Union Minister Mukhtar Abbas Naqvi
-
హజ్ యాత్రికులకు నౌకాయాన సదుపాయం
- వ్యాక్సినేషన్ ప్రారంభించిన కేంద్రమంత్రి నఖ్వీ - 2018 నుంచి కొత్త హజ్ పాలసీ సాక్షి, హైదరాబాద్: హజ్‌యాత్రికులకు నౌకాయాన సదుపాయం కల్పించేందుకు నౌకాయాన మంత్రిత్వ శాఖతో చర్చలు జరుగుతున్నాయని కేంద్ర మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ముక్తార్ అబ్బాస్ నఖ్వీ తెలిపారు. రాష్ట్ర హజ్ కమిటీ ఆధ్వర్యంలో శనివారం ఇక్కడ నాంపల్లి హజ్‌హౌస్‌లో హజ్‌యాత్రకు ఎంపికైనవారికి వాక్సినేషన్ కార్యక్రమం ప్రారంభించారు. మంత్రి మాట్లాడుతూ 1994 వరకు హజ్‌యాత్రకు నౌకల ద్వారానే వెళ్లేవారని, అప్పట్లోనే ఒక నౌకలో ఒకేసారి దాదాపు 2 వేల మంది వరకు యాత్రికులు వెళ్లే అవకాశం ఉండేదన్నారు. వచ్చే ఏడాది నుంచి కొత్త హజ్ పాలసీ రానుందని, హజ్‌యాత్ర తక్కువ ఖర్చు, యాత్రికులకు మరిన్ని సౌకర్యాలు కల్పించేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నామని తెలిపారు. ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ మాట్లాడుతూ ఉమ్మడి రాష్ట్రంలో అప్పటి ప్రభుత్వం హజ్ కమిటీకి కేవలం రూ.కోటిన్నర కేటాయిస్తే, తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక సీఎం కేసీఆర్ నేతృత్వంలోని ప్రభుత్వం రూ.3 కోట్లు కేటాయిస్తోందన్నారు. అన్ని రాష్ట్రాల హజ్ కమిటీల కంటే తెలంగాణ హజ్ కమిటీ యాత్రికులకు సౌకార్యాలు కల్పించడంలో మొదటి స్థానంలో ఉందని చెప్పారు. కార్యక్రమంలో కేంద్రమంత్రి దత్తాత్రేయ, మైనార్టీ సంక్షేమ శాఖ కార్యదర్శి సయ్యద్ ఉమర్ జలీల్, హజ్ కమిటీ ప్రత్యేక అధికారి ఎస్ఎ షుకూర్, ఎమ్మెల్యే జాఫర్ హుస్సేన్ మేరాజ్ తదితరులు పాల్గొన్నారు. -
‘నాటకాలు ఆడుతూ పారిపోతున్నారు’
న్యూఢిల్లీ: పెద్ద నోట్లు వ్యవహారంపై చర్చకు రాకుండా కాంగ్రెస్ పార్టీ నాయకులు దూరంగా పారిపోతున్నారని కేంద్రమంత్రి ముక్తార్ అబ్బాస్ నఖ్వీ అన్నారు. నోట్ల రద్దుపై సానుకూల చర్చకు తమ ప్రభుత్వం సిద్దమని చెప్పినా కాంగ్రెస్ వినడం లేదని, ఎలాంటి సలహాలు ఇచ్చినా తీసుకోవాలనుకుంటున్నామని నఖ్వీ చెప్పారు. కానీ ప్రతి పక్ష పార్టీలు, ముఖ్యంగా కాంగ్రెస్ ఈ విషయంలో మాత్రం తమకు ఏ మాత్రం సహకరించడం లేదని అన్నారు. ‘తొలి రోజే ఏ మాత్రం సమయం వృధా కాకుండా నల్లధనం, నోట్ల రద్దుపై చర్చ చేపట్టాలని మేం నిర్ణయించాం. కానీ, రెండో రోజు మాత్రం కాంగ్రెస్ పార్టీ పారిపోయింది. మేం ప్రతి ప్రశ్నకు సమాధానం చెప్పేందుకు సిద్ధంగా ఉన్నాం. కాంగ్రెస్ నాటకాలు కట్టిపెట్టి చర్చలో పాల్గొంటే మంచిది’ అని ఆయన అన్నారు. -
ఉల్లికి పిజ్జాకు తేడా తెలియదు ఆయన నాయకుడా?
భోపాల్: బీజేపీ నేత, కేంద్ర మంత్రి ముక్తార్ అబ్బాస్ నఖ్వీ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీపై తీవ్ర విమర్శలు చేశారు. రాహుల్‌కు ఉల్లిగడ్డకు పిజ్జాకు(ప్యాజ్ అండ్ పిజ్జా) తేడా తెలియదని ఎద్దేవా చేశారు. అలాంటి ఆయన ఇప్పుడు రైతుల నాయకుడుగా ముందుకొస్తున్నారని విమర్శించారు. 'రాహుల్‌కు ఉల్లిగడ్డలు పిజ్జాలు, వంకాయలు, బర్గర్లకు తేడా తెలియదు. కానీ, ఆయన రైతుల నాయకుడుగా వచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే, ఆయన ఎప్పటికీ ఈ విషయంలో విజయవంతం కాలేరు' అని ఆయన చెప్పారు. తమ ప్రభుత్వాన్ని కొనియాడుతూ తొలిసారి రాజకీయాలకంటే దేశ అభివృద్ధికే ప్రాధాన్యం ఇచ్చిన ప్రభుత్వం తమదని చెప్పుకున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో ఒక్కసారి ప్రపంచ వ్యాప్తంగా దేశ ప్రతిష్ఠ పెరిగిందని చెప్పారు. కొన్నిసార్లు ప్రభుత్వాలను అసత్యాలతో నిందిస్తున్నారని వాస్తవాలేంటో ప్రజలకు, మీడియాకు తెలియజేయాలని మీడియా అధికారిక ప్రతినిధులకు తెలియజేశారు.