U.S. Government
-
హెచ్1బీ శిక్షణకు 1,105 కోట్లు
వాషింగ్టన్: హెచ్1బీ వీసాలపై వివిధ రకాల ఉద్యోగాలు చేయడానికి వచ్చే మధ్యస్త, ఉన్నత స్థాయి నైపుణ్యాలు గల వారికి శిక్షణ ఇచ్చేందుకు అమెరికా ప్రభుత్వం రూ.1,105 కోట్లు ఖర్చు చేయనుంది. ఐటీ, సైబర్ సెక్యూరిటీ, అడ్వాన్స్డ్ మాన్యుఫాక్చరింగ్, రవాణా తదితర రంగాల్లో హెచ్–1బీ వీసా హోల్డర్లు ఎక్కువగా ఉంటారు. వీరిలో నైపుణ్యం పెంచేందుకు తాజా పెట్టుబడులు ఉపయోగపడతాయని కార్మిక శాఖ తెలిపింది. ఈ కార్యక్రమంతో భారతీయ నిపుణులు ఎక్కువగా లాభం పొందనున్నారు. విద్యార్థులు, పరిశోధకుల వీసాలకు నిర్ణీత గడువు విదేశీ పరిశోధకులు, విద్యార్థులు, జర్నలిస్టులకు ఇచ్చే వీసాలకు నిర్ణీత గడువు విధించాలని ట్రంప్ ప్రభుత్వం యోచిస్తోంది. ప్రస్తుతమున్న సులువైన వీసా విధానం దుర్వినియోగం అవుతోందనీ, దీనివల్ల జాతీయ భద్రతకు ప్రమాదం పొంచి ఉందని పేర్కొంది. పైన పేర్కొన్న మూడు రకాల వీసాలతో చైనీయులే ఎక్కువగా లబ్ధి పొందుతున్నారు. అయితే, నూతన విధానం ఏ ఒక్క దేశాన్నో లక్ష్యంగా చేసుకున్నది కాదని ప్రభుత్వం అంటోంది. తాజా ప్రతిపాదనల ప్రకారం.. నాన్ ఇమిగ్రాంట్ విభాగంలోని ఎఫ్, జే (విద్యార్థులు, పరిశోధకుల) వీసాల కాలపరిమితి నాలుగేళ్లు మాత్రమే ఉంటుంది. -
'యాపిల్' వార్తలపై బిల్ గేట్స్ అసంతృప్తి
వాషింగ్టన్: యాపిల్ సంస్థతో కొనసాగుతున్న వివాదంలో తాను ఎఫ్ బీఐకు మద్దతు తెలిపినట్టు వచ్చిన వార్తలపై మైక్రోసాఫ్ట్ అధినేత అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ విషయంలో తన అభిప్రాయాన్ని మీడియా కచ్చితంగా వెల్లడించలేదని ఆయన పేర్కొన్నారు. 'ప్రభుత్వం చేసే ప్రతిపనిని ఎవరూ సమర్థించరు. సర్కారు గుడ్డిగా వ్యవహరిస్తే ప్రజలు మద్దతు ఇవ్వాల్సిన అవసరం లేదు' అని 'బ్లూమ్ బర్గ్ గో'కు ఇచ్చిన ఇంటర్వ్యూలో బిల్ గేట్స్ అన్నారు. వాషింగ్టన్ మేజిస్ట్రేట్ కోర్టు ఆదేశాలను సవాలు చేస్తామని యాపిల్ సంస్థ తెలిపిందని, ఈ అంశాన్ని ప్రజలకు మధ్యకు తీసుకెళ్లి చర్చించడానికి ఇదే సరైన సమయని అభిప్రాయపడ్డారు. శాన్ బెర్నార్డినో కాల్పుల ఉగ్రవాది సయ్యద్ రిజ్వాన్ ఫరూక్ కు చెందిన ఐఫోన్ ను తెరిచే వ్యవహారంలో బిల్ గేట్స్.. ప్రభుత్వం తరపున నిలబడ్డారని అంతకుముందు ఫైనాన్షియల్ టైమ్స్ పేర్కొంది. ఈ ఐఫోన్ ను తెరిచేందుకు విఫలయత్నం చేసిన ఎఫ్ బీఐ అధికారులు.. యాపిల్ సంస్థ సాయాన్ని కోరుతూ వాషింగ్టన్ మేజిస్ట్రేట్ కోర్టును ఆశ్రయించారు. ఎఫ్బీఐకి సహకరించాలని యాపిల్ సంస్థను కోర్టు ఆదేశించింది. ఇందుకు యాపిల్ నిరాకరించింది. భద్రతా కారణాల దృష్ట్యా ఐఫోన్ తెరవబోమని స్పష్టం చేసింది. యాపిల్ నిర్ణయాన్ని టెక్నాలజీ దిగ్గజ సంస్థలు గూగుల్, మైక్రోసాఫ్ట్ సమర్థించాయి. -
హైదరాబాదీ సత్య నాదెళ్లకు ఘన సన్మానం
వాషింగ్టన్: మైక్రోసాఫ్ట్ కార్పొరేషన్ సీఈవో సత్య నాదెళ్ల సహా నలుగురు భారతీయ అమెరికన్లను స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా యూఎస్ ప్రభుత్వం శుక్రవారం ఘనంగా సన్మానించింది. కార్నెగీ కార్పొరేషన్ సహకారంతో న్యూయార్క్లో జరిగిన ఈ కార్యక్రమానికి అమెరికాలో స్థిర పడిన భారతీయులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. సత్య నాదెళ్ల సహా ప్రముఖ హాస్య ప్రయోక్త, నటుడు ఆసిఫ్ మండ్వి, కార్నెగీ మెలాన్ వర్సిటీ అధ్యక్షుడు సుబ్రా సురేష్, వర్సిటీ ఆఫ్ వెస్ట్ జార్జియా మాజీ ప్రెసిడెంట్ బెహెరజ్ సెత్నాలు అమెరికాలో విశేష సేవలకు గుర్తింపుగా సన్మానించారు. వీరితోపాటు మరో 36 మందిని కూడా సత్కరించారు. హైదరాబాద్కు చెందిన సత్య నాదెళ్ల.. సాంకేతిక రంగంలో శక్తిమంతమైన నాయకుడిగా అనతి కాలంలోనే ఎదిగి రికార్డు సృష్టించారు. ప్రఖ్యాత మైక్రోసాఫ్ట్ కంపెనీకి సీఈవోగా పగ్గాలు చేపట్టారు. ముంబైకి చెందిన ఆసిఫ్ మండ్వి తొలుత ఇంగ్లాడ్కు వెళ్లి తర్వాత అమెరికాలో స్థిరపడ్డారు. ఇస్లాం, పశ్చిమాసియా, దక్షిణాసియాలపై తనదైన శైలిలో సైటర్లు వేసి ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకున్నారు. చెన్నైకి చెందిన సుబ్రా సురేష్ కార్నెగీ మెలాన్ వర్సిటీ 9వ అధ్యక్షుడిగా ఎదిగారు.