ఇండియన్ విండ్ ఎనర్జీ అలయన్స్ ఏర్పాటు
న్యూఢిల్లీ: పవన విద్యుదుత్పత్తి రంగానికి సంబంధించి ఇండియన్ విండ్ ఎనర్జీ అలయన్స్ (ఐడబ్ల్యూఈఏ)ను కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి పియుష్ గోయల్ ప్రారంభించారు. ఇండియన్ విండ్ టర్బైన్ మ్యాన్యుఫాక్చరర్స్ అసోసియేషన్, విండ్ ఇండిపెండెంట్ పవర్ ప్రొడ్యూసర్స్ అసోసియేషన్ కలిసి దీన్ని ఏర్పాటు చేశాయి. పవన విద్యుదుత్పత్తి సంస్థలు, ఇన్వెస్టర్లు, తయారీ కంపెనీలు, సంబంధిత వర్గాల ప్రయోజనాల పరిరక్షణకు ఇది తోడ్పడనుంది.
ఏటా కొత్తగా 10 గిగావాట్ల విండ్ పవర్ ప్లాంట్లు ఏర్పాటు చేసే దిశగా, ప్రభుత్వంతో కలిసి పనిచేస్తామని ఐడబ్ల్యూఈఏ చైర్మన్ సుమంత్ సిన్హా తెలిపారు. ఇందుకు అవసరమయ్యే పూర్తి సహకారాన్ని ప్రభుత్వం అందిస్తుందని పియుష్ గోయల్ ఈ సందర్భంగా చెప్పారు. దేశం విద్యుత్ అవసరాలను తీర్చడం ధ్యేయంగా పనిచేస్తున్నామన్నారు.