అన్లిమిటెడ్ కాలింగ్ ఆఫర్‌తో ఎయిర్టెల్
రిలయన్స్ ఇండస్ట్రీస్ ప్రతిష్టాత్మకమైన జియో ప్రాజెక్టుకు కమర్షియల్ లాంచ్‌కు ముందే టెలికాం సంస్థలన్నీ జాగ్రత్త పడుతున్నాయి. కొత్త కొత్త ఆఫర్లతో వినియోగదారుల ముందుకు వస్తున్నాయి. ప్రస్తుతం నంబర్‌వన్ టెలికాం సంస్థ ఎయిర్ టెల్ తమ పోస్ట్ పెయిడ్ కస్టమర్ల కోసం బంపర్ ఆఫర్‌ను ప్రకటించింది. నెలకు 1,199 రూపాయలకే అన్ లిమిటెడ్ మొబైల్ కాల్స్ ఆఫర్‌ను వినియోగదారులకు అందుబాటులోకి తీసుకొస్తున్నట్టు శుక్రవారం వెల్లడించింది. ఈ కొత్త ప్లాన్‌తో పోస్ట్ పెయిడ్ కస్టమర్లకు అన్ లిమిటెడ్ కాల్స్ సౌకర్యాన్ని ఆఫర్ చేయనున్నట్టు తెలిపింది. నేషనల్ రోమింగ్ కాల్స్‌పై ఎలాంటి రుసుములుండవని పేర్కొంది. ఈ ఆఫర్‌తో రోజుకు 100 ఉచిత ఎస్ఎంఎస్లు, ఉచిత డేటా ఆఫర్లను ఎంజాయ్ చేయొచ్చని పేర్కొంది.
గత నెలే హ్యాపీ అవర్స్‌తో వినియోగదారుల ముందుకు వచ్చిన ఎయిర్టెల్ మరో శుభవార్తతో కస్టమర్లను ఆకట్టుకుంటోంది. జియో సేవలు ప్రారంభం కానున్న నేపథ్యంలో తమ ఖాతాదారులను నిలబెట్టుకోవడానికి, కొత్తవారిని ఆకర్షించేందుకు భారతీ ఎయిర్టెల్ ఈ మేరకు కొత్త ఆఫర్లను ప్రకటిస్తున్నట్టు తెలుస్తోంది. అయితే హ్యాపీ అవర్స్ డేటాను ప్రీపెయిడ్ యూజర్ల కోసం ఎయిర్ టెల్ ప్రకటించింది. ప్రస్తుతం పోస్ట్ పెయిడ్ వినియోగదారులకు ఈ కొత్త ప్లాన్‌ను ఆవిష్కరించింది.
రిలయన్స్ జియో కమర్షియల్ లాంచ్‌కు ముందుగానే ఎయిర్టెల్ ఈ ప్లాన్‌ను ప్రకటించడం విశేషం. రానున్న మూడునెలలో ఎప్పుడైనా రిలయన్స్ జియో సేవలు కమర్షియల్‌గా ప్రారంభం కావొచ్చని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. అక్టోబర్‌లో ఫెస్టివల్ సీజన్లో ప్రారంభిస్తారని పేర్కొంటున్నాయి. కమర్షియల్ ప్రారంభంపై సర్వత్రా ఆసక్తి నెలకొన్న నేపథ్యంలో తమ నెట్ వర్క్ ట్రయల్స్‌కు ఆసక్తి గల వినియోగదారుల నుంచి రిజిస్ట్రేషన్లు ఆహ్వానిస్తోందట.