క్షత్రియ పుత్రులకే పట్టం | Narsapuram Lok Sabha Constituency Is Only For Kshatriya's | Sakshi
Sakshi News home page

క్షత్రియ పుత్రులకే పట్టం

Published Sat, Mar 16 2019 9:28 AM | Last Updated on Sat, Mar 23 2019 8:59 PM

Narsapuram Lok Sabha Constituency Is Only For Kshatriya's - Sakshi

కనుమూరి బాపిరాజు, కృష్ణంరాజు, గోకరాజు రంగరాజు

సాక్షి,  ఏలూరు : జిల్లాలో నరసాపురం లోక్‌సభస్థానంలో గెలుపు ఓ మిస్టరీ. ఈ నియోజకవర్గం క్షత్రియులకు పెట్టని కోట.  ఇప్పటివరకూ 15సార్లు లోక్‌సభ ఎన్నికలు జరగ్గా కేవలం రెండుసార్లు మినహా 13 సార్లు ఆ సామాజిక వర్గానికి చెందిన వారే విజయబావుటా ఎగురవేశారు. వాస్తవానికి ఈ నియోజకవర్గంలో జనాభా, ఓటర్ల పరంగా ఆ సామాజికవర్గం తక్కువే. అయినా ఆధిపత్యం మాత్రం వారిదే. భూపతిరాజు విజయకుమార్‌ రాజు, డి.బలరామరాజు, అల్లూరి సుభాష్‌ చంద్రబోస్, కనుమూరి బాపిరాజు, ప్రముఖ సినీనటుడు యూవీ కృష్ణం రాజు, ఉద్దరాజు రామం, ఎంటీ రాజు, గోకరాజు గంగరాజు ఈ నియోజకవర్గం నుంచి గెలిచి తమ హవాను చాటారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement