కాజీపేటలో లారీ ఢీకొని ఓ మహిళ, నర్మెట మండలం హన్మంతాపూర్‌లో బైక్ అదుపుతప్పి యువకుడు దుర్మరణం పాలయ్యారు. ఈ ఘటనలు మృతుల కుటుంబాల్లో విషాదాన్ని నింపాయి.
 
వాహనం ఢీకొని తల్లీకూతురు దుర్మరణం

 
గుండ్రాతిమడుగు(కురవి) :   గుర్తుతెలియని వాహనం ఢీకొని తల్లీకూతురు మృతిచెందిన సంఘటన మండలంలోని గుండ్రాతిమడుగు(విలేజీ) శివారు పెద్దతండా వద్ద ఆదివారం రాత్రి జరిగింది. ఎస్సై భీమేష్ కథనం ప్రకారం... గుండ్రాతిమడుగు శివారు పెద్దతండాకు చెందిన భూక్యా విజయ(30), తన కూతురు ఝాన్సీ(3)ని తీసుకుని కిరాణం దుకాణానికి బయల్దేరింది. ఈ క్రమంలో మహబూబాబాద్ - భద్రాచలం ప్రధాన రహదా రి దాటుతుండగా గుర్తుతెలియని వాహనం వారిని ఢీకొంది. స్థానికులు 108లో వెంటనే మానుకోట ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమం గా ఉండడంతోఎంజీఎం ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందారు. మృతురాలి భర్త బిచ్చూ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.
 
జనగామ రూరల్ : ద్విచక్ర వాహనం అదుపుతప్పి ఓ యువకుడు దుర్మరణంపాలైన సంఘటన జనగామ-నర్మెట రహదారిపై సోమవారం తెల్లవారుజామున జరిగింది. స్థానికుల కథనం ప్రకారం.. నర్మెట మండలం హన్మంతాపూర్ గ్రామానికి చెందిన మూల అంజయ్య, అరుణ దంపతుల కుమారుడు రామకృష్ణ (24) ఓ దిన పత్రికకు ఏజెంట్‌గా పనిచేస్తున్నాడు. రోజులాగే సోమవారం తెల్లవారుజామున పేపర్ పార్సిల్‌ను తీసుకెళ్లేందుకు హన్మంతపూర్ నుంచి జనగామకు బైక్‌పై బయల్దేరాడు. మూడు కిలోమీటర్లు ప్రయాణించాక ద్విచక్ర వాహనం ఒక్కసారిగా అదుపుతప్పి రోడ్డు పక్కనే ఉన్న గుంతలోకి దూసుకెళ్లింది. దీంతో రామకృష్ణ కుడి చేతి భుజం పూర్తిగా విరిగిపోయి, కడుపు, చాతిలో తీవ్ర గాయాలు కావడంతో అక్కడికక్కడే మృతిచెందాడు.

అటుగా వెళుతున్న వాహనదారులు గుర్తిం చి గ్రామస్తులకు సమాచారం ఇవ్వడంతో వారు చేరుకుని మృతుడిని గుర్తించి మృతుడి తల్లిదండ్రులు, బంధువులకు సమాచారమిచ్చారు. వారు సంఘటన స్థలానికి చేరుకుని బోరున విలపించారు. మృతుడికి భార్య స్వప్న, కుమారుడు శశాంక్ ఉన్నారు. జనగామ పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని ప్రమాదం జరిగిన తీరును పరిశీలించారు. అనంతరం మృతదే హాన్ని పోస్టుమార్టం నిమిత్తం జనగామ ఏరియా ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
 
రామకృష్ణను వెంటాడిన మృత్యువు

 
నెల రోజుల క్రితం నర్మెట మండలంలోని మరియాపురం క్రాసింగ్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో రామకృష్ణ తీవ్రంగా గాయపడి ప్రాణపాయ స్థితి నుంచి బయటపడ్డాడు. ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న ఆయనను నెల రోజుల తర్వాత మృత్యువు అదే రూపంలో బలి తీసుకుందని గ్రామస్తులు, బంధువులు ఆవేదన వ్యక్తం చేశారు.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement