![Kiran Mazumdar Shaw Elected As Member of US National Academy of Engineering - Sakshi](/styles/webp/s3/article_images/2019/02/20/us-nae.jpg.webp?itok=omrW__6a)
హైదరాబాద్ : గచ్చిబౌలిలోని ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ఐఎస్‌బీ) గవర్నింగ్ బోర్డు సభ్యురాలు కిరణ్ మజుందార్ షాకు అరుదైన గౌరవం లభించింది. ఐక్యరాజ్య సమితి విభాగం యూఎస్ నేషనల్ అకాడమీ ఆఫ్ ఇంజనీరింగ్(యూఎస్‌ఎన్‌ఏఈ) సభ్యురాలిగా ఆమె ఎన్నికయ్యారు. యూఎస్‌ఎన్‌ఏఈ సభ్యురాలిగా ఎన్నికైన తొలి భారతీయ మహిళ షానే కావడం గమనార్హం. బయో ఫార్మాసూటికల్స్, బయోటెక్నాలజీ ఇండస్ట్రీలో ఆమె చేసిన కృషికి గుర్తింపుగా ఈ అవకాశం దక్కింది. ఆమెకు అంతర్జాతీయ స్థాయి గుర్తింపు లభించడంపై గవర్నింగ్ బోర్డు ప్రతినిధులు, ఫ్యాకల్టీ హర్షం వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment