బదౌన్: కోర్టులో తమకు న్యాయం జరగకపోతే తమ కూతుర్లు ఉరితో వేలాడిన మామిడి చెట్టుకే తామూ ఉరివేసుకుంటామని ఉత్తరప్రదేశ్‌లోని బదౌన్‌లో అత్యాచారం, హత్యకు గురైన ఇద్దరు బాలికల్లో ఒకరి తండ్రి ఆవేదన వ్యక్తం చేశారు. హైదరాబాద్‌లోని సీడీఎఫ్‌డీ నుంచి అందిన డీఎన్‌ఏ నివేదిక ప్రకారం.. ఈ కేసులో ఇద్దరు బాలికలపై అత్యాచారం జరిగినట్లు నిర్ధారణ కాలేదని సీబీఐ వెల్లడించడంతో కేసు కొత్త మలుపు తిరిగిన సంగతి తెలిసిందే. అయితే ఈ కేసులో కీలక ఆధారాలను పోలీసులు ధ్వంసం చేశారని, సీబీఐ కూడా యూపీ పోలీసుల కోణంలోనే దర్యాప్తు జరుపుతోందని బాలిక తండ్రి ఆవేదన వ్యక్తం చేశారు.