- సకల జనుల సమ్మె ప్రపంచంలోనే స్ఫూర్తిదాయకమైన పోరాటం
- విద్యార్థులు నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలి
- ఆర్ట్స్ కళాశాల సదస్సులో కలెక్టర్ గంగాధర కిషన్
సుబేదారి,న్యూస్‌లైన్ : తెలంగాణ రాష్ట్రంలో మ న భవిష్యత్‌ను మనమే నిర్మించుకోవాలని కలెక్టర్ జి.కిషన్ యువతకు సూచించారు. హన్మకొండలోని యూనివర్సిటీ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల ఆడిటోరియంలో గురువారం ప్రస్పెక్టివస్ ఆన్ డెవలప్‌మెంట్ ఆఫ్ తెలంగాణ (తెలంగాణ అభివృద్ధిలో వివిధ దృక్పథాలు) అంశం పై ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపాల్ జి.భద్రునాయక్ అధ్యక్షతన జరిగిన సదస్సులో ఆయన మాట్లాడారు.
సకల జనుల సమ్మె, విద్యార్థుల త్యాగా లు, ఉద్యమాలతో తెలంగాణ రాష్ట్రాన్ని సాధిం చుకున్నామన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక యువత అనేక ఆకాంక్షలతో ఎదురుచూస్తోందన్నారు. తెలంగాణ ప్రభుత్వం వారి ఆశలను నెరవేరుస్తుందని ఆశిద్దామన్నారు. సకల జనుల సమ్మె ప్రపంచంలోనే స్ఫూర్తిదాయకమైన ఉద్యమమని పేర్కొన్నారు. ఇటీవలి కాలంలో విద్యార్హత పట్టాలు ఉన్నప్పటికీ... అనేక మందికి పరి జ్ఞానం ఉండడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
డిగ్రీలకనుగుణంగా నైపుణ్యాన్ని పెంపొందించుకుంటే ఉద్యోగ అవకాశాలు దక్కుతాయన్నా రు. ఉన్నత చదువులు చదివిన యువత చిన్నచి న్న ఉద్యోగాల కోసం దరఖాస్తు చేస్తోందని ఉదహరించారు. యువత ఆంగ్ల భాషలో ప్రావీ ణ్యం సంపాదించుకోవాలని, తెలంగాణలో 18 శాతం ఉన్న ప్రజలను చైతన్యవంతుల్ని చేసేం దుకు కృషి చేయాలని పిలుపునిచ్చారు.
జిల్లాలో అక్షరాస్యతను పెంపొందించేందుకు యువకులు ముందుకు రావాలని, ప్రతి గ్రామంలో కృషి చేయాలన్నారు. తెలంగాణ ప్రాంతం వెనుకబాటుకు అప్పటి పాలకులే కారణమని గతంలో చూపించారని... ప్రస్తుతం స్వయంపాలన వచ్చినందున విద్య, వైద్యం, తాగునీరు, సాగునీరు రంగాలకు ప్రాధాన్యం ఇచ్చి ప్రణాళికలు రూపొందించాలన్నారు. కింది స్థాయి నుంచి ప్రణాళికలు వచ్చినప్పుడే విజ యం సాధ్యమవుతుందన్నారు.
కాకతీయ యూనవర్సిటీ సోషల్ స్టడీస్ డీన్, ప్రొఫొసర్ కె.సీతారామారావు మాట్లాడుతూ తెలంగాణలో సుపరిపాలన కోసం అందరూ భాగస్వాములు కావాలన్నారు. బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీల అభివృద్ధికి ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగాలన్నారు. కేయూ ప్రొఫెసర్ సారంగ పాణి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ధితోపాటు సమస్యలను ఎదుర్కోవడానికి ప్రతిఒక్కరూ సిద్ధంగా ఉండాలన్నారు. ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపాల్ భద్రునాయక్ మాట్లాడుతూ తెలంగాణలో వనరులను వినియోగంలోకి తేవడానికి ప్రభుత్వం ప్రాధాన్యం ఇవ్వాలన్నారు.
వ్యవసాయం, పారిశ్రామిక రంగం అభివృద్ధికి చర్యలు తీసుకోవాలన్నారు. కళాకారులు గిద్దె రాంనర్సయ్య, దేవెందర్, యాకూబ్, యాదగిరి శ్రీను, నరేష్ పాటలు పాడి యువతను ఉత్తేజపరిచారు. సద స్సులో సమాచార పౌరసంబంధాల శాఖ డిప్యూటీ డైరక్టర్ డీఎస్.జగన్, ఆచార్యులు కె.రామానుజరావు, టి.శ్రీనివాస్, డాక్టర్ పి.కరుణాకర్, పాండురంగారావు మాట్లాడారు. కాగా, ప్రభుత్వ ప్రాధాన్య పథకాలపై సర్వే ఫామ్స్‌ను సోషియాలజీ విద్యార్థులకు కలెక్టర్ అందజేశారు.
జిల్లాలోని 27 మండలాల పరిధిలో ఉన్న 135 గ్రామాల్లో 567 మంది విద్యార్థులు సర్వేలో పాల్గొననున్నట్లు కలెక్టర్ వెల్లడించారు. ఈ నెల 6 నుంచి 15వ తేదీ వరకు పది రోజులపాటు సర్వే చేపట్టనున్నట్లు వివరించారు.