Gangadhar Kishan
-
గీసుకొండను మోడల్‌గా తీర్చిదిద్దుతా..
గంగదేవిపల్లి స్ఫూర్తితో ముందుకు సాగాలి ప్రతి పంచాయతీకి 10 లెడ్ లైట్లు ఇస్తాం సేంద్రియ వ్యవసాయం మేలు కలెక్టర్ గంగాధర కిషన్ గీసుకొండ : మండలంలోని మిగిలిన 16 పంచాయతీలను ఇదే బాటలో నడిపి రాష్ట్రంలోనే గీసుకొండను మోడల్‌గా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తానని కలెక్టర్ గంగాధర కిషన్ హామీ ఇచ్చారు. గీసుకొండ మండలంలోని ఆదర్శ గ్రామం గంగదేవిపల్లిని శనివారం ఆయన తొలిసారిగా సందర్శించారు. గ్రామ ప్రజలు, ప్రజాప్రతినిధులు, అధికారులతో సమావేశమై గ్రామ సమగ్ర అభివృద్ధికి చేపట్టిన చర్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ గంగదేవిపల్లి సాధిం చిన విజయాలను ప్రతి గ్రామపంచాయతీ సర్పంచ్ తెలుసుకుని.... తమ గ్రామాలు అలా ఎందుకు కాకూడదని ఆలోచించాలన్నారు. చాలా విషయాల్లో ఆదర్శంగా ఉన్న గంగదేవిపల్లిని ఇంకా అభివృద్ధి చేయాల్సి ఉందని, ఇందుకోసం తన సహకారం ఉంటుందన్నారు. మన ఊరు-మన ప్రణాళిక కింద ప్రభుత్వం ప్రతి గ్రామానికీ ప్రత్యేక బడ్జెట్‌ను కేటాయిస్తుందని, దీని వల్ల అభివృద్ధి త్వరితగతిన సాగే అవకాశం ఉంటుందన్నారు. ప్రతి గ్రామ పంచాయతీకి పది లెడ్ వీధిలైట్లు సమకూర్చేందుకు చర్యలు చేపడుతున్నామన్నారు. ప్రతి వ్యక్తి తప్పనిసరిగా ఆధార్‌కార్డు, ఓటరుకార్డు, రేషన్‌కార్డు, బ్యాంకు ఖాతా కలిగి ఉండాలని... అప్పుడే ప్రభుత్వం నుంచి వచ్చే సంక్షేమ పథకాలు అందుతాయని వివరించారు. పంచాయతీల్లో ఇంటి, నీటి పన్నును తప్పకుండా చెల్లించాలని, సర్పంచ్‌లకు ఈ విషయంలో పూర్తి అధికారాలు ఉన్నాయన్నారు. పన్నులు చెల్లిం చని వారి ఆస్తులను జప్తు చేసే అధికారం చట్టప్రకారం పంచాయతీలకు ఉందన్నారు. పంటలపై పురుగుల మందులను అతిగా వాడితే అనర్థాలుంటాయని, గంగదేవిపల్లె రైతులు సేంద్రియ వ్యవసాయం చేపట్టాలని ఆకాంక్షిం చారు. కూరగాయల పెంపకం చేపడితే రైతు బజార్లో గ్రామస్తులకు ప్రత్యేక కౌంటర్ ఏర్పాటు చేయిస్తానన్నారు. ప్రతి ఇంటివద్ద వర్మీ కంపోస్టు బెడ్స్ ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. ప్రభుత్వ స్థలాలను గుర్తించాలి... గంగదేవిపల్లిగ్రామంలో సీసీ రోడ్లు, సైడ్ డ్రైన్లు, లింక్‌రోడ్లు వేయించేందుకు కృషి చేస్తానని కలెక్టర్ హామీ ఇచ్చారు. పందుల కుంటను స్టోరేజ్ ట్యాంకుగా ఏర్పాటు చేస్తామని, డంపింగ్ యార్డు తప్పనిసరిగా ఉండాలని.. ఈ మేరకు సర్వే చేసి ప్రభుత్వ స్థలాలను గుర్తించి ప్రజావసరాలకు ఉపయోగించేలా చూడాలని గీసుకొండ తహసీల్దార్ మార్గం కుమారస్వామిని ఆదేశించారు. ప్రభుత్వ పాఠశాలకు రెండు అదనపు తరగతి గదులు మంజూరు చేస్తానని, వీటికి సంబంధించిన ఎస్టిమేట్లను త్వరలో వేసి తీసుకుని రావాలని అధికారులు, సర్పంచ్‌కు సూచించారు. కాగా, గ్రామపంచాయతీ కార్యాలయం, అంగన్వాడీ కేంద్రం, అపార్డు ట్రైనింగ్ సెంటర్లను కలెక్టర్ సందర్శించారు. సమావేశంలో ఎంపీడీఓ పారిజాతం, ఈఓపీఆర్డీ భీంరెడ్డి రవీంద్రారెడ్డి, గ్రా మ అదర్శ అధికారి తిలక్‌గౌడ్, సాక్షరభారత్ మండల కోఆర్డినేటర్ వేల్పుల సురే స్, సర్పంచ్ కూసం లలిత, ఉపసర్పంచ్ కూసం రాజమౌళి, పంచాయతీ కార్యదర్శులు శైలజ, వేణుప్రసాద్, ఐకేపీ సీసీ ర వీందర్‌రాజు, సింగిరెడ్డి జ్యోతి, గోనె కు మారస్వామి,చల్ల మలయ్య పాల్గొన్నారు. -
