urdu teachers
-
ఆ 167 మందికీ ఉద్యోగ భద్రత
సాక్షి, అమరావతి: ఉర్దూ అకాడమీలో మూడు దశాబ్దాలకు పైగా పనిచేస్తున్న 167 మంది తాత్కాలిక ఉద్యోగులకు వేతన భరోసాతో పాటు ఉద్యోగ భద్రత కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులివ్వడంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. తమను ఆదుకోవడం ద్వారా పెద్ద మనసు చాటుకున్న సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డికి వారు కృతజ్ఞతలు తెలిపారు. విజయవాడలోని ఉర్దూ అకాడమీ రాష్ట్ర ప్రధాన కార్యాలయం వద్ద గురువారం సీఎం వైఎస్ జగన్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేసి.. థాంక్యూ సీఎం సార్ అంటూ నినాదాలు చేశారు. దాపు 1990 నుంచి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోని ఉర్దూ అకాడమీలో నేరుగా నియామకాలు జరిగాయి. అప్పట్లో టీడీపీ, కాంగ్రెస్ ప్రభుత్వాలు తమకు నచ్చిన వారికి తాత్కాలిక సిబ్బంది పేరుతో నియామకాలు చేశారు. కాగా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్విభజన చట్టం–2014 షెడ్యూల్ 10 ప్రకారం తెలంగాణ, ఏపీ ఉర్దూ అకాడమీ సిబ్బంది కేటాయింపు 2015 నవంబర్ 2న పూర్తయింది. దీని ప్రకారం ఏపీకి 182 మంది కన్సాలిడేటెడ్ పే ఉద్యోగులను కేటాయించగా.. ప్రస్తుతం 167 మంది ఏపీలో పనిచేస్తున్నారు. వారికి వేతనాల చెల్లింపునకు అవసరమైన ప్రభుత్వ అనుమతిలేదు. వారిలోనూ దాదాపు 80 మందికి ఎటువంటి అధికారిక నియామక పత్రాలు, రికార్డులు, అనుమతులు లేకపోవడం గమనార్హం. దీంతో ఈ ఏడాది మార్చిలో సమావేశమైన ఏపీ ఉర్దూ అకాడమీ బోర్డు.. ఉద్యోగులుగా గుర్తింపునకు నోచుకోని 167 కన్సాలిడేటెడ్ పే ఉద్యోగుల జాబితాను ప్రభుత్వానికి నివేదించింది. ఈ అంశాన్ని పరిశీలించిన ప్రభుత్వం ఏపీ ఉర్దూ అకాడమీలో 69 మంది ఫ్యాకల్టీ, 45 మంది లైబ్రేరియన్స్, 53 మంది సబార్డినేట్లను కన్సాలిడేటెడ్ పే ఉద్యోగులుగా గుర్తించడంతో పాటు, నిబంధనల ప్రకారం వారికీ వేతనాలు చెల్లించేలా ఈ ఏడాది జూన్ 28న ప్రభుత్వం ఉత్తర్వులివ్వడంపై ఉద్యోగులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డితో పాటు ఉప ముఖ్యమంత్రి అంజాద్‌బాషా, ఉర్దూ అకాడమీ చైర్మన్ నదీమ్ అహ్మద్, సభ్యులు, మైనారిటీ శాఖ కార్యదర్శి ఇంతియాజ్ తదితరులకు ఉద్యోగులు కృతజ్ఞతలు చెబుతూ అభినందన కార్యక్రమాన్ని నిర్వహించారు. సీఎం జగన్ పెద్దమనసు వల్లే.. అభివృద్ధి, సంక్షేమమే కాదు.. ఉద్యోగులకు మేలు చేయడంలోనూ పార్టీ చూడం, కులం చూడం, మతం చూడం అని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి మరోసారి నిరూపించారు. వాస్తవానికి ఉర్దూ అకాడమీలో నిబంధనలకు విరుద్ధంగా గత పాలకులు తమకు నచ్చిన వారికి, నచ్చినట్టు.. కనీసం నియామక పత్రాలు కూడా లేకుండా కన్సాలిడేటెడ్ పే అంటూ కొలువులు ఇచ్చేశారు. ఇప్పుడు వారిని తొలగిస్తే వారి కుటుంబాలు వీధిన పడతాయి. సీఎం వైఎస్ జగన్ పెద్ద మనసుతో ఉద్యోగ భద్రత, వేతన భరోసా ఇవ్వడం గొప్ప విషయం. – హిరియల్ నదీమ్ అహ్మద్, ఉర్దూ అకాడమీ చైర్మన్ -
మైనార్టీల్లో చైతన్యం తీసుకురావాలి
