uninon cabinet expansion
-
కొత్త కుర్తాలు కేంద్రమంత్రిగా ప్రమాణస్వీకారం కోసమేనా .. ?
-
మోదీ విధేయుడికి మంత్రి పదవి
బీహార్ కు చెందిన వివాదస్పద నాయకుడు గిరిరాజ్ సింగ్- నరేంద్ర మోదీ ప్రభుత్వంలో కేబినెట్ పదవి పొందారు. బీహార్ నుంచి కేంద్ర కేబినెట్ ప్రాతినిథ్యం లేకపోవడంతో తొలిసారి ఎంపీ అయినప్పటికీ ఆయనకు స్థానం కల్పించారు. నవాడా లోక్‌సభ నియోజకవర్గం నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న గిరిరాజ్ వివాదస్పద వ్యాఖ్యలతో పార్టీకి తలనొప్పులు తెచ్చిపెట్టిన దాఖలాలున్నాయి. లోక్‌సభ ఎన్నికల సందర్భంగా ఆయన చేసిన వ్యాఖ్యలు వివాదస్పదమైయ్యాయి. నరేంద్ర మోదీని వ్యతిరేకించే వారు పాకిస్థాన్‌కు వెళ్లిపోవాలంటూ వ్యాఖ్యానించి చిక్కుల్లో పడ్డారు. ప్రధాని అభ్యర్థిగా మోదీని ముందుగా సమర్థించిన వారిలో గిరిరాజ్ ఒకరు. మోదీ పట్ల చూపిన విధేయతకు ఆయనకు ఫలితం దక్కింది. నవాడా నుంచి పోటీ చేసేందుకు గిరిరాజ్ విముఖత వ్యక్తం చేసినట్టు ఎన్నికల సమయంలో వార్తలు వచ్చాయి. తాను సురక్షితంగా భావించే బెగుసరాయ్ స్థానం కాదని నవాడా సీటు కేటాయిండంతో అయిష్టత ప్రదర్శించారు. దీంతో మోదీ స్వయంగా అక్కడ ఎన్నికల ప్రచారం చేయడమే కాకుండా గిరిరాజ్ ను నవాడా సేవకుడుగా పేర్కొన్నారు. వ్యవసాయం, పశుసంవర్థకం గిరిరాజ్ కు ఇష్టమైన అంశాలు. బీహార్ శాసనమండలిలో సభ్యుడిగా, నితీష్ కుమార్ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేశారు. 2015లో బీహార్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో భూమిహార్ ప్రాంతంలో గిరిరాజ్ ప్రభావం చూపుతారని బీజేపీ అంచనా వేస్తోంది. -
తొలిసారి కేంద్ర మంత్రిగా సాధ్వీ నిరంజన్ జ్యోతి
న్యూఢిల్లీ:ఉత్తరప్రదేశ్ రాష్ట్రం నుంచి తొలిసారి లోక్ సభకు ఎన్నికైన సాధ్వీ నిరంజన్ జ్యోతికి కేంద్ర మంత్రి పదవి దక్కింది. ఏప్రిల్ -మే నెలల్లో జరిగిన సాధారణ ఎన్నికల్లో ఫతేపుర్ నియోజక వర్గం నుంచి ఎన్నికైన ఆమె ఆదివారం సహాయమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. కేంద్ర కేబినెట్ విస్తరణలో భాగంగా బీజేపీ పెద్దలు నిరంజన్ జ్యోతికి స్థానం కల్పించారు. ఉత్తరప్రదేశ్ లో దళిత ఓటు బ్యాంక్ ను దృష్టిలో పెట్టుకున్న ప్రభుత్వం నిరంజన్ జ్యోతికి సహాయమంత్రి పదవి ఇచ్చి గౌరవించింది. గత 2012లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో నిరంజన్ హమిర్ పూర్ నియోజకవర్గం నుంచి ఎన్నికైన సంగతి తెలిసిందే. తాజాగా లోక్ సభకు ఎన్నికైన ఆమె కేంద్ర మంత్రి పదవిని కూడా చేజిక్కించుకుని ఉత్తరప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో కీలక పాత్ర పోషించేందుకు సన్నద్ధమయ్యారు. రాష్ట్రపతి భవన్‌లోని దర్బార్ హాల్లో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆమె చేత ప్రమాణ స్వీకారం చేయించారు. ఈరోజు మొత్తం 21 మంది చేత కొత్త మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. వారిలో నలుగురు కేబినెట్ మంత్రులు కాగా, ముగ్గురు స్వతంత్ర హోదా గల మంత్రులు, మరో 14 మంది సహాయ మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. దీంతో మోడీ కేబినెట్ లో మంత్రి వర్గ సభ్యుల సంఖ్య 66 కు చేరింది. -
మంత్రి పదవిపై 'గురి' కుదిరింది!
కల్నల్ రాజ్యవర్థన్‌సింగ్ రాథోడ్ కేంద్ర సహాయ మంత్రిగా ఆదివారం ప్రమాణ స్వీకారం చేశారు. షూటర్ గా క్రీడాజీవితం ప్రారంభించిన 44 ఏళ్ల రాజ్యవర్థన్‌సింగ్ రాథోడ్ తర్వాత రాజకీయాల్లోకి వచ్చారు. భారత సైన్యాధికారి పదవికి స్వచ్ఛంద విరమణ ప్రకటించి 2013లో బీజేపీ చేరారు. 2014 సాధారణ ఎన్నికల్లో రాజస్థాన్ లోని జైపూర్ రూరల్ నుంచి లోక్‌సభకు ఎన్నికయ్యారు. మొదటిసారిగా ఎంపీగా ఎన్నికైన ఆయనను కేంద్ర మంత్రి పదవి వరించడం విశేషం. బికనీర్ లోని రాజ్‌ఫుత్ వంశానికి చెందిన రాజ్యవర్థన్ 2004లో ఏథెన్స్ ఒలింపిక్స్ లో డబుల్ ట్రాప్ విభాగంలో వ్యక్తిగతంగా రజత పకతం గెలవడం ద్వారా పాపులర్ అయ్యారు. అగ్రశ్రేణి షూటర్ గా ఎదిగిన రాజ్యవర్థన్- కామన్వెల్త్, ఆసియా క్రీడలతో ప్రధాన టోర్నమెంట్లలో పతకాలు సాధించారు. పద్మశ్రీ, రాజీవ్ ఖేల్ రత్న, అర్జున అవార్డులు అందుకున్నారు. క్రీడాకారునిగా దేశానికి ప్రాతినిథ్యం వహించిన రాజ్యవర్థన్- ఇప్పుడు దేశానికి మంత్రి అయ్యారు.