గ్రామాభివృద్ధికి బాటలు
‘సాక్షి’తో కలెక్టర్ గంగాధర కిషన్ - ‘మన ఊరు... మన ప్రణాళిక’కు శ్రీకారం - గ్రామ అవసరాలే ప్రణాళికలు.. 14 అంశాలకు ప్రాధాన్యం - ప్రజలు, ప్రజాప్రతినిధుల భాగస్వామ్యంతో రూపకల్పన - గ్రామస్థాయిలో ఆర్థిక వనరులు గుర్తిస్తాం సాక్షి ప్రతినిధి, వరంగల్ : గ్రామస్తుల భాగస్వామ్యంతో గ్రామాల అవసరాలను గుర్తించి.. అభివృద్ధికి బాటలు వేయడం ప్రధాన లక్ష్యంగా ‘మన ఊరు... మన ప్రణాళిక’ కార్యక్రమానికి జిల్లా యంత్రాంగం శ్రీకారం చుట్టింది. రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం మేరకు ఈ నెల 13 నుంచి జిల్లా వ్యాప్తంగా గ్రామ ప్రణాళిక రూపకల్పన ప్రక్రియ ప్రారంభించనుంది. ఈ కార్యక్రమంపై మండల పరిషత్ కార్యాలయూల్లో ప్రజాప్రతినిధులు, అధికారులకు శుక్రవారం అవగాహన సదస్సు నిర్వహించను న్నారు. జిల్లాలో ప్రస్తుతం గ్రామ అభ్యుదయ అధికారుల వ్యవస్థ అమల్లో ఉంది. గ్రామదర్శిని పేరుతో జిల్లా కలెక్టర్ జి.కిషన్ 2013 నవంబర్లోనే దీన్ని ప్రారంభించారు. గ్రామాల అవసరాలను గుర్తించి ప్రణాళికలు సిద్ధం చేయడం లక్ష్యంగా ఈ కార్యక్రమం మొదలైంది. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ‘మన ఊరు... మన ప్రణాళిక’ సైతం ఇదే విధంగా ఉంది. ఒక్కో గ్రామానికి ఒక్కో ప్రత్యేకత ఉంటుందని, ఒక్కో గ్రామంలో ఒక్కో రకమైన సమస్య ఉంటుందని, ఊరిని బట్టి అవసరాలు వేరుగా ఉంటాయని, గ్రామస్థుల సూచనలతో గ్రామ ప్రజాప్రతినిధులు ఆధ్వర్యంలో అభివృద్ధి ప్రణాళికలు రూపొందుతాయని కలెక్టర్ గంగాధర కిషన్ చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘మన ఊరు... మన ప్రణాళిక’పై కలెక్టర్ గురువారం ‘సాక్షి ప్రతినిధి’తో ప్రత్యేకంగా మాట్లాడారు. కలెక్టర్ చెప్పిన విషయూలు ఆయన మాటల్లోనే.. ప్రణాళికలో 14 అంశాలు గ్రామస్థాయి ప్రణాళిక రూపకల్పనలో అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకుంటారు. గ్రామపంచాయతీ పరిధిలోని ప్రధాన గ్రామంలోనే కాకుండా అనుబంధంగా ఉండే ఆవాసాలు(పల్లె, గూడెం, తండాలు)లకు సంబంధించి ప్రత్యేకంగా వివరాలు సేకరిస్తారు. విద్య, ఆరోగ్యం, వ్యవసాయం, సాగునీటి సరఫరా, మహిళా సాధికారత, ఉపాధి, జీవనోపాధుల ప్రణాళిక, మౌలిక సదుపాయాలు, వనరుల సమీకృత వంటికి ప్రాధాన్యం ఇస్తారు. గ్రామ స్థాయి ప్రణాళిక రూపకల్పనకు ఇప్పటికే నమూనా సిద్ధమైంది. గ్రామానికి సంబంధించిన జనాభా గణాంకాలు, మౌలిక సదుపాయాలు, గ్రామంలో ఎన్నికైన ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ సిబ్బంది, గ్రామ పంచాయతీ కార్యాలయం, ఇతర ప్రభుత్వ సంస్థలు, విద్య స్థితిగతులు, వైద్య సదుపాయాలు, ఆరోగ్య ప్రణాళిక, గ్రామపంచాయతీ ఆదాయ వనరులు, ఖర్చులు, సహజ వనరులు, సంక్షేమం- అభివృద్ధి అంశాలు, కొత్తగా అవసరమైన మౌలిక సదుపాయాలు, సహజ వనరుల నిర్వహణపై ప్రతిపాదనలు ప్రణాళికలో ఉంటాయి. వీటన్నింటిలో మళ్లీ సూక్ష్మ స్థాయిలో వివరాలు సేకరించడం, అవవసరాలను గుర్తించడం జరుగుతుంది. అందరి భాగస్వామ్యం మన ఊరు... మన ప్రణాళికలో ప్రజల భాగస్వామ్యమే కీలకంగా ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన మేరకు గ్రామస్థాయిలో ఈనెల 13 నుంచి 18 వరకు, మండల స్థాయిలో 19నుంచి 23వరకు, జిల్లా స్థాయిలో 24 నుంచి 28 వరకు ప్రణాళికలు సిద్ధం చేస్తాం. అవసరమైన శిక్షణ కార్యక్రమాలు పూర్తవుతున్నాయి. గ్రామ అభివృద్ధి, అవసరాలు ప్రాతిపదికగా గ్రామస్థుల సూచనలు మేరకు... సర్పంచ్, ఎంపీటీసీ సభ్యుడు, వార్డుమెంబర్లు, వీఆర్వో, గ్రామ కార్యదర్శి, ఇతర శాఖల సిబ్బందితో కలిసి అభ్యుదయ అధికారి ప్రణాళికలు సిద్ధం చేస్తారు. ప్రతి ప్రభుత్వ శాఖ గ్రామస్థాయిలో ప్రణాళికలు సిద్ధం చేస్తుంది. అన్ని కలిపి గ్రామ ప్రణాళిక ఉంటుంది. ఆ తర్వాత దశలో మండల స్థాయి అభివృద్ధి ప్రణాళిక రూపకల్పన ఉంటుంది. ఒకటి కంటే ఎక్కువ గ్రామాలకు సంబంధించిన అభివృద్ధి అంశాలు మండల ప్రణాళికలో ఉంటాయి. జూనియర్ కాలేజీ, రిజర్వాయర్, సంక్షేమ వసతిగృహం, విత్తన సరఫరా కేంద్రం... వంటివి వీటిలో ఉంటాయి. ప్రజలను, ప్రజాప్రతినిధులను భాగస్వామ్యం చేస్తేనే ప్రతి పని, ప్రణాళికల రూపకల్పన విజయవంతమవుతుంది. నిరుపేద, బడుగు బలహీన వర్గాల ప్రత్యేక అవసరాలను గుర్తించి వాటిని పరిష్కరించే దిశగా ప్రణాళికలు ఉంటాయి. గ్రామస్థాయిలో వనరుల లభ్యత, గ్రామాభివృద్ధికి సూక్ష్మస్థాయి ప్రణాళికలు తయారు చేయడం ప్రధాన ఉద్దేశంగా ఈ కార్యక్రమం జరుగుతుంది. అన్ని రకాల అభివృద్ధి, సంక్షేమం గ్రామ స్థాయి నుంచి ఆరంభం కావాలి. దీనికి గ్రామ స్థాయిలో సమకూరే ఆర్థిక వనరులను గుర్తిస్తాం. ప్రభుత్వ పరంగా గ్రామాలకు వచ్చే నిధులు, ప్రత్యేక అవసరాలు, ప్రాజెక్టులకు రూపకల్పన వంటివి చూసుకుని ప్రణాళిక రూపొందిస్తాం. అవకాశాలను గుర్తించాలి... మారిన పరిస్థితులతో ఉపాధి అవకాశాలు పెరుగుతున్నాయి. వీటిని గుర్తించి అందిపుచ్చుకోవడం ముఖ్యం. అంగన్వాడీ కేంద్రాల్లో కోడి గుడ్డు సరఫరా బాధ్యతలను ప్రయోగాత్మకంగా మహిళా సమాఖ్యలకు అప్పగించాం. మొదట్లో రవాణా పరమైన అంశాలతో కొంత ఆలస్యం జరిగేది. ఇది మంచి ఫలితాలను ఇస్తోంది. ఇది జిల్లా అంతటా చేస్తే మహిళా సంఘాలకు ,మహిళా సమాఖ్యలకు ఏటా లక్షల రూపాయల ఆదాయం వస్తుంది. ఇలాంటివి ఎన్నో ఊన్నాయి. నైపుణ్యంతో మహిళా సాధికారత పెరుగుతుంది. స్థానికంగా ఉన్న అవకాశాలను గుర్తించి ఉపాధి వనరులుగా మార్చే ప్రక్రియ పెరగాలి. గ్రామాల వారీగా ఉన్న ఉపాధి అవకాశాలను గుర్తించాలి. ఒక ఊరి నుంచి బయటికి వస్తున్న సరుకులు, అక్కడికి రవాణా అవుతున్న వాటిని గుర్తించడం వల్ల కొందరికి ఉపాధి కల్పించవచ్చు. ఇలాంటివి పూర్తిగా గ్రామ స్థాయి ప్రజాప్రనిధులు, అధికారుల చొరవతోనే సాధ్యమవుతాయి. వ్యవస్థ అభివృద్ధి కావాలి ప్రభుత్వ పరంగా అధికార యంత్రాంగం పాత్ర కీలకమైనది. కలెక్టర్ ఎవరు ఉన్నారనేది నిమిత్తం లేకుండా... జిల్లా యంత్రాంగం ఒక వ్యవస్థగా ఉండాలి. ఇది పరిపూర్ణంగా అభివృద్ధి