ఆర్‌అండ్‌బీకి కోర్నెట్ గ్రాంట్ మంజూరు
=పరకాల పట్టణ రహదారికి రూ.4.85కోట్లు
=జనగామ పట్టణ పరిధి
=రహదారి అభివృద్ధికి రూ.2కోట్లు
జిల్లా పరిషత్, న్యూస్‌లైన్ : రహదారులు, భవనాల శాఖ ఆధ్వర్యంలో చేపట్టే అభివృద్ధి పనులకు గాను ప్రభుత్వం కోర్నెట్ గ్రాంట్ కింద జిల్లాకు రూ.6.85కోట్లు మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. జనగామ-సూర్యపేట రహదారిలోని 1/0 కిలోమీటరు నుంచి 10/0 కిలోమీటరు వరకు రోడ్డు అభివృద్ధికి రూ.2 కోట్లు, పరకాల-హుజూరాబాద్ రహదారిలో ని 30/5 కిలోమీటర్ నుంచి 32/4 కిలోమీట రు వరకు ఉన్న రోడ్డు కోసం రూ.4.85 కోట్లు కేటాయించారు.
జనగామ-సూర్యపేట, జనగామ-దుద్దెడ స్టేట్ హైవేలు రెండూ హైదారాబాద్ నుంచి ఏటూరునాగారం మీదుగా భూ పాలపట్నం వరకున్న జాతీయ రహదారిని కలుపుతున్నాయి. మెదక్, నల్గొండ జిల్లాలకు చెందిన ప్రయాణికులు జాతీయ రహదారితోపాటు రాజీవ్ రహదారిపై వెళ్లేందుకు ఈ రెండు రహదారుల నుంచి ప్రయాణం చేస్తుం టారు. ఈ రెండు హైవేల మధ్య ఉన్న ప్రాం తంలో వాహనాల రద్దీ ఎక్కువ. దీంతో జనగా మ పట్టణ పరిధిలోని పది కిలోమీటర్ల నిడివి లో తరచుగా ప్రమాదాలు జరుగుతున్నాయి.
ఈ రహదారిని అభివృద్ధి చేయడమే కాకుండా పేవ్మెంట్లు నిర్మించాలని, అందుకు నిధులు మంజూరు చేయాలని ఆర్అండ్బీ శాఖ ప్రభుత్వానికి నివేదికలు సమర్పించింది. ఈ మేరకు జనగామ పట్టణ పరిధిలోని రహదారిని వెడ ల్పు, పేవ్మెంట్(ఫుట్‌పాత్) నిర్మాణం కోసం ప్రభుత్వం నిధులు కేటాయించింది.
హుజూరాబాద్-పరకాల మధ్య ఉన్న పరకాల పట్టణ పరిధిలోని రహదారిని వెడ ల్పు చేసేందుకు ప్రభుత్వం నిధులు మంజూ రు చేసింది. పరకాల నుంచి కోల్‌బెల్ట్ ప్రాంతా లైన భూపాలపల్లి, రామగుండం, గోదావరిఖ ని, సింగరేణి కాలరీస్ ప్రధాన కార్యాలయం, ఎన్టీపీసీ, ఎపీజెన్‌కో థర్మల్ కేంద్రాలకు వెళ్లే వాహనాల రద్దీ ఇటీవల పెరిగిపోయింది. పరకాల ఇటీవలే మునిసిపాలిటీగా అప్‌గ్రేడ్ కావడంతో పట్టణానికి వచ్చే వాహనాలు, నిత్యావసర వస్తువుల కొనుగోలు కోసం వచ్చే గ్రామీ ణ ప్రజల సంఖ్య రోజురోజుకు పెరిగిపోయిం ది.
ఈ రహదారిలో 30/0 కిలోమీటర్ల నుంచి 30/6 కిలోమీటర్ల వరకు 7మీటర్లు, 30/6 నుంచి 32/2 వరకు 10 మీటర్లు, 32/2 నుంచి 32/4 వరకు 14 మీటర్లు రోడ్డు వెడల్పు చేయా లని ఆర్అండ్బీ అధికారులు ప్రభుత్వానికి నివేదికలు సమర్పించారు. ఎక్కువ వాహనాల రద్దీ ఉన్న 1.90 కిలోమీటర్ల రోడ్డును పటిష్టం చేయడంతోపాటు డివైడర్లు నిర్మించేందుకు నిధులు మంజూరు చేస్తూ ఆర్అండ్బీ ముఖ్య కార్యదర్శి బి.శ్యాంబాబు ఉత్తర్వులు జారీ చేశా రు. ఈ రెండు రహదారుల అభివృద్ధితో జనగామ, పరకాల పట్టణ ప్రాంతాల్లో ట్రాఫిక్ సమస్య తీరనుంది.