ట్రంప్ సలహాదారుగా భారతీయుడు
వాషింగ్టన్ : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కి ప్రత్యేక సలహాదారుగా భారత సంతతికి చెందిన న్యాయవాది ఉత్తమ్ ధిలాన్ నియమితులయ్యారు. న్యాయం, నైతికతకు సంబంధించిన విషయాల్లో ట్రంప్‌కి సలహాలు, సూచనలు ఇవ్వనున్నారు. దీనిలో భాగంగా డొనాల్డ్ ఎఫ్ మెక్ గాన్ నేతృత్వంలోని వైట్ హౌస్ కమిటీలో స్థానం సాధించారు. ప్రస్తుతం ఆయన హౌస్ బ్యాంకింగ్ కమిటీలో చీఫ్ ఓవర్‌సైట్ కౌన్సిల్‌గా విధులు నిర్వహిస్తున్నారు. కౌంటర్ నార్కోటిక్స్ ఎన్ ఫోర్స్మెంట్ విభాగంలో హోంలాండ్ సెక్యూరిటీ ఆఫీస్‌లో చీఫ్‌గా పనిచేశారు.