Utterpradesh police
-
ప్రాపర్టీ డీల్: హీరో షారుఖ్ భార్య, గౌరీ ఖాన్‌కు షాక్!
సాక్షి, ముంబై: బాలీవుడ్ స్టార్ హీరో షారూఖ్ ఖాన్ భార్య, ఇంటీరియర్ డిజైనర్ గౌరీ ఖాన్‌పై లక్నోలో ఎఫ్ఐఆర్ నమోదైంది. గౌరీపై భారతీయ శిక్షాస్మృతిలోని సెక్షన్ 409 (నేరపూరిత విశ్వాస ఉల్లంఘన) కింద కేసు నమోదు చేశారు.ముంబైకి చెందిన వ్యక్తి మేరకు ఈ పరిణామం చోటు చేసుకుంది. ఉత్తరప్రదేశ్‌లోని లక్నోలో ఎఫ్ఐఆర్ దాఖలైంది. గౌరీబ్రాండ్ అంబాసిడర్‌గా ఉన్న కంపెనీ డబ్బలు తీసుకుని కూడా ఫ్లాట్ అప్పగించకుండా మోసం చేశారని ఆరోపిస్తూ ముంబైకి చెందిన జస్వంత్ షా ఫిర్యాదు చేశారు. లక్నోలోని సుశాంత్ గోల్ఫ్ సిటీ ప్రాంతంలోని తులసియాని గోల్ఫ్ వ్యూలో ఉన్న ఫ్లాట్ నిమిత్తం రూ. 86 లక్షలు చెల్లించినప్పటికీ తనను కాదని ఆ ఫ్లాట్‌ను వేరొకరికి ఇచ్చారని ఫిర్యాదుదారు ఆరోపించారు. బ్రాండ్ అంబాసిడర్ గౌరీ ఖాన్ ప్రభావంతో తాను సదరు ఫ్లాట్ కొన్నానని ఫిర్యాదుదారు తెలిపారు. దీంతో గౌరీతో పాటు తులసియాని కన్స్ట్రక్షన్ అండ్ డెవలప్మెంట్ లిమిటెడ్ చీఫ్ మేనేజింగ్ డైరెక్టర్ అనిల్ కుమార్ తులసియాని, డైరెక్టర్ మహేష్ తులసియానిపై కూడా ఫిర్యాదు నమోదైంది. -
యూపీ సర్కారుపై హైకోర్టు ఆగ్రహం
లక్నో: హత్రాస్ కేసులో ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం వైఖరిపై అలహాబాద్ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. జిల్లా మేజిస్ట్రేట్ ప్రవీణ్ కూమార్ పై యూపీ సర్కారు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంపై ఈ ఉన్నత న్యాయస్థానం మండిపడింది. ఈ కేసుపై సోమవారం అలహాబాద్ హైకోర్టు విచారణ చేపట్టింది. హత్రాస్ దారుణోతందంపై దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని జస్టిస్ పంకజ్ మిత్తల్, జస్టిస్ రాజన్ రాయ్ నేతృత్వంలోని బెంచ్ విచారించింది. తదుపరి విచారణలోపు (నవంబర్ 25) జిల్లా మేజిస్ట్రేట్‌పై చర్య తీసుకుంటామని ఈ సందర్భంగా న్యాయస్థానానికి ప్రభుత్వం తెలిపింది. కాగా, హత్రాస్ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన దళిత యువతి మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించకుండా రాత్రికి రాత్రి దహనం చేయడంతో జిల్లా మేజిస్ట్రేట్ తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నారు. జిల్లా మేజిస్ట్రేట్‌పై ఎటువంటి నిర్ణయం తీసుకున్నారని కోర్టు ప్రశ్నించగా... ఆయన చర్యను ప్రభుత్వం సమర్థించింది. ఆయన ఎటువంటి తప్పు చేయలేదని పేర్కొంది. ఈ కేసు దర్యాప్తులో నిర్లక్ష్యంగా వ్యవహరించిన జిల్లా ఎస్పీని ఇప్పటికే సస్పెండ్ చేసినట్టు ప్రభుత్వం తరుపున న్యాయవాది చెప్పారు. అంతకుముందు రాష్ట్ర ప్రభుత్వం, మేజిస్ట్రేట్ ప్రవీణ్ కూమార్, సస్పెండ్ అయిన ఎస్పీ విక్రాంత్ వీర్ కోర్టులో అఫిడవిట్లు దాఖలు చేశారు. దీంతో తదుపరి విచారణను కోర్టు ఈనెల 25కు వాయిదా వేసింది. ఈ కేసులో దర్యాప్తు ఎంతవరకు వచ్చిందో తమకు తెలపాలని సీబీఐని హైకోర్టు ఆదేశించింది. అసలేం జరిగింది? ఉత్తరప్రదేశ్ హత్రాస్ లో 19 ఏళ్ల దళిత యువతిపై సెప్టెంబర్ 14న నలుగురు ఉన్నత కులస్తులు అత్యాచారం చేసి దారుణంగా చంపేశారనే ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. బాధితురాలు ఢిల్లీ సఫ్దర్‌జంగ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సెప్టెంబర్ 29న కన్నుమూసింది. దారుణ ఘటన దేశ వ్యాప్తంగా సంచలనం రేపింది. ఈ కేసును ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం సీబీఐకి అప్పగించింది. సీబీఐ దర్యాప్తును అలహాబాద్ హైకోర్టు పర్యవేక్షిస్తుంది. -
