UV Krishnam Raju
-
క్షత్రియ పుత్రులకే పట్టం
సాక్షి, ఏలూరు : జిల్లాలో నరసాపురం లోక్సభస్థానంలో గెలుపు ఓ మిస్టరీ. ఈ నియోజకవర్గం క్షత్రియులకు పెట్టని కోట. ఇప్పటివరకూ 15సార్లు లోక్సభ ఎన్నికలు జరగ్గా కేవలం రెండుసార్లు మినహా 13 సార్లు ఆ సామాజిక వర్గానికి చెందిన వారే విజయబావుటా ఎగురవేశారు. వాస్తవానికి ఈ నియోజకవర్గంలో జనాభా, ఓటర్ల పరంగా ఆ సామాజికవర్గం తక్కువే. అయినా ఆధిపత్యం మాత్రం వారిదే. భూపతిరాజు విజయకుమార్ రాజు, డి.బలరామరాజు, అల్లూరి సుభాష్ చంద్రబోస్, కనుమూరి బాపిరాజు, ప్రముఖ సినీనటుడు యూవీ కృష్ణం రాజు, ఉద్దరాజు రామం, ఎంటీ రాజు, గోకరాజు గంగరాజు ఈ నియోజకవర్గం నుంచి గెలిచి తమ హవాను చాటారు. -
'బయటకు చెప్పుకోలేక బాధపడుతున్నారు'
కాకినాడ : టీడీపీపై బీజేపీ నేత, కేంద్ర మాజీ మంత్రి యు.వి.కృష్ణంరాజు శనివారం తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో నిప్పులు చెరిగారు. బీజేపీ కార్యకర్తలు ఉత్సాహంగా పని చేయకుండా టీడీపీ అడ్డుపడుతోందని ఆయన ఆరోపించారు. క్షమశిక్షణ గల బీజేపీ కార్యకర్తలు టీడీపీ చర్యలను సహిస్తున్నారని తెలిపారు. టీడీపీ చర్యలను బయటకు చెప్పుకోలేక తమ పార్టీ నేతలు బాధపడుతున్నారని కృష్ణంరాజు ఆవేదన వ్యక్తం చేశారు. బీజేపీతోని పైస్థాయి నాయకులు మాత్రమే టీడీపీతో కలసి ఉండాలని భావిస్తున్నారని చెప్పారు. ఇరు పార్టీల మధ్య చోటు చేసుకున్న ఈ వ్యవహారం గోటితో పోయేదాన్ని గొడ్డలి వరకు వెళ్లకుండా పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా సమావేశంతో సమన్వయం చేయాలని భావిస్తున్నామన్నారు. ఎన్నికలు వస్తే బీజేపీ సొంతంగా నిలబడగల స్థితి రావాలనే ప్రయత్నం చేస్తున్నామని కృష్ణంరాజు తన మనసులోని మాట చెప్పారు.ఆ నిర్ణయం త్వరలోనే వస్తుందన్నారు. -
ప్రముఖ నటుడి పర్సు చోరీ
హైదరాబాద్: ప్రముఖ సినీ నటుడు, కేంద్ర మాజీ మంత్రి యు.వి. కృష్ణంరాజు పర్సును శంషాబాద్ ఎయిర్పోర్ట్లో ఆగంతకులు దొంగిలించారు. పర్సులో పలు క్రెడిట్ కార్డులతోపాటు భారీగా నగదు ఉన్నట్లు ఆయన గురువారం తెలిపారు. గత రాత్రి బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా హైదరాబాద్ విచ్చేశారు. ఆయనకు స్వాగతం పలికేందుకు ఆ పార్టీకి చెందిన నేతలంతా శంషాబాద్ ఎయిర్పోర్ట్ చేరుకున్నారు. అమిత్ షాకు స్వాగతం పలికే క్రమంలో కృష్ణంరాజు ప్యాంట్ జేబులోని పర్సును ఆగంతకులు చోరీ చేశారు. -
సొంతింటికి వెళ్లినట్టుంది: కృష్ణంరాజు
భీమవరం: బీజేపీలో తిరిగి చేరడం తన సొంతింటికి వెళ్లినట్లుగా ఉందని సినీ నటుడు, కేంద్ర మాజీమంత్రి యూవీ కృష్ణంరాజు పేర్కొన్నారు. ఇటీవల బీజేపీ గూటికి వెళ్లిన ఆయన మంగళవారం భీమవరం వచ్చారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడారు. దేశానికి ఆశాకిరణం నరేంద్ర మోడీ అని, ఏదైనా చేసి చూపించగల సత్తా ఉన్న నాయకుడని కొనియాడారు. పదేళ్లుగా దేశంలోని మహిళలకు రక్షణ కరువైందని, పిల్లలకు పోషకాహారం అందడం లేదని, నిరుద్యోగులకు ఉద్యోగాలు లేవని అన్నారు. రానున్న ఎన్నికల్లో బీజేపీ తరఫున పోటీ చేసేందుకు తాను సిద్ధంగా ఉన్నానని, పార్టీ అధిష్టానం ఎక్కడ నుంచి పోటీ చేయమంటే అక్కడనుంచి పోటీ చేస్తానన్నారు. గతంలో కేంద్ర మంత్రిగా పనిచేసిన తాను నరసాపురం పార్లమెంటరీ నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేశానని, ఏ గ్రామానికి వెళ్లినా ప్రజలు తాను చేసిన పనులను గుర్తుచేసి సంతోషపడటం తనకు ఎంతో ఆనందాన్ని కలగజేస్తోందన్నారు. ప్రత్యక్ష ఎన్నికల్లో ప్రజల చేత ఎన్నుకోబడటమే తనకు ఇష్టమని ఆయన అన్నారు