రెడ్ల కులస్తుల బలోపేతానికి ... | Reddy stronghold, strengthen ... | Sakshi
Sakshi News home page

రెడ్ల కులస్తుల బలోపేతానికి ...

Published Sun, Jul 17 2016 11:53 PM | Last Updated on Mon, Sep 4 2017 5:07 AM

రెడ్ల కులస్తుల బలోపేతానికి ...

రెడ్ల కులస్తుల బలోపేతానికి ...


కడప వైఎస్సార్‌ సర్కిల్‌ :
రెడ్ల కులస్తుల సంఘం బలోపేతానికి కలసికట్టుగా పనిచేయాలని రెడ్ల ఐక్యవేదిక కన్వీనర్‌ బి.జనార్ధన్‌రెడ్డి పేర్కొన్నారు. ఆదివారం నగరంలోని మానస హోటల్‌లో రెడ్ల ఐక్యవేదిక ప్రాథమిక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రెడ్ల కులస్తులు చాలా మంది అనేక విధాలుగా వెనుకబడి ఉన్నారని, వారిని ఆదుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు.  ఒకరినొకరు చేదోడు వాదోడుగా ఉంటూ అభివృద్ధికి పాటుపడాలన్నారు. రెడ్ల కులస్తులందరినీ ఒక వేదిక పైకి తీసుకొచ్చేందుకు ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

రాబోవు రోజుల్లో రెడ్ల సంఘాన్ని ఏర్పాటు చేసి ప్రభుత్వం నుంచి రావాల్సిన పథకాలను అందరికీ అందే విధంగా సహకరిస్తామన్నారు. ఎవరికైనా ఆపద వస్తే సహాయం కోసం అందరూ ముందుకు రావాలన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్‌ మాధవరెడ్డి, కృష్ణకిశోర్‌రెడ్డి, లేవాకు మధుసూదన్‌రెడ్డి, గంగా ప్రసాద్‌రెడ్డి, రాంప్రసాద్‌రెడ్డి, గజ్జెల సుధాకర్‌రెడ్డితోపాటు రెడ్ల కులస్థులు పాల్గొన్నారు.



 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement