
‘నాటకాలు ఆడుతూ పారిపోతున్నారు’
న్యూఢిల్లీ: పెద్ద నోట్లు వ్యవహారంపై చర్చకు రాకుండా కాంగ్రెస్ పార్టీ నాయకులు దూరంగా పారిపోతున్నారని కేంద్రమంత్రి ముక్తార్ అబ్బాస్ నఖ్వీ అన్నారు. నోట్ల రద్దుపై సానుకూల చర్చకు తమ ప్రభుత్వం సిద్దమని చెప్పినా కాంగ్రెస్ వినడం లేదని, ఎలాంటి సలహాలు ఇచ్చినా తీసుకోవాలనుకుంటున్నామని నఖ్వీ చెప్పారు.
కానీ ప్రతి పక్ష పార్టీలు, ముఖ్యంగా కాంగ్రెస్ ఈ విషయంలో మాత్రం తమకు ఏ మాత్రం సహకరించడం లేదని అన్నారు. ‘తొలి రోజే ఏ మాత్రం సమయం వృధా కాకుండా నల్లధనం, నోట్ల రద్దుపై చర్చ చేపట్టాలని మేం నిర్ణయించాం. కానీ, రెండో రోజు మాత్రం కాంగ్రెస్ పార్టీ పారిపోయింది. మేం ప్రతి ప్రశ్నకు సమాధానం చెప్పేందుకు సిద్ధంగా ఉన్నాం. కాంగ్రెస్ నాటకాలు కట్టిపెట్టి చర్చలో పాల్గొంటే మంచిది’ అని ఆయన అన్నారు.