the US
-
అమెరికాలో రోడ్డు ప్రమాదం.. ఎన్నారై మృతి
వాషింగ్టన్(యూఎస్ఏ): అమెరికాలోని కొలంబస్ నగరంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో భారతీయుడు చనిపోగా ఆయన భార్య తీవ్రంగా గాయపడ్డారు. అన్షుల్ శర్మ(30), ఆయన భార్య సమిరా భరద్వాజ్(29) ఆదివారం ఉదయం నడిచి వెళ్తుండగా వెనుక నుంచి వేగంగా వచ్చిన కారు వారిపైగా దూసుకెళ్లింది. ఈ ఘటనలో అన్షుల్ శర్మ తలకు తీవ్ర గాయాలు కావటంతో అక్కడికక్కడే చనిపోయాడు. తీవ్రంగా గాయపడిన ఆయన భార్య సమిరా భరద్వాజ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. మద్యం మత్తులో ఉన్న మైఖేల్ డిమాయో(36) అనే వ్యక్తి ఈ ఘటనకు కారకుడని గుర్తించిన పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. అతనిపై పలు సెక్షన్ల కింద కేసులు పెట్టారు. కొలంబస్ నగరంలోని కుమ్మిన్స్ అనే డీజిల్ ఇంజిన్ల తయారీ కర్మాగారంలో ఇంజినీర్‌గా అన్షుల్ శర్మ పనిచేస్తున్నారు. ప్రస్తుతం సమిరా భరద్వాజ్ పరిస్థితి విషమంగా ఉన్నట్లు పోలీసులు తెలిపారు. అన్షుల్ మృతదేహాన్ని ఇండియాకు తీసుకువచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు. అతని కుటుంబానికి తామంతా అండగా ఉంటామని ఎన్నారై బృందం తెలిపింది. -
ఆల్కహాల్ తాగే అలవాటు ఉన్నవారిలో వ్యాయామ రీతులు!
కొత్త పరిశోధన వ్యాయామం చేసే అలవాటు ఉండి, వారికి తాగుడు అలవాటు కూడా ఉంటే... ఎక్కువ వ్యాయామం చేసిన రోజున వారు ఒకింత ఎక్కువగా డ్రింక్ తీసుకుంటారట. అదీ సాధారణంగా వ్యాయామం తర్వాత వారు ‘బీర్’తాగడానికి ప్రాధాన్యం ఇస్తుంటారట. పందొమ్మిదేళ్ల వయసు నుంచి 89 ఏళ్ల వయసు వరకు ఉన్న దాదాపు 150కి పైగా వ్యక్తులపై యూఎస్‌కు చెందిన అధ్యయనవేత్తలు నిర్వహించిన ఒక పరిశోధనలో ఈ విషయం వెల్లడైంది. వారంలోని మొదటి మూడు రోజులూ కాస్తంత తక్కువ వ్యాయామం చేయించారు. ఇక వీకెండ్ దగ్గరపడుతున్నప్పుడు వారితో కాస్తంత తీవ్రంగా వ్యాయామం చేయించారు. వ్యాయామంలోని ఈ తేడాలు వారి తాగుడు అలవాటుపై ఏదైనా ప్రభావం చూపుతుందా అని పరిశీలించినప్పుడు మరింత ఎక్కువగా వ్యాయామం చేసిన రోజున తమకు తాము ఇచ్చుకునే రివార్డుగా వారు కాసింత ఎక్కువగా తాగేస్తున్నారట. ఎక్సర్సైజ్ కోసం వారు వినియోగించే విల్‌పవర్ వాళ్ల తాగుడు అలవాటును నియంత్రించుకోడానికి సరిపోవడం లేదని ఈ పరిశోధన ఫలితాలు పేర్కొంటున్నాయి. ఈ అధ్యయన సారాంశం యూఎస్‌కు చెందిన మెడికల్ జర్నల్ ‘హెల్త్ సైకాలజీ’లో ప్రచురితమైంది.