University of Arts and Science College
-
అటానమస్ ఆర్ట్స్ కాలేజీ
అకడమిక్ పరంగా స్వయం ప్రతిపత్తి వచ్చే విద్యాసంవత్సరం నుంచే అమలు కేయూ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ ఆమోదమే తరువాయి.. కేయూ క్యాంపస్ : కాకతీయ యూనివర్సిటీ పరిధి హన్మకొండలోని యూనివర్సిటీ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీకి అటానమస్ హోదా లభించింది. ఈ మేరకు యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్(యూజీసీ) పంపిన లేఖ సోమవారం అందింది. వచ్చే విద్యాసంవత్సరం(2016-2017) నుంచి ఈ హోదా అమలులోకి రానుంది. ఈ ఏడాది జులై 27, 28వ తేదీల్లో యూజీసీ నియమించిన ఆరుగురు సభ్యులతో కూడిన ప్రత్యేక కమిటీ ఆర్ట్స్ కాలేజీని సందర్శించి వసతులు, సౌకర్యాలపై ఆరా తీసింది. వారు ఇచ్చే నివేదిక ప్రకారం ప్రస్తుతం అటానమస్ హోదా లభించింది. తద్వారా ఆర్ట్స కాలేజీ కేయూ పరిధిలో ఉన్నప్పటికీ స్వయం నిర్ణయాలతో ముందుకెళ్లవచ్చు. ప్రస్తుతం నిర్వహిస్తున్న డిగ్రీ, పీజీ కోర్సులలో సిలబస్ రూపకల్పనతోపాటు విద్యాబోధన, పరీక్షల నిర్వహణ, ప్రశ్నపత్రాల సెట్టింగ్, జవాబు పత్రాల మూల్యాంకనం, ఫలితాలు విడుదల సొంతంగా చేసుకోవచ్చు. టైంటేబుల్ కూడా యూనివర్సిటీతో సంబంధం లేకుండా సొంతంగా చేసుకునే వెసలుబాటు లభిస్తుంది. నిధులు కూడా యూజీసీ నుంచి నేరుగా అందనున్నందున సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సులు ప్రవేశపెట్టుకోవచ్చు. అయితే, కాకతీయ యూనివర్సిటీ మాత్రం ఆర్థికపరమైన అంశాలను పర్యవేక్షిస్తుంది. అలాగే, ఆర్ట్స్ కాలేజీకి లభించిన అటానమస్‌కు కాకతీయ యూనివర్సిటీ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్లో ఆమోదించాల్సిన అవసరముంది. మినీ యూనివర్సిటీ కాకతీయ యూనివర్సిటి ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజి మినీయూనివర్సిటీగా పిలువబడుతుంది.40 ఎకరాల విస్తీర్ణంలో ఉండి అనేక భవనాలతో మౌళిక వసతులు కలిగి ఉండగా 1927లో కాలేజియట్ హైస్కూల్‌గా ఉండి క్రమక్రమంగా అభివృద్ధి చెందుతోంది. డిగ్రీ కోర్సులతో 1959లో ఓయూ పరిధిలో ఉండి ఆ తరువాత 1976 అగస్టు 19న కాకతీయ యూనివర్సిటీ పరిధిలోకి వచ్చింది. 1995నుంచి పీజీ కోర్సులు కూడా నిర్వహిస్తుండగా.. మాజీ ప్రధాని దివంగత పీవీ.నర్సింహారావు తదితరులెందరో ఈ కళాశాలలో చదువుకున్నారు. కాలేజీలో ప్రస్తుతం 30 వరకు వివిధ కాంబినేషన్లలో డిగ్రీ కోర్సులు, పది పీజీ కోర్సులతో పాటు ఒకేషనల్ కోర్సులు నడుస్తున్నాయి. అలాగే, ఈ కళాశాలకు 2004లో తొలిసారి న్యాక్ ‘ఏ’ గ్రేడ్ లభించగా.. 2014-2015లో రీ అక్రిడేషన్ లభించింది. రెగ్యులర్ అధ్యాపకుల నియమాకం అవసరం యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజీకి అన్ని హంగులున్నా ఉ ద్యోగ విరమణ చేస్తున్న ప్రొఫెసర్ల స్థానంలో కొత్త నియామకాలు జరగడం లేదు. దీంతో 90మంది రెగ్యులర్ అధ్యాపకుల పోస్టులకు కేవలం 23మందే ప్రస్తుతం ఉ న్నారు. మిగతా వారందరూ కాంట్రాక్ట్ లెక్చరర్లే. ప్రస్తు తం అటానమస్ హోదా లభించినందున ఆర్ట్స కళాశాల అభివృద్ధి చెందాలంటే ప్రభుత్వం నియామకాలు చేపట్టాల్సి ఉంది. రెగ్యులర్ ప్రిన్సిపాల్‌ను నియమిస్తేనే అటానమస్ హోదా లభించిన ఫలితం దక్కుతుంది. రిజిస్ట్రార్‌కు లేఖ ఇచ్చాం.. అటానమస్ ఆర్ట్స్ అండ్ై సెన్స్ కాలేజీకి అటానమస్ హోదా కల్పిస్తూ యూజీసీ నుంచి వచ్చిన లేఖను కేయూ ఇన్చార్జి రిజిస్ట్రార్ అల్తాఫ్ హుస్సేన్‌కు ఇచ్చామని కాలేజీ ఇన్చార్జి ప్రిన్సిపాల్ కె.రామానుజరావు తెలిపారు. ఇక ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్లోఆమోదించేలా యూనివర్సిటీ అధికారులు కృషి చేయాల్సి ఉంది. -
