సొంతింటికి వెళ్లినట్టుంది: కృష్ణంరాజు | UV Krishnam Raju happy to return to BJP | Sakshi
Sakshi News home page

సొంతింటికి వెళ్లినట్టుంది: కృష్ణంరాజు

Published Wed, Jan 29 2014 6:05 PM | Last Updated on Sat, Sep 2 2017 3:09 AM

సొంతింటికి వెళ్లినట్టుంది: కృష్ణంరాజు

సొంతింటికి వెళ్లినట్టుంది: కృష్ణంరాజు

భీమవరం: బీజేపీలో తిరిగి చేరడం తన సొంతింటికి వెళ్లినట్లుగా ఉందని సినీ నటుడు, కేంద్ర మాజీమంత్రి యూవీ కృష్ణంరాజు పేర్కొన్నారు. ఇటీవల బీజేపీ గూటికి వెళ్లిన ఆయన మంగళవారం భీమవరం వచ్చారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడారు. దేశానికి ఆశాకిరణం నరేంద్ర మోడీ అని, ఏదైనా చేసి చూపించగల సత్తా ఉన్న నాయకుడని కొనియాడారు. పదేళ్లుగా దేశంలోని మహిళలకు రక్షణ కరువైందని, పిల్లలకు పోషకాహారం అందడం లేదని, నిరుద్యోగులకు ఉద్యోగాలు లేవని అన్నారు.

రానున్న ఎన్నికల్లో బీజేపీ తరఫున పోటీ చేసేందుకు తాను సిద్ధంగా ఉన్నానని, పార్టీ అధిష్టానం ఎక్కడ నుంచి పోటీ చేయమంటే అక్కడనుంచి పోటీ చేస్తానన్నారు. గతంలో కేంద్ర మంత్రిగా పనిచేసిన తాను నరసాపురం పార్లమెంటరీ నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేశానని, ఏ గ్రామానికి వెళ్లినా ప్రజలు తాను చేసిన పనులను గుర్తుచేసి సంతోషపడటం తనకు ఎంతో ఆనందాన్ని కలగజేస్తోందన్నారు. ప్రత్యక్ష ఎన్నికల్లో ప్రజల చేత ఎన్నుకోబడటమే తనకు ఇష్టమని ఆయన అన్నారు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement