US Currency
-
పాన్ మసాలా ప్యాకెట్లలో 32 లక్షల యూఎస్ డాలర్లు, కంగుతిన్న అధికారులు
ఒక వ్యక్తి ఎయిర్ పోర్ట్‌లో వందలకొద్ది పాన్‌మసాలా ప్యాకేట్లతో పట్టుబడినట్లు కోల్‌కత్ కస్టమ్స్ అధికారులు తెలిపారు. వాటిలో ఏకంగా రూ 32 లక్షల విలువ చేసే యూఎస్ కరెన్సీని ప్యాక్ చేసి తరలించేందుకు యత్నించాడు. దీంతో ఎయిర్పోర్ట్ ఇంటిలిజెన్స్ అధికారులు కోల్‌కతా కస్టమ్స్ డిపార్ట్మెంట్కి సమాచారం అందించారు. ఈ మేరకు రంగంలోకి దిగిన కస్టమస్స్ అధికారులు నిందితుడు పాన్‌మసాలా ప్యాకెట్లలో యూఎస్ కరెన్సీని తరలించే విధానం చూసి కంగుతిన్నారు. సుమారు రూ. 32 లక్షల విలువ చేసే యూఎస్ కరెన్సీనీ స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. తామ తనిఖీలు చేస్తున్నప్పుడు వందలకొద్ది పాన్ మసాల ప్యాకెట్లు చూసి ఆశ్యర్యపోయాం అన్నారు. ఆ పాన్ ప్యాకెట్లలో ఒక పారదర్శక కవర్లో ఒక జతన యూఎస్ కరెన్సీ దానితో పాటు పాన్ పౌడర్ పెట్టి ప్యాక్ చేశారు. ఒక పెద్ద ట్రాలీ లగేజ్‌లో నిండా ఈ మసాల ప్యాకెట్లు ఉన్నట్లు తెలిపారు. థాయిలాండ్‌లోని బ్యాంకాక్‌కి తరలించేందుకు యత్నించినట్లు తెలిపారు. (చదవండి: ప్రపంచంలోనే తొలి రోబో లాయర్..ఏకంగా ఓ కేసునే టేకప్ చేస్తోంది) #WATCH | AIU officials of Kolkata Customs intercepted a passenger scheduled to depart to Bangkok yesterday. A search of his checked-in baggage resulted in the recovery of US $40O00 (worth over Rs 32 lakh) concealed inside Gutkha pouches: Customs pic.twitter.com/unxgdR7jSu — ANI (@ANI) January 9, 2023 -
ఆఫ్రిది బిల్లు చెల్లించిన అభిమాని!
కరాచీ: మామూలుగా క్రికెటర్లు ఎక్కడికి వెళ్లినా... డబ్బులకు ఏమాత్రం కొదువ ఉండదు. కానీ కొన్ని సమయాల్లో ఎంత డబ్బున్నా... అది ఉపయోగపడకపోతే ఎలాంటి ఇబ్బందులు ఎదురవుతాయో పాకిస్తాన్ టి20 కెప్టెన్ షాహిద్ ఆఫ్రిదికి బాగా ఆర్థమైంది. క్రికెట్ పర్యటన కోసం న్యూజిలాండ్ వెళ్లిన ఆఫ్రిది... సహచరుడు అహ్మద్ షెహజాద్‌తో కలిసి సోమవారం ఆక్లాండ్ విమానాశ్రయంలోని మెక్‌డోనాల్డ్ రెస్టారెంట్‌కు వెళ్లాడు. మీల్స్ ఆర్డర్ చేశాక డబ్బులు ఇవ్వడానికి వెళ్తే జేబులో మొత్తం యూఎస్ కరెన్సీ మాత్రమే ఉంది. అయితే రెస్టారెంట్లో స్థానిక కరెన్సీ మాత్రమే తీసుకుంటుండడంతో క్రికెటర్లు ఇబ్బందికర పరిస్థితిని ఎదుర్కొన్నారు. ఆర్డర్ క్యాన్సిల్ చేయలేక.. డబ్బులు కట్టలేక దిక్కు తోచని స్థితిలో పడ్డారు. ఇక ఏం చేయలేని పరిస్థితుల్లో.. ఇదంతా గమనించిన వకాస్ నవీద్ అనే ఓ అభిమాని వచ్చి బిల్లును చెల్లించడంతో ఆఫ్రిది ఊపిరి పీల్చుకున్నాడు. రెస్టారెంట్ ఎపిసోడ్‌ను ఎవరో రహస్యంగా చిత్రీకరించి మీడియాకు ఇవ్వడంతో విషయం మొత్తం బయటకు వచ్చేసింది. ఇందులో కొసమెరుపు ఏంటంటే కివీస్ బయలుదేరటానికి ముందు లాహోర్‌లో ఆఫ్రిది.. మీడియాతో గొడవపడటం. తాము అడిగిన ప్రశ్నలకు వ్యంగ్యంగా సమాధానం ఇవ్వడంతో మీడియా మొత్తం గడాఫీ స్టేడియం వద్ద నిరసనకు దిగింది. ఇక రెస్టారెంట్ ఎపిసోడ్ దొరకడంతో పాక్ మీడియా మొత్తం ఆఫ్రిదిని ఓ ఆటాడేసుకుంది. -
నెల రోజుల కనిష్టానికి రూపాయి విలువ
ముంబై: దేశీ స్టాక్ మార్కెట్ల పతన ధోరణితో రూపాయి కూడా నష్టాల్లోకి జారింది. డాలరుతో రూపాయి మారకం విలువ గురువారం 36 పైసలు క్షీణించి 62.26 వద్ద ముగిసింది. ఇది నెల రోజుల కనిష్ట స్థాయి. ప్రధాన విదేశీ కరెన్సీలతో డాలరు బలం పుంజుకోవడం, దిగుమతిదారుల నుంచి డాలర్లకు డిమాండ్ జోరు కూడా దేశీ కరెన్సీ నష్టాలకు కారణమైందని ఫారెక్స్ డీలర్లు పేర్కొన్నారు. క్రితం ముగింపు 61.90తో పోలి స్తే.. గురువారం స్థిరంగానే రూపాయి ట్రేడింగ్ మొదలైంది. క్రమంగా 61.74 గరిష్టాన్ని కూడా తాకింది. అయితే, స్టాక్ మార్కెట్ల తిరోగమనంతో దేశీ కరెన్సీ సెంటిమెంట్‌పై ప్రభావం చూపిందని ఇండియా ఫారెక్స్ అడ్వైజర్స్ సీఈఓ అభిషేక్ గోయెంకా పేర్కొన్నారు.. చైనాలో తయారీ రంగం గణాంకాలు బలహీనంగా ఉం డటం ఇతరత్రా కారణాలతో బీఎస్ఈ సెన్సెక్స్ 252 పాయింట్లు క్షీణించడం గమనార్హం.