Union HRD minister
-
ఆగస్టు 23న జేఈఈ–అడ్వాన్స్డ్ పరీక్ష
సాక్షి, హైదరాబాద్/న్యూఢిల్లీ: ఐఐటీల్లో ప్రవేశాల కోసం ఉద్దేశించిన జాయింట్ ఎంట్రెన్స్ ఎగ్జామినేషన్(జేఈఈ) అడ్వాన్స్డ్ పరీక్షను ఆగస్టు 23వ తేదీన నిర్వహించనున్నట్లు కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి రమేశ్ పోఖ్రియాల్ తెలిపారు. మే 17న జరగాల్సిన ఈ పరీక్ష లాక్డౌన్ వల్ల వాయిదా పడింది. జేఈఈ–మెయిన్స్ పరీక్షలను జూలై 18 నుంచి 23 వరకు నిర్వహించనున్నట్లు ప్రభుత్వం తెలిపింది. జేఈఈ మెయిన్స్ పరీక్షలు పూర్తయ్యాక 10–15 రోజుల్లో ఫలితాలను వెల్లడించనున్నారు. టాప్ మార్కులు సాధించిన 2.5 లక్షల మందికి జేఈఈ అడ్వాన్స్డ్ రాసేందుకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హత కల్పించనున్నారు. ఆ దరఖాస్తులకు నాలుగైదు రోజుల సమయం ఇస్తారు. ఆగస్టు 23న పరీక్ష నిర్వహించి వీలైనంత త్వరగా ఫలితాలను వెల్లడించనున్నారు. ఆ తరువాత జాయింట్ సీట్ అలకేషన్ అథారిటీ (జోసా) ఐఐటీ, ఎన్ఐటీ, ట్రిపుల్ఐటీ, ప్రభుత్వ ఆర్థిక సహకారంతో కొనసాగే జాతీయ స్థాయి విద్యా సంస్థల్లో ప్రవేశాలకు కౌన్సెలింగ్ నిర్వహించనుంది. సెప్టెంబరు 1వ తేదీ నుంచి ఇంజనీరింగ్ తరగతులను ప్రారంభించేలా ఇటీవల ఏఐసీటీఈ అకడమిక్ షెడ్యూల్ ప్రకటించింది. ‘పీఎం రీసెర్చ్ ఫెలోషిప్ స్కీమ్’లో సవరణలు దేశంలో పరిశోధనలను మరింతగా ప్రోత్సహించడానికి ప్రధానమంత్రి రీసెర్చ్ ఫెలోషిప్ స్కీమ్‌లో పలు సవరణలు చేసినట్లు రమేశ్ పోఖ్రియాల్ నిశాంక్ వెల్లడించారు. ఈ ఫెలోషిప్ పొందడానికి అవసరమైన నిర్దేశిత గేట్ స్కోర్ తగ్గించినట్లు పేర్కొన్నారు. దీన్ని 750 నుంచి 650కి తగ్గినట్లు స్పష్టం చేశారు. అలాగే లేటరల్ ఎంట్రీ అనే వెసులుబాటు కల్పిస్తున్నట్లు తెలిపారు. పీఎంఆర్ఎఫ్ అనుమతి పొందిన విద్యాసంస్థల్లో పీహెచ్డీ చేస్తున్న అభ్యర్థులు ఈ ఫెలోషిప్ కోసం లేటరల్ ఎంట్రీ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని సూచించారు. -
వీకెండ్స్‌లో మాత్రమే నటిస్తా: కేంద్రమంత్రి
ప్రముఖ నటీ స్మృతీ ఇరానీ కేంద్రమంత్రి అయిన తర్వాత మహాబిజీ అయిపోయారు. దాంతో ఆమె నటించేందుకు సమయం చిక్కడం లేదు. దీంతో వీకెండ్స్‌లో రోజుల్లో మాత్రమే నటించాలని నిర్ణయించినట్లు సమాచారం. ప్రస్తుతం ఉమేష్ శుక్లా దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ఆల్ ఈజ్ వెల్. ఆ చిత్రంలో అభిషేక్ బచ్చెన్ తల్లి పాత్రలో స్మృతీ ఇరానీ నటిస్తున్నారు. సార్వత్రిక ఎన్నికల ముందే స్మృతీ ఈ చిత్రంలో నటించేందుకు ఒప్పుకున్నారు. అయితే