United front
-
నేనూ ‘యాక్సిడెంటల్ ప్రధాని’నే: దేవెగౌడ
బెంగళూరు: మాజీ ప్రధాని మన్మోహన్ బయోపిక్‌పై దుమారం రేగుతున్న వేళ.. తానూ అనుకోకుండా ప్రధాని(యాక్సిడెంటల్ ప్రైమ్‌మినిస్టర్) అయ్యాయని మాజీ ప్రధాని హెచ్డీ దేవెగౌడ అన్నారు. తాజా వివాదంపై ఆయన స్పందిస్తూ ‘ ఈ సినిమాపై వివాదం గురించి నాకు పెద్దగా తెలీదు. ఆ మాటకు వస్తే నేను కూడా యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్‌నే’ అని సరదాగా వ్యాఖ్యానించారు. 1996 సార్వత్రిక ఎన్నికల్లో ఏ పార్టీకి మెజారిటీ రాకపోవడంతో కాంగ్రెసేతర, బీజేపీయేతర పార్టీలతో కూడిన యునైటెడ్ ఫ్రంట్ ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసింది. బయటి నుంచి కాంగ్రెస్ ఇచ్చిన మద్దతుతో దేవెగౌడను ప్రధానిగా ఎన్నుకున్నారు. కుమారస్వామి.. యాక్సిడెంటల్ సీఎం దేవెగౌడ కొడుకు, కర్ణాటక సీఎం కుమారస్వామిని బీజేపీ ‘యాక్సిడెంటల్ సీఎం’గా అభివర్ణించింది. రాష్ట్రంలోని పలు ప్రాంతాలు కరువుతో అల్లాడుతుంటే ఆయన కొత్త సంవత్సర వేడుకలు జరుపుకునేందుకు సింగపూర్‌లో పర్యటించడంపై మండిపడింది. ‘కాంగ్రెస్, జేడీఎస్ సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడిన తరువాత 377 మంది రైతులు బలవన్మరణాలకు పాల్పడ్డారు. 156 తాలూకాలను కరువు ప్రాంతాలుగా ప్రకటించారు. ఇంకా రుణమాఫీ ప్రకటనను అమలుచేయలేదు. సీఎం కుమారస్వామి కొత్త సంవత్సర వేడుకల కోసం సింగపూర్ వెళ్తున్నారు. యాక్సిడెంటల్ సీఎం పేరిట సినిమా తీస్తే కుమారస్వామి పాత్రను ఎవరు పోషిస్తారు?’ అని బీజేపీ ట్వీట్ చేసింది. -
ఎన్నికలయ్యాకే ప్రధాని అభ్యర్థిని చెప్తాం
న్యూఢిల్లీ: 2019 లోక్‌సభ ఎన్నికల తర్వాతే ప్రతిపక్ష పార్టీలన్నీ కలిసి ప్రధాని అభ్యర్థి ఎవరనేది నిర్ణయించాలని జేడీఎస్ ప్రధాన కార్యదర్శి డానిష్ అలీ అన్నారు. బీజేపీని ఓడించేందుకు భావసారూప్యం కలిగిన పార్టీలన్నీ కలిసి రావాలన్నారు. గతంలో 3 సందర్భాల్లో ఎన్నికల తర్వాతే ప్రధాని ఎంపిక జరిగిందన్నారు. ‘ఎన్నికల తర్వాతే వీపీ సింగ్‌ను ప్రధాని అభ్యర్థిగా ఎంపిక చేశారు. 1996లో కూడా ఎన్నికల తర్వాత ఏర్పాటైన యునైటెడ్ ఫ్రంట్ హెచ్డీ దేవెగౌడను ప్రధానిగా చేసింది. అదేవిధంగా, ఎన్నికల అనంతరమే యూపీఏ–1 హయాంలో మన్మోహన్ సింగ్ ప్రధానిగా ఎంపికయ్యారు’అని ఆయన చెప్పారు. బహుళ పార్టీ ప్రజాస్వామ్యంలో సాధారణ ఎన్నికల తర్వాతే నాయకత్వం అంశం నిర్ణయమవుతుందని అన్నారు. ఏకాభిప్రాయంతోనే ప్రధానమంత్రిని నిర్ణయించడం జరుగుతుందన్నారు. ఈ విషయంలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమయితే అసలు లక్ష్యమే దెబ్బతింటుందని