నజ్మా ‘హిందూ’ వ్యాఖ్యలపై వివాదం
అలా అనలేదని వివరణ ఇచ్చిన కేంద్ర మంత్రి
న్యూఢిల్లీ: భారతీయుులందరూ హిందువులంటూ కేంద్ర మైనారిటీ వ్యవహారాల శాఖమంత్రి నజ్మా హెప్తుల్లా వ్యాఖ్యానించారని వచ్చిన వార్తలు వివాదాస్పదమయ్యూయి. దీంతో ఆమె శనివారం వివరణ ఇచ్చారు. భారతీయుుల జాతీయత విషయుంలో అరబ్బీ భాషలో హిందీ.. అనే పదం వాడానని, మతకోణంలో వ్యాఖ్యలు చేయులేదని స్పష్టంచేశారు. హిందూఅనే మాటను వాడనేలేదని తెలిపారు. భారతీయుులకు జాతీయత విషయుంలో ఏకరూపత ఉండాల్సిన అవసరం ఉందన్నారు.
మూడు భాషల్లో మూడురకాలుగా ఇది ఉందని, అరబిక్‌లో హిందీ, పర్షియున్లో హిందుస్థానీ, ఇంగ్లిషులో ఇండియున్ అనే పదాలను వాడుతున్నారన్నారు. అంశంపై కాంగ్రెస్ నేత మనీష్ తివారీ మాట్లాడుతూ, మంత్రి రాజ్యాంగాన్ని చదువుకోవాలని, అందులో భారత్, భారతీయ.. అనే పదాలు ఉంటాయితప్ప హిందూ అని ఉండదని పేర్కొన్నారు.