కర్నూలు సిటీ: విద్య పట్ల రాష్ట్రంలోని మైనార్టీల్లో చైతన్యం తీసుకురావాలని సర్వశిక్ష అభియాన్ రాష్ట్ర స్థాయి అధికారి డాక్టర్ షేక్ నాసర్ సాహెబ్ అన్నారు. సోమవారం నగరంలో ఉర్దూ టీచర్లకు ఆరు రోజుల పాటు రాష్ట్ర స్థాయి శిక్షణ తరగతులు ప్రారంభమైయ్యాయి. ఈ శిక్షణ తరగతుల ప్రారంభోత్సవానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. మైనార్టీల్లో అధిక శాతం నిరక్షరాస్యులు ఉన్నారని, వారిని అక్షరాస్యులుగా మార్చాల్సిన బాధ్యత ఉర్దూ టీచర్లపై ఉందన్నారు. రాష్ట్రంలోని కస్తూర్బా పాఠశాలల్లో 3600 సీట్లు ఉంటే 2600 ఖాళీగానే ఉన్నాయన్నారు. ఎస్ఎస్ఏ సీమెట్ అధ్యాపకుడు ప్రసాద్‌రావు, ఎస్ఎస్ఏ పీడీ రామచంద్రారెడ్డి, ఏఎంఓ మాలిబాషా, చిత్తూరు ఏఎంఓ మహ్మాద్‌ఖాన్, సీఎంఓ జయరామకృష్ణారెడ్డి, అసిస్టెంట్ ఏఎంఓ రఫీ, తదితరులు పాల్గొన్నారు. విద్యార్థులపై ‘ప్రత్యేక’ శ్రద్ధ మా స్కూల్లో ఉదయం, సాయంత్రం ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నాం. చదువులో వెనుకబడిన వారిపై ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నాం. ఉపాధ్యాయులందరూ నమన్వయంతో పని చేస్తున్నారు. ఉత్తమ ఫలితాలకు ఇది ఒక కారణం. నేను ఇక్కడ ఐదేళ్ల నుంచి పనిచేస్తున్నాను. వరుసగా ఆరేళ్లు పదోతరగతిలో వంద శాతం ఫలితాలు సాధించడం చాలా ఆనందంగా ఉంది. – వాడాల సుబ్బరాయుడు యాదవ్, కునుకుంట్ల జెడ్పీ హైస్కూల్ హెచ్ఎం -
ఇద్దరు భార్యలుంటే నో జాబ్!
ఆగ్రా: ఉర్దూ ఉపాధ్యాయుల భర్తీ కోసం ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం జారీ చేసిన నోటిఫికేషన్ ఇప్పుడు వివాదాస్పదం అయింది. ఇద్దరు భార్యలను కలిగివున్న వారు ఈ పోస్టులకు అనర్హులని నోటిఫికేషన్లో పేర్కొనడంతో ముస్లిం సంఘాలు దీనిని పెద్ద ఎత్తున నిరసిస్తున్నాయి. వివరాల్లోకి వెళితే...అఖిలేష్ యాదవ్ ప్రభుత్వం రాష్ట్రంలోని 3,500 ఉర్దూ టీచర్ పోస్టులను భర్తీ చేయడానికి ఇటీవల నోటిఫికేషన్ జారీ చేసింది. అయితే ఈ నోటిఫికేషన్లో జీవించి ఉన్న ఇద్దరు భార్యలను కలిగివున్న వారు ఈ పోస్టులకు అప్లై చేసుకోవడానికి అనర్హులని పేర్కొన్నారు. అంతేకాకుండా ఇద్దరు భార్యలున్న భర్తకు భార్యగా ఉంటే...ఆ మహిళా అభ్యర్థులను సైతం అనర్హులుగా ప్రకటించారు. దీనిపై విద్యాశాఖ అధికారులు మాట్లాడుతూ.. వితంతువులకు పెన్షన్ పంపిణీ చేసే సందర్భంగా తలెత్తే సమస్యలను తొలగించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నామంటున్నారు. కేవలం ఉర్దూ ఉపాద్యాయుల నియామకంలోనే కాకుండా మిగతా పోస్టుల భర్తీలో సైతం ఇదే విధానాన్ని అమలు చేస్తామని తెలిపారు. ముస్లిం వర్గాలు మాత్రం.. తమ మత చట్టాల ప్రకారం నలుగురిని పెళ్లి చేసుకునే అవకాశాలున్నాయని... ఎప్పుడో పెన్షన్ పంపిణీ చేసే సందర్భంగా ఇబ్బందులు తలెత్తుతాయనే నెపంతో ఇప్పుడు అభ్యర్థులను అనర్హులుగా ప్రకటించడం ఎంత వరకు సబబు అని ప్రశ్నిస్తున్నాయి. అయినా పెన్షన్‌ను ఇద్దరికీ సమానంగా పంచితే సరిపోతుందని, ఈ నిర్ణయం తమ పట్ల వివక్ష చూపించడమే అంటున్నాయి. -
‘ఉర్దూ టీచర్లూ.. సంస్కృతం బోధించండి!’
బుండీ: ఉర్దూ బోధిస్తున్న 40 మంది టీచర్లను సంస్కృతం బోధించాలంటూ రాజస్తాన్ ప్రభుత్వం వారిని వివిధ స్కూళ్లకు బదిలీ చేసింది. దీనిపై విమర్శలు రావడంతో నాలుక కరుచుకుని దిద్దుబాటు చర్యలకు దిగింది. ఉర్దూ విద్యార్థులు లేని బుండీ, ఝలావర్, బరన్‌లోని పాఠశాలల్లో ఉన్న ఉర్దూ టీచర్లను వేరే ప్రాంతాల్లోని మాధ్యమిక పాఠశాలల్లో సంస్కృతం బోధించాలని బదిలీ చేశామని మాధ్యమిక విద్యాశాఖ(కోట) డెరైక్టర్ డీడీ మురళీ లాల్ తెలిపారు. ఈ బదిలీల్లో పొరపాటు జరిగిందని, దీన్ని సరిదిద్దుకుంటామని చెప్పారు.