29 నుంచి అగ్రి డిప్లోమా కోర్సు ప్రారంభం
హైదరాబాద్: ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయ పరిధిలోని రెండేళ్ల వ్యవసాయ, విత్తన సాంకేతిక పరిజ్ఞానం, మూడేళ్ల అగ్రికల్చరల్ ఇంజనీరింగ్ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశానికి ఈ నెల 29 నుంచి వచ్చే నెల 2 వరకు హైదరాబాద్ రాజేంద్రనగర్‌లోని విశ్వవిద్యాలయం ఆడిటోరియంలో కౌన్సిలింగ్ నిర్వహించనున్నట్లు రిజిస్ట్రార్ డాక్టర్ వి.ప్రవీణ్‌రావు శనివారం తెలిపారు. దరఖాస్తు చేసుకున్న అర్హులైన అభ్యర్థులు మాత్రమే కౌన్సిలింగ్‌కు హాజరుకావాలని పేర్కొన్నారు.
అగ్రి ఇంజనీరింగ్ సెట్-2015’కు 5వ తేదీ వరకు దరఖాస్తు గడువు మూడేళ్ల అగ్రి ఇంజనీరింగ్ డిప్లొమా పూర్తయిన విద్యార్థుల కోసం నిర్వహించే అగ్రి ఇంజనీరింగ్ సెట్-2015కు వచ్చే నెల 5 లోపల దరఖాస్తు చేసుకోవాలని ప్రవీణ్‌రావు తెలిపారు. ప్రొఫెసర్ జయశంకర్ వర్సిటీలో మూడేళ్ల డిప్లొమా కోర్సు పూర్తి చేసుకున్న వారు మాత్రమే సెట్‌కు దరఖాస్తు చేసుకునేందుకు అర్హులని పేర్కొన్నారు. సెట్లో ర్యాంకులు, మెరిట్, ఇతర నిబంధనల ప్రకారం అగ్రి ఇంజనీరింగ్ రెండో సంవత్సరానికి ప్రవేశాలు కల్పిస్తారు. సెట్ ప్రవేశపరీక్ష వచ్చే నెల 11న రాజేంద్రనగర్‌లోని వ్యవసాయ కళాశాలలో జరుగుతుంది.