నిరుద్యోగులకు సెక్యూరిటీ రంగంలో శిక్షణ
జెడ్పీసెంటర్(మహబూబ్నగర్): డీఆర్డీఏ ఆధ్వర్యంలో రక్ష సెక్యూరిటీ సర్వీసెస్ కంపెనీ సహకారంతో సెక్యూరిటీ రంగంలో ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు డీఆర్డీఏ ఏపీడీ వెంకటయ్యగౌడ్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈనెల 29వ తేదీన స్థానిక ఈజీఎంఎం కౌన్సెలింగ్ సెంటర్లో మొబులైజేషన్ కోసం అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు పేర్కొన్నారు. ఇతర వివరాలకు సెల్ నెం. 9535313862, 08542–251515 సంప్రదించాలని కోరారు.