US National Academy of Engineering
-
కిరణ్ మజుందార్ షాకు అరుదైన గౌరవం
హైదరాబాద్ : గచ్చిబౌలిలోని ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ఐఎస్బీ) గవర్నింగ్ బోర్డు సభ్యురాలు కిరణ్ మజుందార్ షాకు అరుదైన గౌరవం లభించింది. ఐక్యరాజ్య సమితి విభాగం యూఎస్ నేషనల్ అకాడమీ ఆఫ్ ఇంజనీరింగ్(యూఎస్‌ఎన్‌ఏఈ) సభ్యురాలిగా ఆమె ఎన్నికయ్యారు. యూఎస్‌ఎన్‌ఏఈ సభ్యురాలిగా ఎన్నికైన తొలి భారతీయ మహిళ షానే కావడం గమనార్హం. బయో ఫార్మాసూటికల్స్, బయోటెక్నాలజీ ఇండస్ట్రీలో ఆమె చేసిన కృషికి గుర్తింపుగా ఈ అవకాశం దక్కింది. ఆమెకు అంతర్జాతీయ స్థాయి గుర్తింపు లభించడంపై గవర్నింగ్ బోర్డు ప్రతినిధులు, ఫ్యాకల్టీ హర్షం వ్యక్తం చేశారు. -
అమెరికా ఎన్ఏఈలో నలుగురు భారతీయ-అమెరికన్లకు చోటు
వాషింగ్టన్: అమెరికా నేషనల్ అకాడెమీ ఆఫ్ ఇంజనీరింగ్(ఎన్‌ఏఈ)కు నలుగురు భారతీయ-అమెరికన్లు ఎంపికయ్యారు. సామాజిక సేవ చేసినందుకు ఎంపిక చేసిన 80 మంది జాబితాలో.. అనిల్ కె జైన్, డాక్టర్ ఆర్తీ ప్రభాకర్, గణేశ్‌ఠాకూర్, డాక్టర్ కె.ఆర్.శ్రీధర్‌లకు చోటు దక్కింది. జైన్..మిచిగన్ స్టేట్ టీలో కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ ప్రొఫెసర్. ప్రభాకర్.. వర్జీనియాలోని యూఎస్ డిఫెన్స్ అడ్వాన్స్డ్ రీసెర్స్ ప్రాజెక్ట్స్ ఏజెన్సీ డెరైక్టర్. గణేశ్‌ఠాకూర్.. హూస్టన్‌లో గల ఠాకూర్ సర్వీసెస్ ఇన్కార్పొరేషన్ అధ్యక్షుడు. శ్రీధర్.. కాలిఫోర్నియాలోని బ్లూమ్ ఎనర్జీ కార్పొరేషన్ ముఖ్య సహ వ్యవస్థాపకుడు.