తెలిపారు. కాంగ్రెస్ లేకుండా రూపొందే ప్రతిపక్ష కూటమి బీజేపీకి ప్రత్యామ్నాయం కాబోదన్నారు. గత ఎన్నికల్లో మొత్తం ఓట్లలో కేవలం 31శాతం మాత్రమే పొందిన బీజేపీ ప్రతిపక్షం లేని భారత్ తెస్తానంటూ కలలు కంటోందని ఎద్దేవా చేశారు. కర్ణాటక రాష్ట్రంలో జేడీఎస్, కాంగ్రెస్ కలిసి పోటీ చేస్తే 28 లోక్‌సభ స్థానాలకు గాను 25పైగానే గెలుచుకుంటాయన్నారు. రెండు పార్టీలు కలిసి ఎన్నికల కోసం కనీస ఉమ్మడి ప్రణాళికను రూపొందిస్తాయన్నారు. జేడీఎస్, కాంగ్రెస్ సంకీర్ణ ప్రభుత్వం పూర్తికాలం ఐదేళ్లు కొనసాగుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు. ఎన్ని విభేదాలున్నా పరిష్కరించుకుంటామని చెప్పారు. ఈ ఐదేళ్లూ జేడీఎస్‌కే సీఎం పదవి ఇచ్చేందుకు కాంగ్రెస్ లిఖితపూర్వకంగా అంగీకరించిందన్నారు. -
రెడ్ల కులస్తుల బలోపేతానికి ...
కడప వైఎస్సార్ సర్కిల్ : రెడ్ల కులస్తుల సంఘం బలోపేతానికి కలసికట్టుగా పనిచేయాలని రెడ్ల ఐక్యవేదిక కన్వీనర్ బి.జనార్ధన్‌రెడ్డి పేర్కొన్నారు. ఆదివారం నగరంలోని మానస హోటల్లో రెడ్ల ఐక్యవేదిక ప్రాథమిక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రెడ్ల కులస్తులు చాలా మంది అనేక విధాలుగా వెనుకబడి ఉన్నారని, వారిని ఆదుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. ఒకరినొకరు చేదోడు వాదోడుగా ఉంటూ అభివృద్ధికి పాటుపడాలన్నారు. రెడ్ల కులస్తులందరినీ ఒక వేదిక పైకి తీసుకొచ్చేందుకు ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. రాబోవు రోజుల్లో రెడ్ల సంఘాన్ని ఏర్పాటు చేసి ప్రభుత్వం నుంచి రావాల్సిన పథకాలను అందరికీ అందే విధంగా సహకరిస్తామన్నారు. ఎవరికైనా ఆపద వస్తే సహాయం కోసం అందరూ ముందుకు రావాలన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ మాధవరెడ్డి, కృష్ణకిశోర్‌రెడ్డి, లేవాకు మధుసూదన్‌రెడ్డి, గంగా ప్రసాద్‌రెడ్డి, రాంప్రసాద్‌రెడ్డి, గజ్జెల సుధాకర్‌రెడ్డితోపాటు రెడ్ల కులస్థులు పాల్గొన్నారు. -
మత్స్యకార ఐక్యవేదికపై టీడీపీ నేతల మాటల తూటాలు
* ఐక్యవేదికగా ఏర్పడితే సమస్యలు పరిష్కారమవుతాయూ అంటూ ప్రశ్నించిన ఎమ్మెల్యే శివాజీ * వంతపాడిన ప్రభుత్వ విప్ కూనరవికుమార్ * ఐక్యవేదిక సభ్యులపై ఆగ్రహం, అసహనం వ్యక్తం చేసిన వైనం * నివ్వెరబోయిన సభ్యులు * నేతల తీరుపై ఆందోళన చిన్నకర్రివానిపాలెం(కవిటి): మత్స్యకార ఐక్యవేదిక ఎప్పుడు ఏర్పడింది... దాని వయసు ఎంత... వారు చెబితేనే పనులు చేస్తున్నామా.. 