చెందాలి. అన్ని స్థాయిల్లోనూ.. అందరిలోనూ జవాబుదారీతనం పెరగాలి. ఏ శాఖకు ప్రాధాన్యం ఇస్తారనే ప్రశ్నలు అర్థం లేనివి. ప్రభుత్వ పరంగా, అధికారిగా అన్ని శాఖలూ కీలకమైనవే. ఫలానా వాటికే ప్రాధాన్యం అనేది సరికాదు. కలెక్టర్ ఆకస్మిక తనిఖీ చేస్తేనే పరిస్థితి చక్కబడుతుందనే ఆలోచనా విధానం మంచిది కాదు. ప్రభుత్వ శాఖల్లోని అన్ని కార్యాలయాలు, కేంద్రాలను తనిఖీ చేయాలంటే కలెక్టర్‌కు సాధ్యం కాదు.అధికారుల నుంచి మొదలు ఉద్యోగులు, సిబ్బందిలో జవాబుదారీతనం పెరగాలి. ఇలా ఒక వ్యవస్థ అభివృద్ధి చెందితే ఇలాంటి సమస్యలకు తెరపడుతుంది. -
ఎన్నికల లెక్కలు సమర్పించండి
ఈ నెల 15 వరకు గడువు ఇవ్వని పక్షంలో షాడో రిజిస్టర్ అధారంగా ధరల ఖరారు కలెక్టర్ గంగాధర కిషన్ కలెక్టరేట్, న్యూస్‌లైన్ : జిల్లాలో గత నెల 30వ తేదీన జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులు తమ ఎన్నికల ఖర్చుల వివరాలను ఈనెల 15వ తేదీలోపు సంబంధిత రిటర్నింగ్ అధికారులకు (ఆర్ఓ) అందజేయాలని కలెక్టర్ గంగాధర కిషన్ సూచించారు. ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులు, ఆర్ఓలతో కలెక్టరేట్లో శుక్రవారం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎన్నికల నిబంధనల ప్రకారం ప్రతిఒక్క అభ్యర్థి లెక్కలు సమర్పించాలన్నారు. పెయిడ్ న్యూస్ విషయంలో పూర్తి భాధ్యత అభ్యర్థులదేనని చెప్పారు. ఈ విషయంలో అధికారులు నోటీసులు ఇచ్చినప్పుడు వెంటనే స్పందించాలన్నారు. సకాలంలో లెక్కలు ఇవ్వని పక్షంలో అధికారులు షాడో రిజిస్టర్ అధారంగా ధరలు ఖరారు చేస్తారని స్పష్టం చేశారు. ధరలు అధికంగా లెక్కిస్తున్నారు.. ఎన్నికల ఖర్చుకు సంబంధించి అధికారులు మార్కెట్ ధరల కన్నా రేట్లు అధికంగా వేశారని సమావేశంలో పాల్గొన్న డోర్నకల్ ఎమ్మెల్యే రెడ్యానాయక్, పోటీ చేసిన అభ్యర్థి తిరుణహరిశేషుతోపాటు మరికొందరు కలెక్టర్ దృష్టికి తీసుకొచ్చారు. దీనివల్ల తమకు ప్రత్యక్షంగా నష్టం లేకున్నా... ఆదాయ పన్ను, ఆదాయ వనరులు చూపాల్సిన సమయంలో సమస్యలు ఎదురవుతున్నాయన్నారు. వాస్తవ లెక్కలను పరిగణనలోకి తీసుకోవాలని కోరా రు. ఖర్చులకు సంబంధించిన బిల్లులు ఇవ్వనప్పుడు మాత్రమే అధికారులు ధరలు నిర్ణయించి అభ్యర్థుల ఖాతాలో జమ చేస్తారని కలెక్టర్ వారికి చెప్పారు. అందుకే నోటీసులకు సమాధానమిచ్చి సమస్యను పరిష్కరించుకోవాలని సూచించారు. 9 నుంచి అందుబాటులో ఉండాలి ఈనెల 9 నుంచి 15వ తేదీ వరకు అభ్యర్థుల నుంచి ఎన్నికల లెక్కలు తీసుకునేందుకు సంబంధిత ఆర్ఓ కార్యాలయంలో సహాయ వ్యయ పరిశీలకులు అందుబాటులో ఉండాలని కలెక్టర్ ఆదేశించారు. సందేహాలుంటే ఆర్ఓలను సంప్రదించాలన్నారు. రాజకీయ చర్చ అభ్యర్థులు ఎన్నికల ఖర్చులు ఇచ్చే విషయంలో అవగాహన కల్పించేందుకు ఏర్పాటు చేసిన సమావేశం ప్రారంభంలోనే రాజకీయ చర్చకు దారితీసి ఆసక్తిని రేకెత్తించింది. సమావేశం ప్రారంభం కాగానే ములుగు ఆర్డీఓ మోతీలాల్ ఖర్చులు లెక్కించే విషయంలో అభ్యర్థులకు పలు సూచనలు చేస్తున్నారు. ఈ క్రమంలో మోతీలాల్‌ను ఉద్దేశించి మీరెవరు... అంటూ రెడ్యానాయక్ ప్రశ్నించారు. తాను ములుగు ఆర్డీఓ మోతీలాల్ అని ఆయన సమాధానమిచ్చారు. ఎన్నికల్లో ఆర్ ఓలు, ఏఆర్ఓలు అందరూ టీఆర్ఎస్కు గుద్దమని (ఓటేయమని) చెప్పారు... వారుకూడా వేశారంటూ రెడ్యా అన్నారు. ఆర్డీఓ కలుగజేసుకుని ఎమ్మెల్యే గారూ... అలా మాట్లాడొద్దని సముదాయించే ప్రయత్నం చేశారు. ఇక కలెక్టర్ వచ్చాక కార్యక్రమం ముగుస్తుందనుకున్న సమయంలో ఇదే విషయూన్ని మరో అభ్యర్థి లేవనెత్తారు. ఎమ్మెల్యే రెడ్యానాయక్ అన్నట్లు ప్రస్తుత ఎన్నికల్లో అధికారులు టీఆర్ఎస్కు అనుకూలంగా పనిచేశారని భావిస్తే 2004, 2009లో కాంగ్రెస్‌కు పనిచేశారని భావించాల్సి ఉంటుందన్నారు. దీంతో కలెక్టర్ కల్పించుకుని రాజకీయ చర్చకు ఇది వేదిక కాదని చర్చకు ముక్తాయింపు ఇచ్చారు. వివిధ పార్టీల అభ్యర్థుల ఏజెంట్లు, స్వతంత్ర అభ్యర్థులు పాల్గొన్నారు. -
మన భవిష్యత్‌ను మనమే నిర్మించుకోవాలి
సకల జనుల సమ్మె ప్రపంచంలోనే స్ఫూర్తిదాయకమైన పోరాటం విద్యార్థులు నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలి ఆర్ట్స్ కళాశాల సదస్సులో కలెక్టర్ గంగాధర కిషన్ సుబేదారి,న్యూస్‌లైన్ : తెలంగాణ రాష్ట్రంలో మ న భవిష్యత్‌ను మనమే నిర్మించుకోవాలని కలెక్టర్ జి.కిషన్ యువతకు సూచించారు. హన్మకొండలోని యూనివర్సిటీ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల ఆడిటోరియంలో గురువారం ప్రస్పెక్టివస్ ఆన్ డెవలప్మెంట్ ఆఫ్ తెలంగాణ (తెలంగాణ అభివృద్ధిలో వివిధ దృక్పథాలు) అంశం పై ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపాల్ జి.భద్రునాయక్ అధ్యక్షతన జరిగిన సదస్సులో ఆయన మాట్లాడారు. సకల జనుల సమ్మె, విద్యార్థుల త్యాగా లు, ఉద్యమాలతో తెలంగాణ రాష్ట్రాన్ని సాధిం చుకున్నామన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక యువత అనేక ఆకాంక్షలతో ఎదురుచూస్తోందన్నారు. తెలంగాణ ప్రభుత్వం వారి ఆశలను నెరవేరుస్తుందని ఆశిద్దామన్నారు. సకల జనుల సమ్మె ప్రపంచంలోనే స్ఫూర్తిదాయకమైన ఉద్యమమని పేర్కొన్నారు. ఇటీవలి కాలంలో విద్యార్హత పట్టాలు ఉన్నప్పటికీ... అనేక మందికి పరి జ్ఞానం ఉండడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. డిగ్రీలకనుగుణంగా నైపుణ్యాన్ని పెంపొందించుకుంటే ఉద్యోగ అవకాశాలు దక్కుతాయన్నా రు. ఉన్నత చదువులు చదివిన యువత చిన్నచి న్న ఉద్యోగాల కోసం దరఖాస్తు చేస్తోందని ఉదహరించారు. యువత ఆంగ్ల భాషలో ప్రావీ ణ్యం సంపాదించుకోవాలని, తెలంగాణలో 18 శాతం ఉన్న ప్రజలను చైతన్యవంతుల్ని చేసేం దుకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. జిల్లాలో అక్షరాస్యతను పెంపొందించేందుకు యువకులు ముందుకు రావాలని, ప్రతి గ్రామంలో కృషి చేయాలన్నారు. తెలంగాణ ప్రాంతం వెనుకబాటుకు అప్పటి పాలకులే కారణమని గతంలో చూపించారని... ప్రస్తుతం స్వయంపాలన వచ్చినందున విద్య, వైద్యం, తాగునీరు, సాగునీరు రంగాలకు ప్రాధాన్యం ఇచ్చి ప్రణాళికలు రూపొందించాలన్నారు. కింది స్థాయి నుంచి ప్రణాళికలు వచ్చినప్పుడే విజ యం సాధ్యమవుతుందన్నారు. కాకతీయ యూనవర్సిటీ సోషల్ స్టడీస్ డీన్, ప్రొఫొసర్ కె.