వివాదాస్పదంగా మారిన ప్రియాంక ట్వీట్
లక్నో : ఉత్తర్ ప్రదేశ్‌లో శాంతి భద్రతల అంశంపై స్పందిస్తూ కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ ప్రియాంక గాంధీ చేసిన ట్వీట్ వివాదాస్పదంగా మారింది. శనివారం ప్రియాంక ట్విటర్ వేదికగా స్పందిస్తూ..‘రాష్ట్రంలో నేరగాళ్లు ఇష్టం వచ్చినట్లు తిరుగుతున్నారు. యూపీ ప్రభుత్వం నేరగాళ్లకు లొంగిపోయిందా అనే అంశాన్ని తెలుసుకోవాలనుకుంటున్నాను’ అంటూ ప్రియాంక ట్వీట్ చేశారు. యూపీలో మహిళల మీద వేధింపులు, అత్యాచారాలు, నేరాలు రోజూవారి దినచర్యలో భాగమని ప్రియాంక విమర్శించింది. ప్రజలు ఆటవిక రాజ్యంలో మగ్గిపోతున్నారని మండిపడింది. అయితే ప్రియాంక ట్వీట్‌పై యూపీ పోలీసులు వెంటనే స్పందించారు. నేరగాళ్ల మీద తీసుకున్న చర్యలకు సంబంధించిన డేటా ఆధారంగా ఆమెకు సమాధానమిస్తూ ట్వీట్ చేశారు. తీవ్రమైన నేరాలకు సంబంధించి ఈ రెండు సంవత్సరాల్లో 9,225 నేరగాళ్లను అరెస్టు చేశామని, 81 మందిని ఎన్కౌంటర్ చేశామని వెల్లడించారు. సంచలనం సృష్టించిన కేసులను కేవలం 48 గంటల్లోపే పరిష్కరించామన్నారు. దోపిడీ, హత్యలు, కిడ్నాపులు వంటి నేరాలు తగ్గుముఖం పట్టాయని వెల్లడించారు. రాష్ట్రంలో నేరాల రేటు 20-30 శాతం తగ్గిందని, పోలీసుల పహారా, నేరస్థుల పట్ల కఠిన చర్యల ద్వారా ప్రజల విశ్వాసాన్ని చూరగొన్నామని పోలీసులు వెల్లడించారు. -
యూపీలో దారుణం: చిన్నారిపై అఘాయిత్యం
లక్నో : అభం శుభం తెలియని మూడేళ్ల చిన్నారిపై అత్యాచారం చేసి, బాక్సులో బంధించి తాళం వేసిన ఘటన ఉత్తరప్రదేశ్‌లోని రాంపూర్ పట్టణం పరిధిలోని తండాలో చోటుచేసుకుంది. ఏప్రిల్ 2న జరిగిన ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. చిన్నారిని ఇంట్లోనే ఉంచి బయటికి వెళ్లిన తల్లిదండ్రులను గమనించిన 18 ఏళ్ల పక్కింటి యువకుడు ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. చాక్లెట్ ఇస్తానని చెప్పి తన గదికి తీసుకెళ్లి అత్యాచారం చేశాడు. బాలిక గట్టిగా ఏడవడంతో భయంతో తన గదిలోని ట్రంకు పెట్టలో బంధించి తాళం వేసి పరారయ్యాడు. బాలిక ఏడుపులు విన్న స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చి చిన్నారిని కాపాడారు. యువకుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు అతనిపై పోస్కో (ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రం సెక్సువల్ అఫెన్సెస్) యాక్ట్ కింద కేసు నమోదు చేశారు. -
‘మేమూ అదే చెట్టుకు ఉరేసుకుంటాం’
బదౌన్: కోర్టులో తమకు న్యాయం జరగకపోతే తమ కూతుర్లు ఉరితో వేలాడిన మామిడి చెట్టుకే తామూ ఉరివేసుకుంటామని ఉత్తరప్రదేశ్‌లోని బదౌన్‌లో అత్యాచారం, హత్యకు గురైన ఇద్దరు బాలికల్లో ఒకరి తండ్రి ఆవేదన వ్యక్తం చేశారు. హైదరాబాద్‌లోని సీడీఎఫ్‌డీ నుంచి అందిన డీఎన్ఏ నివేదిక ప్రకారం.. ఈ కేసులో ఇద్దరు బాలికలపై అత్యాచారం జరిగినట్లు నిర్ధారణ కాలేదని సీబీఐ వెల్లడించడంతో కేసు కొత్త మలుపు తిరిగిన సంగతి తెలిసిందే. అయితే ఈ కేసులో కీలక ఆధారాలను పోలీసులు ధ్వంసం చేశారని, సీబీఐ కూడా యూపీ పోలీసుల కోణంలోనే దర్యాప్తు జరుపుతోందని బాలిక తండ్రి ఆవేదన వ్యక్తం చేశారు.