ఎన్నికలైన తర్వాత ఆమె కేంద్ర మంత్రిగా బాధ్యతలు చేపట్టడం... అది అత్యంత ముఖ్యమైన శాఖలో ఒకటైనా మానవ వనరుల శాఖను చేపట్టారు. దీంతో స్మృతి నిత్యం బిజీబిజీగా ఉంటున్నారు. ఆ విషయాన్ని అర్థం చేసుకున్న హీరో నుంచి లైట్ బాయ్ వరకు చిత్ర యూనిట్ అంతా స్మృతి ఎలా అంటే అలా అని ప్రకటించేశారని సమాచారం. ఆల్ వెల్ చిత్రంలో స్మృతి ఇరానీ భర్తగా రిషి కపూర్ నటిస్తున్నారు. -
మళ్లీ బడిబాట పట్టిస్తాం
డ్రాపవుట్లపై కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ ముంబై: చదువు మధ్యలోనే మానేసిన వారు తిరిగి బడికి వెళ్లేవిధంగా చేస్తామని కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి స్మృతి ఇరానీ పేర్కొన్నారు. ఇందుకు సంబంధించి ఈ ఏడాది చివరిలోగా ఓ కార్యక్రమాన్ని రూపొందిస్తామన్నారు. వివేకానంద ఎడ్యుకేషన్ సొసైటీ ఆధ్వర్యంలో శనివారం నగరంలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న సందర ్భంగా ప్రసంగించారు. ఆర్థిక ఇబ్బందుల కారణంగా చదువుకు స్వస్తి పలికి ఉద్యోగం వైపు మళ్లినవారిని మళ్లీ బడిబాట పట్టిస్తామని అన్నారు. వీరు పీహెచ్డీ వరకూ చదువుకునేవిధంగా అన్నివసతులు కల్పిస్తామన్నారు. విద్యలో స్పెషలైజేషన్‌కు సంబంధించినంతవరకు గిరిజనులు, మహిళలు, షెడ్యూల్ కులాలకు చెందిన చిన్నారులు, ఇతర వెనుకబడిన కులాలకు చెందినవారికి ఉన్నత విద్యాభ్యాసానికి తగినన్ని ఆర్థిక వనరులు అందుబాటులో ఉండవన్నారు. దీంతో వారు మధ్యలోనే చదువుకు స్వస్తి పలుకుతారన్నారు. ఇందుకు కారణం వారికి చదువుకంటే ఉద్యోగమే ముఖ్యం కావడమన్నారు. చివరికి తానుకూడా తగినంత ఆర్థిక వెసులుబాటు లేని కారణంగానే మధ్యలోనే చదువుకు స్వస్తి పలికానన్నారు. పరిశోధకులు, శాస్త్రవేత్తలుగా ఎదగగల సామర్థ్యమున్న వారికోసమే ‘ఇషన్ వికాస్’ కార్యక్రమాన్ని ప్రభుత్వం ప్రారంభించిందన్నారు. ఇటువ ంటి విద్యార్థులు దేశంలోని ప్రముఖ సంస్థలను సందర్శించేందుకు అవసరమైన వసతులు కల్పిస్తామన్నారు. 2,200 మంది విద్యార్థులను ఇందుకు ఎంపిక చేస్తామన్నారు. వారికోసం అవగాహనా కార్యక్రమాలను కూడా నిర్వహిస్తామన్నారు. ఈ కార్యక్రమం దేశవాసులందరికీ ఎంతో ఉపయుక్తంగా ఉంటుందన్నారు. ప్రభుత్వ పాఠశాలలకు ప్రోత్సాహమందిస్తామన్నారు. ప్రతిరోజూ పిల్లలు బడికి వెళుతున్నారా? అక్కడ వారు ఏమిచేస్తున్నారు? ఇచ్చిన హోంవర్క్ చేస్తున్నారా? లేదా? తదితరాలకు సంబంధించిన సమాచారం వారి తల్లిదండ్రులకు ప్రతిరోజూఅందేవిధంగా చేస్తామని, ఇది వచ్చే ఏడాదినుంచి అందుబాటులోకి వస్తుందని తెలిపారు.