సీతారామారావు మాట్లాడుతూ తెలంగాణలో సుపరిపాలన కోసం అందరూ భాగస్వాములు కావాలన్నారు. బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీల అభివృద్ధికి ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగాలన్నారు. కేయూ ప్రొఫెసర్ సారంగ పాణి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ధితోపాటు సమస్యలను ఎదుర్కోవడానికి ప్రతిఒక్కరూ సిద్ధంగా ఉండాలన్నారు. ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపాల్ భద్రునాయక్ మాట్లాడుతూ తెలంగాణలో వనరులను వినియోగంలోకి తేవడానికి ప్రభుత్వం ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. వ్యవసాయం, పారిశ్రామిక రంగం అభివృద్ధికి చర్యలు తీసుకోవాలన్నారు. కళాకారులు గిద్దె రాంనర్సయ్య, దేవెందర్, యాకూబ్, యాదగిరి శ్రీను, నరేష్ పాటలు పాడి యువతను ఉత్తేజపరిచారు. సద స్సులో సమాచార పౌరసంబంధాల శాఖ డిప్యూటీ డైరక్టర్ డీఎస్.జగన్, ఆచార్యులు కె.రామానుజరావు, టి.శ్రీనివాస్, డాక్టర్ పి.కరుణాకర్, పాండురంగారావు మాట్లాడారు. కాగా, ప్రభుత్వ ప్రాధాన్య పథకాలపై సర్వే ఫామ్స్‌ను సోషియాలజీ విద్యార్థులకు కలెక్టర్ అందజేశారు. జిల్లాలోని 27 మండలాల పరిధిలో ఉన్న 135 గ్రామాల్లో 567 మంది విద్యార్థులు సర్వేలో పాల్గొననున్నట్లు కలెక్టర్ వెల్లడించారు. ఈ నెల 6 నుంచి 15వ తేదీ వరకు పది రోజులపాటు సర్వే చేపట్టనున్నట్లు వివరించారు. -
కలెక్టర్ కిషన్‌కు పదోన్నతి
కలెక్టరేట్, న్యూస్‌లైన్ : సెలక్షన్ గ్రేడ్ అధికారిగా కలెక్టర్ గంగాధర కిషన్‌కు పదోన్నతి కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీచేసింది. ఈ మేరకు ఇంతకాలం అడిషనల్ సెక్రటరీ హోదాలో ఉన్న కలెక్టర్ ప్రస్తుతం సెక్రటరీ హోదా పొందారు. ప్రభుత్వం జీఓ ఆర్టీ 441 ప్రకారం రాష్ట్రంలో 2001 బ్యాచ్‌కు చెందిన తొమ్మిది మంది ఐఏఎస్ అధికారులకు పదోన్నతి కల్పించింది. కలెక్టర్ కిషన్‌తోపాటు జిల్లాలో గతంలో వివిధ హోదాల్లో పనిచేసిన స్మితాసభర్వాల్, నీతూప్రసాద్, శ్రీనివాస్‌రాజు పదోన్నతి పొందిన వారిలో ఉన్నారు. -
గ్రామాభ్యుదయమే లక్ష్యం
పట్టణాలకు దీటుగా పల్లెల అభివృద్ధికి కృషి కాకతీయ ఉత్సవాల స్ఫూర్తితో మేడారం ఏర్పాట్లు 1.26 లక్షల ఎకరాలకు ఎస్సారెస్పీ సాగు నీరు ఇప్పటివరకు ‘దేవాదుల’ ఖర్చు రూ. 6,723 కోట్లు పథకాలు పేదలందరికీ చేరేలా ప్రతిఒక్కరూ పాటుపడాలి గణతంత్ర వేడుకల్లో కలెక్టర్ గంగాధర కిషన్ కలెక్టరేట్,న్యూస్‌లైన్: ‘పల్లె సీమలే దేశానికి పట్టుగొమ్మలు... వాటి అభివృద్ధే నిజమైన స్వరాజ్యం’ అన్న మహాత్మాగాంధీ మాటలు స్ఫూర్తిగా తీసుకుని జిల్లాలోని ప్రతి గ్రామం అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో దూసుకెళ్లేలా తన వంతు కృషి చేస్తానని కలెక్టర్ గంగాధర కిషన్ పేర్కొన్నారు. రాష్ట్రంలోనే తొలిసారిగా జిల్లాలో మండల స్థాయి అధికారులను గ్రామాభ్యుదయ అధికారులుగా నియమించానని, పట్టణాలకు దీటుగా గ్రామాల అభివృద్ధికి అందరి సహకారంతో ముందుకు సాగుతున్నట్లు తెలిపారు. 65వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆదివారం హన్మకొండలోని పోలీస్ పరేడ్ గ్రౌండ్లో కలెక్టర్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. స్వాతంత్య్ర సమరయోధులను సత్కరించి, పోలీసు బలగాల వందనం స్వీకరించిన అనంతరం ప్రజలనుద్దేశించి గణతంత్ర సందేశం ఇచ్చారు. జిల్లాలో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు, భవిష్యత్ కార్యాచరణను వివరించారు. కాకతీయ ఉత్సవాలను ఏడాదిపాటు అత్యంత వైభవంగా జరుపుకున్నామని, అదే స్ఫూర్తితో కోటిమంది భక్తులు హాజరయ్యే మేడారం సమ్మక్క-సారలమ్మ జాతరకు ఘనంగా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. కాకతీయ ఉత్సవాల నిర్వహణతో పర్యాటక పరంగా జిల్లా ప్రగతి సాధించిందని, 60 లక్షలకుపైగా దేశీయులు, 800కు పైగా విదేశీ పర్యాటకులు జిల్లాను సందర్శించారని వెల్లడించారు. ఈ సారి ప్రకృతి కరుణించడంతో వర్షపాతం సాధారణం కన్నా ఎక్కువగా నమోదైందని, రబీలో రైతులు 86,320 హెక్టార్లలో వరి, మొక్కజొన్న వేరుశనగ తదితర పంటలు సాగుచేస్తున్నారన్నారు. రూ.2.94 కోట్ల రాయితీపై రైతులకు 11,688 క్వింటాళ్ల విత్తనాలను సరఫరా చేశామన్నారు. సాగునీటి ప్రాజెక్టుల పరంగా ఎస్సారెస్పీ రెండో దశ కింద 1,26,260 ఎకరాల ఆయకట్టుకు నీరందించేందుకు పనులు చేపట్టారని, ఇప్పటివరకు భూసేకరణ, పునరావాస పనులకు రూ. 338 కోట్లు వ్యయం చేసినట్లు చెప్పారు. జిల్లాలోని కరువు ప్రాంతాలను సస్యశ్యామలం చేయడానికి దేవాదుల ఎత్తిపోతల పథకం అమలుకు మూడు దశల్లో ఇప్పటివరకు రూ. 6,723 కోట్లు ఖర్చు చేశామన్నారు. ఎత్తిపోతల ద్వారా సుమారు 2.50 టీఎంసీల నీటిని ధర్మసాగర్, ఘన్పూర్, అశ్వరావుపల్లి, చీటకోడూరు, గంటరామారం, బొమ్మకూరు టపాసుపల్లి రిజర్వాయర్లకు సరఫరా చేసినట్లు తెలిపారు. వచ్చే ఖరీఫ్‌లో 1.41 లక్షల ఎకరాలకు నీరందించేందుకు ప్రయత్నాలు చేస్తున్నామన్నారు. ఎన్ఆర్ఈజీఎస్ కింద ఈ సంవత్సరం రూ.160 కోట్లతో 5.58 లక్షల మంది కూలీలకు పనిక ల్పించామని, రైతాంగం కోసం రూ.30 కోట్లతో 33/11 కేవీ విద్యుత్ కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. ఇందిరమ్మ పచ్చతోరణం కింద నర్సరీలు ఏర్పాటు చేసి జిల్లాలో 23.20 లక్షల మొక్కలను 8,772 మంది రైతులకు అందజేసినట్లు తెలిపారు. రూ.9.96 కోట్ల వ్యయంతో మూడు వేల మంది ఎస్సీ, ఎస్టీ లబ్ధిదారుల భూముల్లో మొక్కల పెంపకానికి చర్యలు తీసుకున్నామన్నారు. విద్యాపరంగా జిల్లాలో రూ.4.80కోట్లుతో 24 నూతన పాఠశాలల భవనాలు ప్రారంభించామని, బడిబయట ఉన్న విద్యార్థులను ప్రత్యేక కార్యక్రమం ద్వారా బడిలో చేర్పించామన్నారు. నూతనంగా ఆదర్శ పాఠశాలల్లో 271 ఉపాధ్యాయ పోస్టులను భర్తీచేసినట్లు వెల్లడించారు. ఐటీడీఏ ద్వారా రూ.5.58కోట్లతో గ్రామాల్లో తాగునీటి పనులు పూర్తి చేశామని, నాబార్డు నిధులు రూ.3 కోట్లతో రోడ్లు వేయించామన్నారు. అటవీహక్కు గుర్తింపు చట్టం కింద 1,18,122 ఎకరాల భూమి హక్కు పత్రాలను 134 సామాజిక సంఘాలకు... 