1983లో ఎన్టీఆర్ గద్దెనెక్కినప్పుడు ఈ మత్స్యకార ఐక్యవేదిక ఉందా? ఈ ఐక్యవేదిక కోరితేనే అప్పుడు ఈ నియోజకవర్గంలో మత్స్యకారులకు కరెంట్,రోడ్లు వంటి మౌలిక సౌకర్యాలు కల్పించారా?, సభలో దివంగత నేత ఎన్టీఆర్ చిత్రప టం కూడా ఏర్పాటుచేయకపోవడం ఏమిటంటూ మత్స్యకార ఐక్యవేదిక సభ్యులపై ఎమ్మెల్యే శివాజీ మాటల తూటాలు పేల్చారు. ఆగ్రహం, అసహనంతో ఊగిపోయూరు. ప్రపంచమత్స్యకార దినోత్సవంలో భా గంగా మండలంలోని చిన్నకర్రివానిపాలెంలో మత్స్యకారుల సభ జరిగింది. కార్యక్రమంలో పాల్గొన్న శివాజీ మాట్లాడుతూ ఐక్యవేదిక ఏర్పాటే ఒక అనిర్వచనీయమైనదిగా పేర్కొన్నారు. సోంపేట థర్మల్ ప్లాంట్ నిర్మాణానికి వ్యతిరేకంగా జరిగిన పోరాటంలో ఏర్పడిన మత్స్యకార ఐక్యవేదికకు వయసెంతంటూ నిలదీశారు. అనంతరం మాట్లాడిన ప్రభుత్వ చీఫ్‌విప్ కూన రవికుమార్ సైతం శివాజీ బాటలోనే తన ప్రసంగం కొనసాగించడంతో మత్స్యకార నేతల్లో ఒకింత ఆందోళన వ్యక్తమైంది. సముద్రపు ఇసుక తరలించడం వల్ల అనర్ధాలు తలెత్తుతాయన్నది ఎక్కడా చదవలేదన్నారు. ఇసుకమైనింగ్లో కేవలం 16 శాతం ముడిఖనిజాలు సేకరించిన తర్వాత మిగిలిన 84 శాతం ఇసుకను మళ్లీ ఎక్కడ సేకరించారో అక్కడే సంస్థ విడిచిపెడుతుందంటూ సెలవిచ్చారు. ముందుగా ఎంపీ కింజరాపు రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ మత్స్యకారుల అభివృద్ధికి టీడీపీ ప్రభుత్వం కృషిచేస్తుందన్నారు. అనంతరం మత్స్యకార ఐక్యవేదిక జిల్లా అధ్యక్షుడు మడ్డు రాజారావు మాట్లాడుతూ తరతరాలుగా సముద్రమే ఆధారంగా బతుకుతున్న మత్స్యకారులకు సముద్రంపై హక్కును కల్పించకపోవడం విచారకరమన్నారు. తీరంపై మత్స్యకారుల హక్కులను హరిస్తూ, ఇసుకను అమ్మేస్తూ మత్స్యకారుల బతుకుల్లో చిచ్చురేపుతున్న పరిశ్రమలను రద్దుచేసి రక్షణ కల్పించాలని కోరారు. సమావేశంలో కలెక్టర్ గౌరవ్ ఉప్పల్, ఎమ్మెల్యే డాక్టర్ బి.అశోక్‌లు మాట్లాడుతూ ఇటీవల శ్రీకాకుళం జిల్లాలో మత్స్యకారుల అభివృద్ధికి ప్రభుత్వానికి నివేదికలు పంపించామని వెల్లడించారు. ఈ సమావేశంలో మత్స్యకార సామాజిక వర్గానికి చెందిన ఎకువూరుకు చెందిన శాస్త్రవేత్త గంటా వెంకటరావు స్వీయరచనలో రూపుదిద్దుకున్న ‘ఫిషర్మెన్ లైవ్లీ హుడ్’ అనే పుస్తకాన్ని నేతలు, అధికారులు ఆవిష్కరించారు. సభకు ముందు మత్స్యకార యువకులు చేసిన సాంప్రదాయ నృత్యం చూపరులను అలరించింది. ఈ సమావేశంలో కవిటి, సోంపేట జెడ్పీటీసీ సభ్యులు బెందాళం రమేష్, సూరాడ చంద్రమోహన్, ఎంపీపీలు బెందాళం కిరణకుమారి, చిత్రాడ శ్రీనివాసరావు, కాశీబుగ్గ మున్సిపల్ చైర్మన్ కోత పూర్ణచంద్ర, బి.ప్రకాష్, సర్పంచ్ గంతి దాశరథి, కర్రి పండయ్య, మాదా సోమయ్య, ఫిషరీస్ డెప్యూటీ డెరైక్టర్ యూకూబ్ బాషా, మత్స్యకార ఐక్యవేదిక సభ్యులు గంతి శ్రీను, మాదా సోమయ్య, కర్రి పండయ్య, వాసుపల్లి కృష్ణారావు తదితరులు పాల్గొన్నారు.