మన భవిష్యత్‌ను మనమే నిర్మించుకోవాలి
సకల జనుల సమ్మె ప్రపంచంలోనే స్ఫూర్తిదాయకమైన పోరాటం విద్యార్థులు నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలి ఆర్ట్స్ కళాశాల సదస్సులో కలెక్టర్ గంగాధర కిషన్ సుబేదారి,న్యూస్‌లైన్ : తెలంగాణ రాష్ట్రంలో మ న భవిష్యత్‌ను మనమే నిర్మించుకోవాలని కలెక్టర్ జి.కిషన్ యువతకు సూచించారు. హన్మకొండలోని యూనివర్సిటీ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల ఆడిటోరియంలో గురువారం ప్రస్పెక్టివస్ ఆన్ డెవలప్మెంట్ ఆఫ్ తెలంగాణ (తెలంగాణ అభివృద్ధిలో వివిధ దృక్పథాలు) అంశం పై ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపాల్ జి.భద్రునాయక్ అధ్యక్షతన జరిగిన సదస్సులో ఆయన మాట్లాడారు. సకల జనుల సమ్మె, విద్యార్థుల త్యాగా లు, ఉద్యమాలతో తెలంగాణ రాష్ట్రాన్ని సాధిం చుకున్నామన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక యువత అనేక ఆకాంక్షలతో ఎదురుచూస్తోందన్నారు. తెలంగాణ ప్రభుత్వం వారి ఆశలను నెరవేరుస్తుందని ఆశిద్దామన్నారు. సకల జనుల సమ్మె ప్రపంచంలోనే స్ఫూర్తిదాయకమైన ఉద్యమమని పేర్కొన్నారు. ఇటీవలి కాలంలో విద్యార్హత పట్టాలు ఉన్నప్పటికీ... అనేక మందికి పరి జ్ఞానం ఉండడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. డిగ్రీలకనుగుణంగా నైపుణ్యాన్ని పెంపొందించుకుంటే ఉద్యోగ అవకాశాలు దక్కుతాయన్నా రు. ఉన్నత చదువులు చదివిన యువత చిన్నచి న్న ఉద్యోగాల కోసం దరఖాస్తు చేస్తోందని ఉదహరించారు. యువత ఆంగ్ల భాషలో ప్రావీ ణ్యం సంపాదించుకోవాలని, తెలంగాణలో 18 శాతం ఉన్న ప్రజలను చైతన్యవంతుల్ని చేసేం దుకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. జిల్లాలో అక్షరాస్యతను పెంపొందించేందుకు యువకులు ముందుకు రావాలని, ప్రతి గ్రామంలో కృషి చేయాలన్నారు. తెలంగాణ ప్రాంతం వెనుకబాటుకు అప్పటి పాలకులే కారణమని గతంలో చూపించారని... ప్రస్తుతం స్వయంపాలన వచ్చినందున విద్య, వైద్యం, తాగునీరు, సాగునీరు రంగాలకు ప్రాధాన్యం ఇచ్చి ప్రణాళికలు రూపొందించాలన్నారు. కింది స్థాయి నుంచి ప్రణాళికలు వచ్చినప్పుడే విజ యం సాధ్యమవుతుందన్నారు. కాకతీయ యూనవర్సిటీ సోషల్ స్టడీస్ డీన్, ప్రొఫొసర్ కె.సీతారామారావు మాట్లాడుతూ తెలంగాణలో సుపరిపాలన కోసం అందరూ భాగస్వాములు కావాలన్నారు. బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీల అభివృద్ధికి ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగాలన్నారు. కేయూ ప్రొఫెసర్ సారంగ పాణి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ధితోపాటు సమస్యలను ఎదుర్కోవడానికి ప్రతిఒక్కరూ సిద్ధంగా ఉండాలన్నారు. ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపాల్ భద్రునాయక్ మాట్లాడుతూ తెలంగాణలో వనరులను వినియోగంలోకి తేవడానికి ప్రభుత్వం ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. వ్యవసాయం, పారిశ్రామిక రంగం అభివృద్ధికి చర్యలు తీసుకోవాలన్నారు. కళాకారులు గిద్దె రాంనర్సయ్య, దేవెందర్, యాకూబ్, యాదగిరి శ్రీను, నరేష్ పాటలు పాడి యువతను ఉత్తేజపరిచారు. సద స్సులో సమాచార పౌరసంబంధాల శాఖ డిప్యూటీ డైరక్టర్ డీఎస్.జగన్, ఆచార్యులు కె.రామానుజరావు, టి.శ్రీనివాస్, డాక్టర్ పి.కరుణాకర్, పాండురంగారావు మాట్లాడారు. కాగా, ప్రభుత్వ ప్రాధాన్య పథకాలపై సర్వే ఫామ్స్‌ను సోషియాలజీ విద్యార్థులకు కలెక్టర్ అందజేశారు. జిల్లాలోని 27 మండలాల పరిధిలో ఉన్న 135 గ్రామాల్లో 567 మంది విద్యార్థులు సర్వేలో పాల్గొననున్నట్లు కలెక్టర్ వెల్లడించారు. ఈ నెల 6 నుంచి 15వ తేదీ వరకు పది రోజులపాటు సర్వే చేపట్టనున్నట్లు వివరించారు.