కేంద్ర పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలి
భారతీయ కిసాన్‌మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాపయ్య
పరిగి: ప్రధానమంత్రి నరేంద్రమోడీ నాయకత్వంలో దేశం అభివృద్ధి చెందుతుందని భారతీయ కిసాన్‌మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాపయ్య అన్నారు. ఆదివారం పరిగిలోని పాలశీతలీకరణ కేంద్రంలో ఆ పార్టీ కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఇందులో భాగంగా నూతన కమిటీని ఎన్నుకున్నారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై ఆయన మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన అన్ని పథకాలను కార్యకర్తలు ప్రజల్లోకి తీసుకు వెళ్లాలని ఆయన సూచించారు.
మండల నూతన అధ్యక్షుడిగా పెంటయ్యగుప్తా
సమావేశం అనంతరం బీజేపీ మండల నూతన కమిటీ ఏర్పాటు చేశారు. ఆ పార్టీ మండల అధ్యక్షుడిగా పెంటయ్యగుప్తా, ఉపాధ్యక్షులుగా శ్యాంసుందర్, కాసుల వెంకటేష్, ప్రధాన కార్యదర్శులుగా జనార్దన్‌రెడ్డి, నర్సింహులు, కార్యదర్శిగా మల్లేశంను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.