conviener
-
బీజేపీ నాయకుడి హత్య..ఒకరి అరెస్టు
మణిపూర్‌లో బీజేపీ నాయకుడి హత్య తీవ్ర కలకలం రేపింది. ఈ మేరకు మణిపూర్‌లోని తౌబాల్ జిల్లా బీజేపీ నాయకుడు లైష్రామ్ రామేశ్వర్ సింగ్ క్షేత్రి ప్రాంతంలోని ఆయన నివాసం వద్ద హత్యకు గురయ్యారు. రామేశ్వర్ సింగ్ తన నివాసంలోని గేట్ల వద్ద విగత జీవిగా పడి ఉన్నట్లు తౌబాల్ పోలీసుల హౌబీజం జోగేశ్ చంద్ర తెలిపారు. సింగ్ నివాసానికి రిజిస్ట్రేషన్ నెంబర్ లేని కారులో కొందరు వ్యక్తులు వచ్చి ఆయనకి అతి సమీపంలో నుంచి కాల్పులు జరిపారని చెప్పారు. దీంతో 50 ఏళ్ల నాయకుడు రామేశ్వర్ సింగ్ ఛాతీలోకి బుల్లెట్లు దూసుకుపోవడంతో అక్కడికక్కడే కుప్పకూలిపోయినట్లు తెలిపారు. వెంటనే అతన్ని ఆస్ప్రతికి తరలించామని కానీ ఆయన అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించినట్లు పేర్కొన్నారు. ఈ ఘటన జరిగిన వెంటనే అనుమానితుడు నౌరెమ్ రికీ పాయింటింగ్ సింగ్ అనే వ్యక్తిని అరెస్టు చేసినట్లు తెలిపారు. ఐతే ఈ హత్యకు ప్రధాన సూత్రదారుడు అయెక్పామ్ కేశోర్జిత్గా గుర్తించినట్లు చెప్పారు. అతని ఆచూకీ కోసం తీవ్రంగా గాలిస్తున్నట్లు వెల్లడించారు. ఈ హత్యకు దారితీసిన పరిస్థితులేంటో తెలియాల్సి ఉందన్నారు అధికారులు. రామేశ్వర్ సింగ్ అధికార బీజేపీలో ఎక్స్‌సర్వీస్‌మెన్ విభాగానికి కన్వీనర్. మరోవైపు నిందితలును త్వరిత గతిన పట్టుకోని కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా బీజేపీ రాష్ట్ర ఉపాధ్యాక్షుడ చిదానంద సింగ్ అధికారులను కోరారు. (చదవండి: శ్రద్ధా హత్య కేసు..చార్జిషీట్లో షాకింగ్ ట్విస్ట్) -
ఏపీ మెడికల్ కౌన్సిల్ సభ్యునిగా డాక్టర్ గోపాల క్రిష్ణయ్య
బద్వేలు అర్బన్: ఆంధ్రప్రదేశ్ మెడికల్ కౌన్సిల్ సభ్యునిగా పట్టణానికి చెందిన ప్రముఖ వైద్యుడు డాక్టర్ వి.గోపాలక్రిష్ణయ్య నియమితులయ్యారు. శుక్రవారం స్థానిక వీజీకే ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ జిల్లాకు ఓ కన్వీనర్, ఇద్దరు సభ్యులుంటారని వారిలో కన్వీనర్‌గా డాక్టర్ సి.సాయిప్రసాద్, సభ్యులుగా డాక్టర్ బాలరాజు లతో పాటు తనను నియమించినట్లు ఆయన తెలిపారు. జిల్లాలోని ప్రభుత్వ ప్రైవేటు ఆసుపత్రులలో సౌకర్యాలు ,వసతులు అందిస్తున్న వైద్య సేవలపై ప్రభుత్వానికి నివేదిక అందజేస్తుంటామని తెలిపారు. మెడికల్ , ఫార్మశీ, నర్సింగ్ కళాశాలలతోపాటు ఆసుపత్రులను కూడా తనిఖీ చేసే అధికారం కౌన్సిల్ సభ్యులకు ఉంటుందన్నారు. అలాగే ఖచ్చితంగా ప్రభుత్వ ఆసుపత్రి నిర్వహించేవారు మెడికల్ కౌన్సిల్ అనుమతి తీసుకోవాలన్నారు. -
రెడ్ల కులస్తుల బలోపేతానికి ...
కడప వైఎస్సార్ సర్కిల్ : రెడ్ల కులస్తుల సంఘం బలోపేతానికి కలసికట్టుగా పనిచేయాలని రెడ్ల ఐక్యవేదిక కన్వీనర్ బి.జనార్ధన్‌రెడ్డి పేర్కొన్నారు. ఆదివారం నగరంలోని మానస హోటల్లో రెడ్ల ఐక్యవేదిక ప్రాథమిక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రెడ్ల కులస్తులు చాలా మంది అనేక విధాలుగా వెనుకబడి ఉన్నారని, వారిని ఆదుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. ఒకరినొకరు చేదోడు వాదోడుగా ఉంటూ అభివృద్ధికి పాటుపడాలన్నారు. రెడ్ల కులస్తులందరినీ ఒక వేదిక పైకి తీసుకొచ్చేందుకు ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. రాబోవు రోజుల్లో రెడ్ల సంఘాన్ని ఏర్పాటు చేసి ప్రభుత్వం నుంచి రావాల్సిన పథకాలను అందరికీ అందే విధంగా సహకరిస్తామన్నారు. ఎవరికైనా ఆపద వస్తే సహాయం కోసం అందరూ ముందుకు రావాలన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ మాధవరెడ్డి, కృష్ణకిశోర్‌రెడ్డి, లేవాకు మధుసూదన్‌రెడ్డి, గంగా ప్రసాద్‌రెడ్డి, రాంప్రసాద్‌రెడ్డి, గజ్జెల సుధాకర్‌రెడ్డితోపాటు రెడ్ల కులస్థులు పాల్గొన్నారు.