41,314 ఎకరాల భూమిని 14,016 మందికి అందజేశామన్నారు. జిల్లాలో అమ్మహస్తం, అమృతహస్తం, పేదలకు బీమా, రాజీవ్ ఆరోగ్యశ్రీ, ఉద్యోగశ్రీ, పథకాలు పూర్తి స్థాయిలో అమలు చేసేలా కృషి చేస్తున్నామని చెప్పారు. గృహనిర్మాణం, ఉపకారవేతనాల పంపిణీ జిల్లాలో పక్కాగా అమలవుతున్నాయని, ఎస్సీ,ఎస్టీ ఉప ప్రణాళిక నిధులతో వసతి గృహాల నిర్మాణాలు చేపట్టామన్నారు. అయితే ప్రభుత్వం ఎన్ని అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేపట్టినా... వాటిని అన్నివర్గాలవారు పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకున్నప్పుడే సర్కారు లక్ష్యం నెరవేరినట్లు భావించాలని పేర్కొన్నారు. ఆ లక్ష్యాన్ని నేరవేర్చేందుకు ప్రతిఒక్కరూ అంకిత భావంతో కృషి చేయాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర పండగ మేడారం ప్రభుత్వం రాష్ట్ర పండగగా గుర్తించిన మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర ఫిబ్రవరి 12 నుంచి 15వ తేదీ వరకు జరగనుందని, ఈ సారి కోటి మంది భక్తులు దర్శించుకుంటారని అంచనా వేశామన్నారు. ఈ మేరకు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నామని వివరించారు. భక్తుల రద్దీ వల్ల ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడకుండా తుమ్మల వాగు, వట్టి వాగుపై ైెహ లెవల్బ్రిడ్జి, జంపన్నవాగుపై స్నానఘట్టాల నుంచి గద్దెల వరకు నాలుగు లేన్లరోడ్డు నిర్మిస్తున్నామన్నారు. ఈ నెలాఖరు వరకు మేడారంలో అభవృద్ధి పనులు పూర్తవుతాయని చెప్పారు. ప్లాస్టిక్ రహిత జాతరగా మార్చేందుకు చర్యలు తీసుకున్నట్లు వివరించారు. జిల్లా అభివృద్ధికి సహాయ సహకారాలు అందిస్తున్న కేంద్ర మంత్రి బలరాంనాయక్, జిల్లా ఇన్చార్జ్ మంత్రి రాంరెడ్డి వెంకట్‌రెడ్డి, మంత్రులు పొన్నాల లక్ష్మయ్య, బస్వరాజు సారయ్య, ప్రభుత్వ చీఫ్ విప్ గండ్ర వెంకటరమణారెడ్డి, ఇతర ప్రజాప్రతినిధులకు కలెక్టర్ కిషన్ కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో జేసీ పౌసుమి బసు, ఎన్పడీసీఎల్ సీఎండీ కార్తికయమిశ్రా, వరంగల్ మునిసిపల్ కార్పొరేషన్ కమిషనర్ సువర్ణపండాదాస్, శిక్షణట్రెరుునీ కలెక్టర్ హన్మంతు, ఏజేసీ సంజీవయ్య, డీఆర్వో సురేంద్రకరణ్, రూరల్, అర్బన్ ఎస్పీలు లేళ్ల కాళిదాసు, వెంకటేశ్వర్రావు ఇతర ప్రభుత్వ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. గుంపులో గోవిందా..! గ ణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆనవాయితీగా చేపట్టే ఆవార్డుల కార్యక్రమంలో ఈ సారి జిల్లా యంత్రాంగం అనుసరించిన పద్ధతిపై విమర్శలు వ్యక్తమవుతున్నారుు. గుంపులో గోవిందా.. అన్నట్లు ప్రశంస పత్రాలు అందజేయడమే ఇందుకు కారణం. ఉద్యోగి సర్వీసులో కలెక్టర్ చేతుల మీదుగా ఉత్తముడిగా అవార్డు అందుకునే అవకాశం మహా అయితే ఒకటి రెండుసార్లకన్నా ఎక్కువ రాదు... అది కూడా అందరికీ రాదు... ఇలాంటి సమయంలో ఉద్యోగులు తమ కుటుంబ సభ్యులను తీసుకొచ్చి ప్రశంసాపత్రాలు అందుకునే సమయానికి అంతా గుంపుగా వచ్చి అందుకోవాలని ప్రకటన చేయడంతో ద్యుగులు తీవ్ర నిరాశకు గురయ్యూరు. ఇక ముందయినా అధికారులు ఇలాంటి కార్యక్రమాల విషయంలో పునరాలోచించాలని కోరుతున్నారు.