పాలకొల్లులో ‘దేశం మారిందోయ్’ షూటింగ్
పాలకొల్లు అర్బన్ : పట్టణంలోని కృష్ణాజీ మల్టీఫ్లెక్స్‌లో మంగళవారం ‘దేశం మారిందోయ్’ సినిమా షూటింగ్ జరిగింది. యమలోకంలో పాపులను విచారించే సన్నివేశాలను దర్శకుడు ఈశ్వరప్రసాద్ చిత్రీకరించారు. బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన ప్రధానాంశంగా ఈ చిత్రం కథాంశం ఉంటుందన్నాని, ఆగస్టు 25 నుంచి తదుపరి షెడ్యూలు చిత్రీకరణ జరపనున్నట్టు దర్శకుడు చెప్పారు. ప్రముఖ నటులు నాగేంద్రబాబు, జగపతిబాబు, రాజేంద్రప్రసాద్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నట్టు తెలిపారు. ఇది ఇలా ఉండగా పాలకొల్లులో ఫిల్మ్ అండ్ యాక్టింగ్ స్కూల్‌ను కూడా ప్రారంభించామని ఈశ్వర ప్రసాద్ చెప్పారు.