ఏపీ మెడికల్‌ కౌన్సిల్‌ సభ్యునిగా డాక్టర్‌ గోపాల క్రిష్ణయ్య | ap medical council member in gopala krishnaiah | Sakshi
Sakshi News home page

ఏపీ మెడికల్‌ కౌన్సిల్‌ సభ్యునిగా డాక్టర్‌ గోపాల క్రిష్ణయ్య

Published Fri, Oct 28 2016 11:00 PM | Last Updated on Mon, Sep 4 2017 6:35 PM

ap medical council member in gopala krishnaiah

బద్వేలు అర్బన్‌: ఆంధ్రప్రదేశ్‌ మెడికల్‌ కౌన్సిల్‌ సభ్యునిగా పట్టణానికి చెందిన ప్రముఖ వైద్యుడు  డాక్టర్‌ వి.గోపాలక్రిష్ణయ్య నియమితులయ్యారు. శుక్రవారం స్థానిక వీజీకే ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ జిల్లాకు ఓ కన్వీనర్, ఇద్దరు సభ్యులుంటారని వారిలో కన్వీనర్‌గా డాక్టర్‌ సి.సాయిప్రసాద్, సభ్యులుగా డాక్టర్‌ బాలరాజు లతో పాటు తనను నియమించినట్లు ఆయన తెలిపారు. జిల్లాలోని ప్రభుత్వ ప్రైవేటు ఆసుపత్రులలో సౌకర్యాలు ,వసతులు అందిస్తున్న వైద్య సేవలపై ప్రభుత్వానికి  నివేదిక అందజేస్తుంటామని తెలిపారు. మెడికల్‌ , ఫార్మశీ, నర్సింగ్‌ కళాశాలలతోపాటు ఆసుపత్రులను కూడా తనిఖీ చేసే అధికారం కౌన్సిల్‌ సభ్యులకు ఉంటుందన్నారు. అలాగే ఖచ్చితంగా ప్రభుత్వ ఆసుపత్రి నిర్వహించేవారు మెడికల్‌ కౌన్సిల్‌ అనుమతి తీసుకోవాలన్నారు.

Advertisement

Related News By Category

Advertisement
 
Advertisement

పోల్

Advertisement